• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఓ వ్యక్తి మృతి

KMM: పెళ్లైన మూడు నెలలకే ఆ ఇంట్లో హోలీ పండుగ తీరని శోకాన్ని నింపింది. ఏన్కూరుకు చెందిన మల్లు సాయి బుధవారం స్నేహితులతో కలిసి హోలీ ఆడుతూ సరదాగా ఈత కోసం కాలువలోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సాయి మరణంతో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఈ ఘటనపై ఎస్సై సంధ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 5, 2026 / 08:09 AM IST

ప్రమాదవశాత్తు మామిడి కొమ్మ పైనపడి వ్యక్తి మృతి

ELR: ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జలసూత్రం రంగారావు (57) మామిడి కొమ్మలు కోయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు భారీ కొమ్మ పైనపడి మృత్యువాతపడ్డాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లగా ఈ దుర్గటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 08:08 AM IST

ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలి : కలెక్టర్

సూర్యాపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.హాస్టల్ డైనింగ్ హాల్, కిచెన్, లైబ్రరీలను పరిశీలించి, భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యల కోసం వెంటనే ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.

March 5, 2026 / 08:07 AM IST

2 నెలల కష్టం ‘రై రై రారా’: అనంత శ్రీరామ్

‘పెద్ది’ మూవీలోని ‘రై రై రారా’ సాంగ్ మేకింగ్ గురించి రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రెహమాన్ ప్రయోగాత్మక బాణీ కోసం దాదాపు 2 నెలలు కష్టపడి ఈ పాట రాశారట. మాస్ ట్యూన్‌లో తాత్వికతని రంగరించి అచ్చ తెలుగులో ఈ పాటను రూపొందించాడు. కేవలం ప్రేమ పాట మాత్రమే కాకుండా, జీవిత ప్రయాణం గురించి గొప్ప సందేశాన్ని అందించేలా ఈ మాస్ సాంగ్ సాగుతుందని ఆయన తెలిపాడు.

March 5, 2026 / 08:07 AM IST

ఆరేపల్లి శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

KNR: కరీంనగర్ పట్టణం ఆరేపల్లి గ్రామ శివారులోని పత్తి చేనులో సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మృతుడు తెల్లని గడ్డంతో, తెల్లని బనియన్, ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు 8712670764 నంబరును సంప్రదించాలని కోరారు.

March 5, 2026 / 08:06 AM IST

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం

సత్యసాయి: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సత్యసాయి జిల్లాలోని దివ్యాంగులకు ఈనెల 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాలోని ధర్మవరంలో 7,150 మంది, కదిరిలో 6,081, పుట్టపర్తిలో 5,983, పెనుగొండలో 5,027 మంది లబ్ధిదారులు ఉన్నారు. హిందూపురం, మడకశిర, రాప్తాడు డివిజన్ల పరిధిలోని వికలాంగులకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.

March 5, 2026 / 08:06 AM IST

‘రేపటి నుంచి ఉచిత డ్రైవింగ్ శిక్షణ’

ASR: జిల్లాలోని 11 మండలాలకు చెందిన 120 మంది నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు రేపటి నుంచి 45 రోజులపాటు డ్రైవింగ్‌పై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో దీనికి సంబందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

March 5, 2026 / 08:06 AM IST

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో శనగ ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలు..?

కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్‌మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, DCMSను ఏజెన్సీగా నియమించుకుంది. DCMS వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21 మంది ప్రైవేట్ వారిని ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టారు.

March 5, 2026 / 08:05 AM IST

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష సమావేశం’

ADB: జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య డ్రైవ్ పెండింగ్ ఫైళ్ల పరిష్కార కార్యక్రమం చేపట్టాలని రాజర్షి షా ఆదేశించారు.

March 5, 2026 / 08:03 AM IST

పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య

CTR: జిల్లాలో పరీక్షల భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్తూరు-2 టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. నగరంలోని టెలిఫోన్ కాలనీలో ఉన్న రజియా టెన్త్ క్లాస్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. త్వరలో టెన్త్ క్లాస్ పరీక్షల భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

March 5, 2026 / 08:02 AM IST

బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన DCCB ఛైర్మన్

VZM: డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో నాబార్డ్‌ సహకారంతో నిర్వహిస్తున్న FCC బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు బెల్లం తయారీలో సాంకేతిక సలహాలు ఇవ్వడంలో DCCB ఎప్పుడు ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సమీపంలోని దీక్షా మహిళా వెల్‌ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని సందర్శించి పలు సూచనలు చేసారు.

March 5, 2026 / 08:02 AM IST

HYDలో మరో రియల్ ఎస్టేట్ కుంభకోణం

హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్ల పేరుతో వందలాది మంది బాధితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన త్రిపుర కన్స్ట్రక్షన్స్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థ ఎండీ పసుపులేటి సుధాకర్, ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి కుమార్తె, అల్లుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

March 5, 2026 / 08:02 AM IST

నేడు టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

NLG: టెన్త్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ సారి మూడు రకాలుగా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్ సైట్‌లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్‌కు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్ టికెట్లను సైతం స్కూళ్లకు చేరవేస్తారు. హాల్ టికెట్ల కోసం https://bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.

March 5, 2026 / 08:01 AM IST

ఇంటర్ విద్యార్థులకు ALERT

TG: రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు సంబంధించి అధికారులు ‘సెట్-ఏ’ (Set-A) ప్రశ్నాపత్రాన్ని ఖరారు చేశారు. ఇవాళ మ్యాథ్స్ పేపర్-1B, జూవాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఈ అప్‌డేట్‌ను గమనించగలరు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి.

March 5, 2026 / 08:01 AM IST

తిరుపతిలో దొంగలు అరెస్ట్

TPT: శ్రీదేవి కాంప్లెక్స్ గేట్ వద్ద ఈస్ట్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఇంద్రావత్ పవన్ కుమార్ నాయక్, ఎరగ అశోక్ ఉన్నారు. వీరు శ్రీనివాసం, విష్ణునివాసం, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తుల నుంచి సెల్ ఫోన్లు, నగదు, బంగారు నగలు అపహరిస్తూ దొంగతనాలు చేస్తున్నారు. పోలీసులు వారి నుంచి రూ. 2.5 లక్షల విలువైన 14 ఫోన్లు, రూ. 3 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

March 5, 2026 / 08:01 AM IST