విండీస్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తన ఇన్నింగ్స్‌పై శాంసన్(97*) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది తనకెంతో ప్రత్యేకమని, క్రికెట్ ఆడటం ప్రారంభించిన తొలి రోజు నుంచీ దీని కోసమే ఎదురుచూశానని పేర్కొన్నాడు. కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న తన నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఊహించలేదన్నాడు. కాగా ఛేజింగ్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సంజూదే.
KMR: దోమకొండ మండల కేంద్రం నుంసీ ముత్యంపేట గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీటీ రోడ్డు కోసం కంకర వేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
SDPT: పుల్లూరు బండ త్రికుటేశ్వరాలయంలో నేడు కోటి తలంబ్రాల దీక్ష చేపడుతున్నట్లు గజ్వేల్‌కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. భద్రాచల రామయ్య కళ్యాణానికి గోటితో వడ్లు ఓలిచి అందించే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెం మండల పోలీస్ స్టేషన్ నూతన SIగా దేవకుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన SI చౌడయ్య జిల్లా VRకు బదిలీ కావడంతో ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు దేవకుమార్ను ఇక్కడకు నియమించారు. బాధ్యతలు చేపట్టిన నూతన SIకి స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై పేర్కొన్నారు.
TG: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో HYDలో నిరసన ర్యాలీలు చేపడుతుండడంతో అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంచారు. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఈ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికన్ కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని స్టార్ హోటళ్లపైనా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు.
SRD: జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పెద్దమ్మగూడెం చెందిన బంగారి రాజు (24) వ్యవసాయ పొలం వద్ద ఉన్న మత్తడిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. తండ్రి ముత్యాలు, స్థానికులు వెతికి మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
దుబాయ్, ఖతార్ సహా ఏడు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో అక్కడ ఉన్న స్టార్ హీరోలు అజిత్, మాధవన్ భద్రతపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే వారిద్దరూ క్షేమంగా ఉన్నారని, ఎటువంటి ముప్పు లేదని వారి సిబ్బంది అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం వారు సురక్షిత ప్రాంతంలో ఉన్నారని తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
GDWL: జిల్లాలో బాలికలపై అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 14 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల వద్ద బైక్‌పై దింపుతామని నమ్మించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాలల భద్రత అందరి బాధ్యతని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AP: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచు కారణంగా ఉదయం రెండు విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం కలిగింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం, ఢిల్లీ ఎయిరిండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. ప్రయాణికులు ఆందోళనకు గురైనట్టు సమాచారం.
VKB: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:40 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. అనంతరం అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ నిర్వహించనున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సాయంత్రం 4:20 వరకు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు వీరికి స్వాగతం పలకనున్నారు.
AKP: ఉపాధి హామీ పథకం వేతనదారులకు సోమవారం నుంచి ముఖ ఆధారిత హాజరు అమలులోకి వచ్చింది. ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు నమోదు చేశారు. మండలంలో పలు గ్రామాల్లో పనిచేస్తున్న 2,200 మందికి ముఖ ఆధారిత హాజరు వేసినట్లు ఏపీఓ ఎరకయ్య తెలిపారు. బినామీ మస్తర్లలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు.
SKLM: జామి యల్లారమ్మ పండగలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందిస్తూ,వారి సేవలను కొనియాడారు. అనంతరం అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సుమారు 10 వేల మంది భక్తులకోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని వడ్డించారు.
GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం గుంటూరు ఈస్ట్ సబ్-డివిజన్ పరిధిలో మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం అందరి బాధ్యతని, అన్యాయం జరిగితే ధైర్యంగా స్పందించి పోలీసుల ‘శక్తి టీమ్’ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
SRPT: ముస్లింల రంజాన్ ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుసుమ ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్జంగ్ పేటలో విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్ బాలేమియా నివాసంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఆమె ప్రారంభించారు. ఇఫ్తార్ విందులు ఇవ్వడం పుణ్యకార్యమని ఆమె పేర్కొన్నారు.
SS: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో, డీఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ నేతృత్వంలో లేపాక్షి పరిధి కొండూరు గ్రామంలో ఎస్సై. నరేంద్ర, సిబ్బందితో గ్రామసభ నిర్వహించారు. ఆస్తి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, అనుమానాస్పద కార్యకలాపాలపై అవగాహన కల్పించారు.