NDL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కోసం రూ.86.68 లక్షల నిధులు విడుదల చేసి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆదివారం అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలపై స్పందిస్తూ.. వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
NRPT: సమాజంలో యువకులు చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి దేశ రక్షణకు ధర్మరక్షణకు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా ప్రచారక్ భార్గవ్ కోరారు. ఆదివారం ధన్వాడ జూనియర్ కళాశాల మైదానంలో 11 గ్రామాలకు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు.దేశంలో హిందువులు మెజార్టీగా ఉంటేనే లౌకిక భావాలు కాపాడబడతాయన్నారు.
అన్నమయ్య: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వేతనాల పెంపుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు.
KMM: పెనుబల్లి సప్తగిరి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం కరాటే ఛాంపియన్‌షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్ట రాగమయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు బాల్యం నుంచి కరాటే నేర్పించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అలాగే కరాటే నేర్చుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోకపోవడంపై కేడర్లో అసహనం వ్యక్తమవుతోంది.
ASR: మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయని ముంచంగిపుట్టు ఎస్సై పీ.నాని తెలిపారు. మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ముంచంగిపుట్టులో ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలను అందరూ గౌరవించాలని, వివక్షత చూపకూడదని సూచించారు.
MDK: చేగుంటలో MRPS మండల అద్యక్షుడు కొలుపుల రామస్వామి మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన దండోరా ముద్దుబిడ్డల త్యాగంతో వర్గీకరణ సాధించుకున్నామని చాటుదామన్నారు.
MHBD: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుడుం దెబ్బ, ఆదివాసి మహిళా సంఘం ఆధ్వర్యంలో “ఆదివాసి మహిళ రాష్ట్ర” సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాము పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులతో కలిసి సదస్సు కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు.
W.G: ఈ నెల 3వ తేదీన కేతుగ్రస్త చంద్ర గ్రహణం సందర్భంగా మావుళ్లమ్మ ఆలయాన్ని మూసివేసి, 4వ తేదీన తెరుస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. 3వ తేదీ పౌర్ణమి జరిగే చండీ హోమం ఉదయం 6 గంటలకు మొదలై 9 గంటలకు ముగుస్తుందని అన్నారు. మూడో తేదీ ఉదయం 9 గంటలకు ఆలయం మూసి, 4వ తేదీ ఉదయం 8 గంటలకు అమ్మవారి మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు.
HNK: పరకాల మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొచ్చు మహేందర్ మాతృమూర్తి బొచ్చు ఐలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్ కుమార్ మృతురాలి ఇంటికి వెళ్లి.. ఆమె పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
NDL: ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చొప్పున చెక్కులను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
SRD: చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెంలో సర్పంచి జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమంలో ఆదివారం నిర్వహించారు. ముంబాయ్ ఇన్ కామ్ టాక్స్ జాయింట్ డైరెక్టర్ సుధాకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. శ్రమదానం వల్ల గ్రామాలు శుభ్రంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
MLG: వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులను ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సర్పంచులు గ్రామ అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టి వేగంగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
NLR: నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆదివారం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మేయర్ సుజాతను అభినందిస్తూ, నెల్లూరు నగర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘సరస్వతి’ మూవీ మార్చి 6న విడుదల కానుంది. HYDలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాధికా శరత్‌కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆయన స్వయంగా వేసి పెట్టిన ‘చిరంజీవి దోశ’ గురించి ఆమె గుర్తు చేసుకుంది. ఆ దోశ మల్లెపువ్వులా మెత్తగా ఉందని, అలాంటి రుచిని తానెక్కడా చూడలేదని తెలిపింది.