• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

KMR: మేరు కులస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా బాన్సువాడ మేరు సంఘం సభ్యులు శనివారం రోజున డీఏవోకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మేరు సంఘం అధ్యక్షులు విటూరి హనుమాన్లు కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తూన్న తమ కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వ పరంగా వర్తించే ఫలాలను అందించాలని కోరారు.

February 28, 2026 / 08:45 PM IST

క్షతగాత్రులకు సీఎం చంద్రబాబు పరామర్శ

AP: కాకినాడ జిల్లా సామర్లకోట వేట్లపాలెం పేలుడు ఘటనలో గాయపడి GGHతో పాటు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను CM చంద్రబాబు పరామర్శించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తారని, ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 08:44 PM IST

చిత్తూరులో పింఛన్లు పంపిణీ చేసిన మేయర్..!

CTR: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 17వ వార్డు మసీదుమిట్టలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టు మేయర్ అముద చెప్పారు. ఈ కార్యక్రమంలో గురజాల చెన్నకేశవుల నాయుడు, సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్ పాల్గొన్నారు.

February 28, 2026 / 08:42 PM IST

ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి: కమిషనర్

TPT: నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. కమిషనర్ చిన్ననాటి నుంచే పర్యావరణ బాధ్యతను పెంపొందించడం అవసరమని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములవ్వాలన్నారు.

February 28, 2026 / 08:40 PM IST

చింతలగరువు స్కూల్లో టైలర్స్ డే

W.G: పోడూరు(మం) చింతలగరువు స్కూల్లో, టైలరింగ్ షాపులోను శనివారం టైలర్స్ డే జరిపారు. H.M. కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ.. ఏలియాస్ హోవే రూపొందించిన ఆధునిక కుట్టుమిషన్‌కి 1846 ఫిబ్రవరి 28న పేటెంట్ లభించడంతో ప్రతి సంవత్సరం ప్రపంచ దర్జీల దినోత్సవంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ మట్టా నాగ రాజు, ట్రైనీ టీచర్ కే. సాయి లక్ష్మి, ఆంజనేయులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:40 PM IST

ప్రమాదాలకు నిలయంగా మత్కేపల్లి బస్ స్టాప్

KMM: చింతకాని (M) ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ఉన్న రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. రింగ్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మత్కేపల్లి రింగ్ రోడ్డు వద్ద తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 08:39 PM IST

‘ఏటీడీవో కార్యాలయాన్ని ఖమ్మం కలెక్టరేట్ కు మార్చాలి’

KMM: గిరిజన అభివృద్ధి శాఖ ఏటీడీవో కార్యాలయాన్ని ఖమ్మం కలెక్టరేట్ కు మార్చాలని PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ అన్నారు. శనివారం PDSU ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి డి.డి. విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఎస్టీ బాలుర వసతి గృహంలోనే ఏటీడీవో కార్యాలయం కొనసాగుతుండటంతో వసతి గృహ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

February 28, 2026 / 08:38 PM IST

మార్పులు లేకుండానే బరిలోకి..!

వెస్టిండీస్‌తో రేపటి మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో జింబాబ్వేపై విజయం సాధించిన విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి సంజూ, అభిషేక్ జోడీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. అదే ప్లేయింగ్-11తో విండీస్‌ను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది.

February 28, 2026 / 08:37 PM IST

NPDCL చరిత్రలో అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్

WGL: NPDCL చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదైందని NPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ WGLలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి లోనే 6057 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు అయినట్లు తెలిపారు. వేసవి కాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

February 28, 2026 / 08:36 PM IST

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

MNCL: లక్షెట్టిపేట పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేసిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శనివారం లక్షెట్టిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ నోట్లు చలామణి చేసిన 14 మందిని గుర్తించామని, అందులో 12 మందిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. వారి నుండి రూ.5,98,500 ఫేక్ కరెన్సీ, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

February 28, 2026 / 08:35 PM IST

జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు

NRPT: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు లభించిందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. FLN AI AXL కార్యక్రమాన్ని జిల్లాలోని పాఠశాలలో సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా అవార్డు లభించిందన్నారు. గణన సామర్థ్యాల బలోపేతం దిశగా జిల్లాలో ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడంతో అవార్డు సాధ్యమైందని అన్నారు.

February 28, 2026 / 08:34 PM IST

పెదకూరపాడులో బాల్య వివాహాలపై అవగాహన

PLD: పెదకూరపాడు అంగన్వాడీ 3వ సెంటర్‌లో శనివారం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. icds ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హెచ్ఎం రమణ పాల్గొన్నారు. చిన్న వయసులో పిల్లలకు పెళ్లి చేయడం ద్వారా గర్భం దాల్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. పిండం అభివృద్ధి చెందక అంగవైకల్యం కలిగిన బిడ్డలు పుట్టే అవకాశం ఉందన్నారు.

February 28, 2026 / 08:33 PM IST

బుసిరెడ్డిపల్లిలో సైన్స్ దినోత్సవం

WNP: సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుసిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ విద్య ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. సైన్స్ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:32 PM IST

‘అటవీ అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం’

MLG: వాజేడు మండలం పెనుగోలు కాలనీ పుసురు బీట్ పరిధిలో శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో వేసవి కాలంలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు.

February 28, 2026 / 08:31 PM IST

‘వైద్యులపై దాడులు ఆపాలి’

KNR: HYDలోని రెండు ఆసుపత్రుల్లో రోగి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బంది, సామగ్రిపై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ జమ్మికుంట, హుజురాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో జమ్మికుంటలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు కృషి చేస్తారని, అనూహ్య మరణాలపై దాడులు చేయడం సరైంది కాదన్నారు.

February 28, 2026 / 08:31 PM IST