W.G: పోడూరు(మం) చింతలగరువు స్కూల్లో, టైలరింగ్ షాపులోను శనివారం టైలర్స్ డే జరిపారు. H.M. కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ.. ఏలియాస్ హోవే రూపొందించిన ఆధునిక కుట్టుమిషన్కి 1846 ఫిబ్రవరి 28న పేటెంట్ లభించడంతో ప్రతి సంవత్సరం ప్రపంచ దర్జీల దినోత్సవంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ మట్టా నాగ రాజు, ట్రైనీ టీచర్ కే. సాయి లక్ష్మి, ఆంజనేయులు పాల్గొన్నారు.