• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉచిత సోలార్ యూనిట్ల ప్రారంబించిన కలెక్టర్

నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీ, పొన్నాపురం ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ల స్థాపన పనులను జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గి, ఆర్థికంగా మేలు చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు.

February 27, 2026 / 02:05 PM IST

నాని, సుజీత్ మూవీలో పృథ్వీరాజ్?

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ‘బ్లడీ రోమియో’ మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పృథ్వీరాజ్ ‘వారణాసి’ మూవీతో బిజీగా ఉన్నాడు.

February 27, 2026 / 02:05 PM IST

మృతురాలికి నివాళులర్పించిన సీపీఎం నేతలు

NLG: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రుద్రవరం పిచ్చమ్మకు ఇవాళ సీపీఎం నేతలు నివాళులర్పించారు. జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, బొబ్బలి సుధాకర్ రెడ్డి, చొప్పరి మల్లేశం, సరోజ, సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

February 27, 2026 / 02:04 PM IST

రోడ్డు భద్రత ఉద్యమంపై విద్యార్థిలకు అవగాహన

సూర్యాపేట: ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలోని ప్రగతి హైస్కూల్లో రోడ్డు భద్రతపై ఎస్సై రవీందర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడప వద్దన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు.

February 27, 2026 / 02:04 PM IST

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ మండలంలోని లఖంపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో సైన్స్ ల్యాబ్, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ నగేష్‌తో కలిసి భూమిపూజ చేశారు. రూ. 80 లక్షలతో సిబ్బంది గృహాలు రూ. 21లక్షలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1

February 27, 2026 / 02:02 PM IST

ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు

 అన్నమయ్య: అన్ని ప్రైవేటు పాఠశాలలో 2026-27 సంవత్సరానికి గాను 2009 ప్రకారం 1వ తరగతిలో ఉచితంగా చేరెందుకు ప్రవేశాలకు ఫిబ్రవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాజంపేట మండల విద్యాశాఖ అధికారులు రఘునాథరాజు, డి. సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు వారు రాజంపేట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన ప్రచార పత్రాలను విడుదల చేశారు.

February 27, 2026 / 02:02 PM IST

ఎల్లారెడ్డి మండల పంచాయతీ అధికారిగా ప్రభాకర చారి

KMR: నాగిరెడ్డిపేట్ మండలంలో మండల పంచాయితీ అధికారిగా విధులు నిర్వర్తించిన ప్రభాకర చారి డిప్యూటేషన్‌పై ఎల్లారెడ్డి మండలానికి వచ్చారు. ఎల్లారెడ్డి మండలంలో మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించిన ఏ.ప్రకాష్ నాగిరెడ్డిపేట మండలానికి డిప్యూటేషన్‌పై వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు అధికారులకు ఉన్నత అధికారులు డిప్యూటేషన్‌పై నియమించారు.

February 27, 2026 / 02:02 PM IST

అక్రమ ఇసుక తరలింపు.. రెండు ట్రాక్టర్ల సీజ్

KNR: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. కాచాపూర్ గ్రామ శివారులో వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన సంఘీ రాజు, నేదురు కనకయ్యలు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు.

February 27, 2026 / 02:01 PM IST

‘కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి’

SRPT: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో దళితులపై దాడి చేసి, రెండు నెలల పసిబిడ్డ ప్రాణాలు తీసిన నిందితులను ఉరితీయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్ డిమాండ్ చేశారు. నేడు సూర్యాపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలో ఇంతటి అమానుషం జరిగినా ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదన్నారు.

February 27, 2026 / 02:01 PM IST

కొత్తవలస మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం

VZM: కొత్తవలస మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై కమిటీ డైరెక్టర్లతో కలిసి ఆమె సుదీర్ఘంగా చర్చించారు. మార్కెట్ కమిటీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు పాలకమండలి సభ్యులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలక తీర్మానాలను ఆమోదించారు.

February 27, 2026 / 02:00 PM IST

జనసేన పార్టీ సభ్యత్వాలుపై సమీక్ష సమావేశం

SKLM: గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కూడా ఛైర్మన్ కొరికానా రవికుమార్ కోరారు. శుక్రవారం మెలియాపుట్టి మండలంలోని చాపర కళ్యాణమండపంలో జనసేన సభ్యత్వాల గూర్చి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాలలో పర్యటించి జనసేన సభ్యత్వాలు చేయించాలని సూచించారు. ఆయనతోపాటు జనసేన నాయకురాలు కొరీకాన భవాని ఉన్నారు.

February 27, 2026 / 02:00 PM IST

‘జీడిపిక్కకు కేజీ 200 మద్దతు ధర ఇవ్వాలి’

AKP: మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ కొండవీటి, కామకోటం గ్రామాల్లో జీడి రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. జీడిపిక్కకు కేజీ రూ.200 ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీడి పిక్కలు 80 కేజీల బస్తా రూ.18వేలకు మద్దతు ప్రకటించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా జీడి తోటల అభివృద్ధి చేయాలన్నారు.

February 27, 2026 / 02:00 PM IST

ఇంటి పన్నుల వసూళ్లలో నక్కపల్లి ఫస్ట్

AKP: నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లలో 80 శాతంతో నక్కపల్లి మండలం మొదటి స్థానంలో ఉన్నట్లు డీఎల్డీవో నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కోటవురట్లలో ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవో చంద్రశేఖర్‌తో కలిసి స్పెషల్ నిర్వహించారు. మార్చి 15 లోగా శత శాతం ఇంటి పనులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 02:00 PM IST

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిన లేడీ డాక్టర్

నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రత్యూష రెడ్డి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరానన్నారు. ఆమెకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తన మాట నమ్మి పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్త, నాయకుడిని గౌరవంగా చూసుకునే బాధ్యత తనదేనని కోటంరెడ్డి చెప్పారు.

February 27, 2026 / 01:58 PM IST

ఉరేసుకుని గుర్తుతెలియని మహిళ మృతి

TPT: రేణిగుంట మండలం అడుసుపాలెం జగనన్న లేఅవుట్‌లో గుర్తుతెలియని మహిళ మృత చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ఉరివేసుకుని మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 01:56 PM IST