• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళలు కుంకుమపువ్వు తీసుకుంటే?

కుంకుమపువ్వు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక మూలకాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ కుంకుమపువ్వును నిత్యం పాలు, టీ రూపంలో తీసుకోవాలి. చర్మం నిగారింపునకు తోడ్పడుతుంది. రోజుకు 30mg కంటే ఎక్కువ తీసుకోవద్దు.

February 23, 2026 / 12:03 PM IST

గుడిసె దగ్ధం.. ఎద్దు మృతి

NRPT: కావలి మల్లప్ప అనే రైతు మద్దూరు శివారు కాజీపురం రోడ్డులోని పొలం వద్ద 4 ఎద్దులను గుడిసెలో కట్టివేశాడు. దోమల బెడద తగ్గించేందుకు ఆదివారం మంట పెట్టి రాత్రి 9:30 గంటలకు ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలో గుడిసెకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. దీంతో గుడిసెలో ఉన్న 3 ఎద్దులు తాడు తెంచుకుని బయటపడగా, ఒక ఎద్దు అక్కడికక్కడే కాలిపోయి మృతిచెందింది. దీంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు.

February 23, 2026 / 12:01 PM IST

అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA

NZB: రాష్ట్రంలో గిరిజన అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ధర్పల్లిలోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

February 23, 2026 / 12:01 PM IST

జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

Akp: జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వ విడత సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. ఉద్యమి, సాధక్, ప్రధాతగా మూడు వర్గాలుగా సభ్యత్వాన్ని విభజించినట్లు పేర్కొన్నారు. కరపత్రాలను విడుదల చేశారు.

February 23, 2026 / 12:01 PM IST

ప్రభుత్వ ఉమెన్స్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

శ్రీకాకుళం ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆయన సంబంధిత గదులకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం వైద్య సదుపాయం పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడరాదన్నారు.

February 23, 2026 / 12:00 PM IST

పోడు భూములపై గ్రామస్తుల వినతి

BDK: బూర్గంపహాడ్ మండలం, బట్టిగూడెం గ్రామంలో పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఫారెస్ట్ అధికారుల చర్యలపై సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావుకు తెలియజేయగా, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ జీవనాధారాన్ని కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

February 23, 2026 / 12:00 PM IST

డ్రోన్ సహాయంతో కోడి పందాల నిర్వహకుల పట్టివేత

NLR: మనుబోలు మండలం పిడూరుపాలెం పొలాల్లో సోమవారం కోడిపందాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో పోలీసులు డ్రోన్ కెమెరా ప్రయోగించారు. కోడిపందాలు ఆడుతున్న వారిని గుర్తించి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 21 బైకులు, రూ. 800 నగదు, 5 కోళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై శివ రాకేష్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 11:59 AM IST

కనిగిరిలో TDP కార్యకర్తల సమావేశం

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక TDP కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 11:59 AM IST

BREAKING: తిరుమల లడ్డూ కేసులో కీలక తీర్పు

AP: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిచింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్‌లాపింగ్ కిందకు రాదని తేల్చింది. పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఈ మేరకు సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

February 23, 2026 / 11:58 AM IST

బకాయిలు చెల్లించి కార్మికులను ఆదుకోండి: ఎమ్మెల్యే

NLR: 15 ఏళ్లుగా మూతపడి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభలో సోమవారం గళమెత్తారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 3 వేల మంది కార్మికులు పని చేసేవారన్నారు.పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

February 23, 2026 / 11:56 AM IST

కొమరోలులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ప్రకాశం: కొమరోలు మండలంలోని మాధవపల్లె గ్రామ సమీపంలోని క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సూరే శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

February 23, 2026 / 11:50 AM IST

ఘనంగా ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం

VSP: చినగదిలిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఇవాళ ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 23న పద్మశ్రీ పి.సి.సర్కార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలికలు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని నిర్వాహకులు సూచించారు.

February 23, 2026 / 11:50 AM IST

నర్సీపట్నంలో న్యాయవాదులు నిరసన

AKP: నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో సోమవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట ప్రభాకర్ మాట్లాడుతూ కర్నూలు సిటీలో పవన్ కుమార్ అనే న్యాయవాది మీద సీఐ విక్రమ సింహ దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

February 23, 2026 / 11:49 AM IST

మరికల్‌లో బీజేపీ నాయకుల నిరసన

NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం BJP మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో BJP నాయకులు నల్లబ్యార్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు గుండా గురిని ఖండిస్తూ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యకర్తలు ఉన్నారు.

February 23, 2026 / 11:48 AM IST

‘ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షల ప్రారంభం’

MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బుధవారం నుండి ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొదటి సంవత్సరంలో 453, ద్వితీయ సంవత్సరంలో 211 మొత్తం 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు.

February 23, 2026 / 11:47 AM IST