NTR: విజయవాడలో మూడో రోజు లెజిస్లేటివ్ క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. క్రికెట్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్, మ్యూజికల్ చైర్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, కబడ్డీ, చెస్, వాలీబాల్, షాట్‌పుట్, త్రోబాల్ పోటీలు నిర్వహించారు. వివిధ క్రీడల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడుతూ ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ELR: అన్నదాతలకు అండగా నిలిచేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల ధాటికి కామవరపుకోట మండలం తడికలపూడిలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను అడిగి పలు వివరాలను తెలుసుకున్నారు.
VZM: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ గురువారం తీర్పు చెప్పారు. గజపతినగరానికి చెందిన పూసర్ల రామలింగేశ్వర రావు అదే గ్రామానికి చెందిన కొల్లా కనక వెంకట సత్యనారాయణకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. ఈమేరకు రామలింగేశ్వరరావుకు ఏడాది జైలు శిక్షతోపాటు రెండు లక్షల 40 వేల రూపాయలు జరిమానా విధించారు.
కృష్ణా: గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్పీఎస్ బ్లాక్‌లోని షాప్స్ అద్దె/ లైసెన్స్ ఫీజులు భారీగా పెండింగ్లో ఉండడంతో అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. పన్ను చెల్లించని కొంతమంది షాపులకు తాళాలు వేశారు. అన్ని షాపులో యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బకాయిలను చెల్లించి, అనవసర సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులు సూచించారు.
NZB: రాబోయే వేసవిలో మండలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఇసుక సరఫరా జాప్యం లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో వీరభద్రాచారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
TPT: నెల్లూరుకు విచ్చేసిన వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌కు బొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ వైసీపీ నేతలు పాల్గొన్నారు.
తూ.గో: ప్రజా సేవలోనే కాదు, క్రీడా మైదానం లోనూ తనదైన శైలిలో క్రికెట్ ఆడి తన ప్రతిభను చాటిచెప్పారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్న ఆటవిడుపు ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో మంత్రి సుభాష్ ప్రొఫెషనల్ క్రికెటర్‌లా అలరించారు.
KRNL: ఆదోని పురపాలక సంఘం బడ్జెట్‌ను ఎట్టకేలకు YCP సభ్యులు ఆమోదం తెలిపారు. గురువారం ఛైర్ పర్సన్ లోకేశ్వరి అధ్యక్షతన 2026-27 రూ.96 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. మూడుసార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించగా.. ఈ ఏడాది మార్చ్ 17తో YCP కౌన్సిల్ పదవీకాలం ముగియనుండటంతో సభ్యులు ఎట్టకేలకు బడ్జెట్‌ను ఆమోదించారు.
కామారెడ్డి జిల్లాలో సేవా కార్యక్రమాల్లో ముందున్న ఎస్ఆర్ ఫౌండేషన్ సేవలను కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ ప్రశంసించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విజేతలైన బీబీపేట్ మండల విద్యార్థులను ఆయన అభినందించారు. కాగా, డాకూరి రోహిత్, చిట్టబోయిన వంశీ రాష్ట్రస్థాయిలో మెరిసి పతకాలు సాధించారు.
SKLM: పదవ తరగతి పరీక్షలు దగ్గర అవుతున్న సందర్భంగా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని హెచ్ఎం ఒకలా రత్నమాల తెలిపారు. నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఇంటి వద్ద చదువుతోపాటు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలన్నారు.
WGL: నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. నూతనంగా విధుల్లోకి చేరిన పోలీస్ జాగిలాలను CP పరిశీలించారు. ఈ నూతన జాగిలాలు ప్రేలుడు పదార్థాలను సులభంగా పసిగడతాయని CP అన్నారు. అదనపు డిసిపిలు శ్రీనివాస్, రవి, తదితరులు ఉన్నారు.
KNR: కరీంనగర్ బస్టాండ్ పోలీస్ అవుట్ పోస్ట్ పరిధిలో పది రోజుల క్రితం ఒక సూట్ కేసు లభ్యమైంది. అందులో విలువైన దుస్తులు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆధార్ కార్డు ఉన్నాయి. కార్డులోని ఫోన్ నంబర్‌కు పోలీసులు ప్రయత్నించగా సిగ్నల్ అందడం లేదు. బాధితులు 9440469543, 8712580332ను సంప్రదించి ఆధారాలు చూపి బ్యాగును తీసుకెళ్లాలని పోలీసులు కోరారు.
HYD: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు వివిధ జోన్లలో 1,244 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 ప్రత్యేక రైళ్లు నడవనున్నారు. 40 ట్రిప్పులతో రైల్వే ప్రణాళిక సిద్ధం చేసింది. చర్లపల్లి, తిరుపతి, సికింద్రాబాద్ రాష్టలకు సర్వీస్‌లు ఉన్నాయి.
WGL: చెన్నారావుపేట (M) కేంద్రంలోని కోనాపురం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవం సందర్భంగా కార్యక్రమ గోడ పత్రికను ఇవాళ గ్రామ పెద్దలు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన వసతులు కల్పించినట్లు తెలిపారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.