• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భారీ చోరీ.. 65 తులాల బంగారం అపహరణ

AP: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో భారీ చోరీ జరిగింది. బీఎన్ రోడ్డు పక్కనే ఉన్న సుజాత అనే మహిళ ఇంట్లో 65 తులాల బంగారం, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. నగదుతో కలిపి మొత్తం రూ.1.5 కోట్లు చోరీకి గురై ఉంటుందని అంచనా. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

March 8, 2026 / 03:12 PM IST

నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

NLG: చిట్యాల మండలం ఏపూరిలో ఆకస్మికంగా మృతి చెందిన ఎరసాని కృష్ణయ్య కుటుంబానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలెం కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ రెడ్డి తీవ్ర ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. మృతదేహానికి ఇవాళ పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు ఎల్లయ్యను పరామర్శించారు. వీరితో పాటు లింగస్వామి, నరసింహ పాల్గొన్నారు.

March 8, 2026 / 03:12 PM IST

ఆర్మూర్ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆదివారం ఓ పాత ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి నిర్వాహకులు సామగ్రిని అక్కడే విడిచి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకొని అందులోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

March 8, 2026 / 03:12 PM IST

‘మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి’

అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాయచోటిలో తన కార్యాలయంలో ఏపీఐఐసీ డైరెక్టర్ కొండా భాస్కర్ రెడ్డి తెలిపారు. మహిళలు కుటుంబం, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి సమాన అవకాశాలు, గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.

March 8, 2026 / 03:11 PM IST

సింగరేణి సీఎండీకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే

BDK: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిసి ఆదివారం వినతిపత్రం అందజేశారు. కొత్త కోల్ బ్లాకుల సాధనతో పాటు, ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం కింద రూ.30 లక్షల వడ్డీ లేని రుణం అందించాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.

March 8, 2026 / 03:05 PM IST

పోలీసులకు సహకరించాలి: ఎస్సై

ADB: శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలకు ప్రజలు సహకరించాలని గాదిగూడ ఎస్సై రమ్య అన్నారు. ఆదివారం సర్పంచులతో సమావేశం నిర్వహించారు. గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలకు ప్రజలు బానిస కావద్దన్నారు. ఎవరైన గంజాయి సాగు చేసినా, విక్రయించినా చట్టరీత్య చర్యలు ఉంటాయన్నారు. అత్యవసరాలకు డయల్ 100ను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

March 8, 2026 / 03:05 PM IST

ఓల్డ్ ఏజ్ హోమ్స్ తగ్గించేలా కృషి చేయాలి: కలెక్టర్

SDPT: సమాజంలో వృద్ధాశ్రమాల సంఖ్య తగ్గించేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోమటి చెరువు వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఇంటి బాధ్యతను మోసే మహిళలు, తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బాధ్యతల నిర్వహణే మనలో పోరాట పటిమను పెంచుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

March 8, 2026 / 03:05 PM IST

మనస్థాపం చెంది యువకుడి ఆత్మహత్య

KMR: జుక్కల్ మండలం మందాబాద్ తండకు చెందిన దేవల్ల హనుమంతు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమంతు శనివారం బీరు తాగుతూ ఫోటోను కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై సోమేశ్వర్ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసు ఆదివారం కేసు నమోదు చేశారు.

March 8, 2026 / 03:03 PM IST

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్

SRD: అమీన్‌పూర్ సర్కిల్ 47లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిప్యూటీ కమిషనర్ డి. ప్రదీప్ కుమార్ ఇవాళ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అమీన్‌పూర్, బీరంగూడ, ఆర్‌సీ పురం, భారతి నగర్, బొల్లారం ప్రాంతాల్లో పార్కులు, GVPలను శుభ్రపరిచారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన “పరిష్కారం” కార్యక్రమంలో 15 దరఖాస్తులను స్వీకరించారు.

March 8, 2026 / 03:03 PM IST

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్

W.G: ఉండి మార్కెట్ యార్డ్‌లో నియోజకవర్గస్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళలు అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు సాగాలన్నారు.

March 8, 2026 / 03:03 PM IST

మున్సిపాలిటీ సిబ్బందికి ఘన సన్మానం

WNP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి పట్టణంలోని 12వ వార్డులో మున్సిపల్ సిబ్బందిని స్థానిక కౌన్సిలర్ నక్క రాణి-రాజు యాదవ్ ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ సిబ్బంది చేసే సేవలు మరువలేనివని వాటిని కొనసాగించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సమాజంలో ఎంతో సముచిత స్థానాన్ని కల్పిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:02 PM IST

పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బందిని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు నరేశ్, లక్ష్మారెడ్డి, సిబ్బంది శాలువాలతో సన్మానించారు. మండలంలోని మహిళా సోదరి సోదరీ మణులందరికీ KNR రూరల్ పోలీస్ స్టేషన్ తరుఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

March 8, 2026 / 03:02 PM IST

అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు

VSP: ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి.

March 8, 2026 / 03:01 PM IST

సెలబ్రేషన్స్ రెస్టారెంట్‌పై ఐటీ దాడులు

AP: విశాఖలోని ప్రముఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్‌పై ఐటీశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ పేమెంట్లు, డిజిటల్ డేటాలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

March 8, 2026 / 03:01 PM IST

ఆకాశంలో సగం కాదు.. అవకాశాల్లో సగం కావాలి: ఎమ్మెల్యే సౌమ్య

NTR: మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో ఆమె పాల్గొన్నారు. మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:01 PM IST