• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అసెంబ్లీ రేపటికి వాయిదా

AP: అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలపై చర్చించారు. త్వరలో మెగాజాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అందులో టీచర్ల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కల్తీ పాల కారణంగా మృతి చెందిని కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

February 23, 2026 / 03:05 PM IST

‘విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి’

PLD: విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కారంపూడి సీఐ పి. శరత్ బాబు సూచించారు. సోమవారం కారంపూడిలోని ఓ పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈగల్ క్లబ్స్ ప్రతి ఒక్క స్కూల్లో ఏర్పాటు చేయాలని ఈగల్ క్లబ్ ప్రాముఖ్యతను వివరించారు.

February 23, 2026 / 03:05 PM IST

స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా

 MBNR: స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా అని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడల్ శ్రీనివాస్ సాగర్ అన్నారు. సోమవారం సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాబా తన పాటలతో అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు.

February 23, 2026 / 03:05 PM IST

ప్రజల దూరభారం తగ్గించేందుకు మండల స్థాయిలో ప్రజావాణి

MDK: ప్రజల దూర భారాన్ని, ప్రజల సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నిజాంపేటలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని, ప్రజలదూర భారాన్ని, ప్రయాణ బత్యాల్ని, సమయాభావాన్ని తగ్గించడం కోసమే ఏర్పాటు చేశామన్నారు.

February 23, 2026 / 03:04 PM IST

మున్సిపల్ ఛైర్మన్ సన్మాన సభలో పాల్గొన్న మాజీ ఎంపీ

RR: చేవెళ్ల మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్ సన్మాన సభ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, ప్రభుత్వ చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. మున్సిపాలిటీ అభిరుద్దికి సహకారం అందచేస్తామని అన్నారు.

February 23, 2026 / 03:04 PM IST

అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన టీమిండియా..!

డిఫెండింగ్ ఛాంపియన్‌గా T20 WC బరిలోకి దిగిన భారత్‌కు దక్షిణాఫ్రికా భారీ షాక్ ఇచ్చింది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడగొట్టినప్పటికీ బౌలర్లు 180+ స్కోర్‌ను ఇచ్చారు. ఇక బ్యాటింగ్‌లో ఏ ఒక్క బ్యాటర్ కూడా ధాటిగా పరుగులు చేయలేకపోయాడు. ఈ ఒక్క ఓటమితో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందన్న ఆశలు అభిమానుల్లో సన్నగిల్లాయి.

February 23, 2026 / 03:03 PM IST

రెవెన్యూ ఆఫీసులో ఖాళీ పోస్టుల భర్తీకి వినతి

KNR: గన్నేరువరం మండలంలోని రెవెన్యూ ఆఫీసులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజిరెడ్డి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. గన్నేరువరంలో భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సిబ్బందిని నియమించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

February 23, 2026 / 03:02 PM IST

‘కాంగ్రెస్‌పై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’

MNCL: క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిణామాలపై కాంగ్రెస్‌పై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా మాజీ అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్ సోమవారం మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన కూడా ఉందని గుర్తు చేశారు.

February 23, 2026 / 03:02 PM IST

ALERT: మరో 3 గంటల్లో భారీ వర్షం

TG: మరో 3 గంటల్లో కామారెడ్డి, NZB, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో… తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఓ మోస్తరు చిరుజల్లులు కురుస్తున్నాయి.

February 23, 2026 / 03:01 PM IST

వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం

PDPL: సుల్తానాబాద్ మండలంలో 2వ బ్యాచ్‌గా 13 గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు కనుకుల రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీ దివ్య దర్శనరావు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పాలనలో సభ్యుల పాత్ర కీలకమని, గ్రామసభల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి చేరేలా అవినీతి లేకుండా పనిచేయాలని అన్నారు.

February 23, 2026 / 03:01 PM IST

మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన

SRCL: మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇంకా పలువురికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పరిహారం చెల్లించాల్సి ఉందని నాయకులు కదిరే రాజ్ కుమార్ పాల్గొన్నారు.

February 23, 2026 / 03:00 PM IST

కంభంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ప్రకాశం: కంభం పట్టణ పరిధిలో మైనర్ డ్రైవింగ్ మరియు మోటారు వాహన చట్టం (MV Act) ఉల్లంఘనలపై పోలీసులు సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ఎస్సై తెలిపారు.

February 23, 2026 / 03:00 PM IST

పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

GNTR: పొన్నూరు పట్టణం 8వ వార్డు నార్త్ క్యాబిన్‌పేటకు చెందిన ఇఊరి శ్రీనివాసరావు (27) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. యువకుడి మృతితో కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 03:00 PM IST

రేపల్లెలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన RDO

BPT: రేపల్లె మండలంలోని ప్రభుత్వ మరియు జెఎల్‌బి జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను సోమవారం ఆర్డీవో రామలక్ష్మి పరిశీలించారు. పరీక్ష గదులు, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిబంధనల ప్రకారం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.

February 23, 2026 / 03:00 PM IST

రోడ్డు మలుపు.. రోజుకో ప్రమాదం

BDK: కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఒక ప్రమాదకర మలుపు వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా షీ టీమ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా హైవేపై ఏర్పాటు చేసిన ఈ మలుపు వాహనదారులకు ముప్పుగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ముందస్తు హెచ్చరిక బోర్డులు, లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇవాళ వాపోయారు.

February 23, 2026 / 02:59 PM IST