ATP: శింగనమల మండలం వెస్ట్ నరసాపురంలో ఓ ప్రైవేట్ కంపెనీ తీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటి ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి పంట పొలాల్లో దహనం చేస్తుండటంతో విషపూరిత పొగ వెలువడుతోంది. దీనివల్ల శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రకాశం: మెడికల్, ఫార్మా మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ CPI ఆధ్వర్యంలో శనివారం మార్కాపురం కలెక్టరేట్లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన సదుపాయాలు లేవని, తద్వారా ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లాలంటే పేదలు హడలిపోతున్నారన్నారు. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
KMM: ఉమ్మడి జిల్లాలోని ఆయిల్‌పామ్ సాగుదారులు తెల్లదోమ ఉద్ధృతితో బెంబేలెత్తుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్న తోటలపై ఈ తెగులు పంజా విసరడంతో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. దీని వల్ల కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతిని, గెలల సైజు తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో మంత్రి లోకేష్ పర్యటించారు. బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్‌కేర్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రీయల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.
MBNR: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని ఎంపీ డీకే అరుణ సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా వర్సిటీ అధ్యాపకులుగా, రిజిస్ట్రార్‌గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. చిలుకూరు స్వామివారి సేవలో విశేష గుర్తింపు పొందిన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TG: సచివాలయంలో కార్యదర్శులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం అవుతారు. 99 రోజుల యాక్షన్‌ప్లాన్‌పై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్‌ప్లాన్‌పై ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
అన్నమయ్య: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిస్కమ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, జిల్లా అధ్యక్షుడు నారాయణలతో కలసి మదనపల్లె కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BDK: పాల్వంచ టౌన్ హర్ష టౌన్‌షిప్ ఏరియాలో 31వ డివిజన్ కార్పొరేటర్ శ్యామల దినేష్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మేయర్ గణేష్ హాజరయ్యారు. మేయర్ దృష్టికి స్థానికులు పలు సమస్యలను తీసుకెళ్లారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన మేయర్ అధికార యంత్రాంగంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు.
SRPT: కోదాడ మండలం రెట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై ఈరోజు పాఠశాలకు వెళుతున్న శ్రావణ్ కుమార్, రవిచంద్రలను ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్, రవిచంద్ర స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో సలీం షరీఫ్ వైద్యశాలకు వెళ్లి ఉపాధ్యాయులు పరామర్శించారు.
NGKL: కుమ్మెర ఘటన రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటనపై NHRC సీరియస్ అయింది. అనేక మలుపులతో అంతుచిక్కని ఈ కేసు చివరకు ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.
AP: బనగానపల్లె బీసీ కాలనీలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. నిరుపేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతీ నెల ఒకటవ తేదీనే పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.
TG: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది చాలాసేపు ప్రయాసపడి అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
PLD: చిలకలూరిపేట 37వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, కౌన్సిలర్ శివకుమారితో కలిసి శనివారం పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఒక రోజు ముందుగానే నగదు అందజేయడంపై వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పంపిణీ ప్రక్రియను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.
NTR: విజయవాడలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో సుమారు 4,000 కేజీల ప్లాస్టిక్ను సీజ్ చేసి, రూ.3 లక్షల జరిమానా విధించినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అర్జునరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బదులు జ్యూట్ బ్యాగులు, పేపర్ కవర్లు వాడాలని వ్యాపారులకు అవగాహన కల్పించారు.