• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చంద్రగ్రహణం.. యాదాద్రి ఆలయ దర్శనీయ వేళల్లో మార్పులు

BHNG: లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దర్శనీయ వేళలు ఇలా ఉన్నాయి. ఉ. 3 గంటలకు సుప్రభాతం, 3:30లకు తిరు ఆరాధన, బాల భోగం, ఆరగింపు, 4:30 నిజాభిషేకం, 5:15 సహస్రనామార్చన, 5:45 ఉభయ దర్శనాలు, 7:00 ఆలయం మూసివేత. 4వ తేదీన ఉదయం 3:00 ఆలయ సంప్రోక్షణ, 5:30 సుప్రభాతం, 6:00 ఆరగింపు, 7:30 నిజాభిషేకం, 8:15 అర్చన, 8:45 దర్శనాలు.

March 1, 2026 / 03:35 PM IST

‘రణబాలి’ ఫస్ట్ లుక్.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్

‘రణబాలి’ చిత్రంలోని విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 1800ల నాటి సహజత్వం, మట్టి వాసన ఉట్టిపడేలా దీన్ని రూపొందించామని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపాడు. ఈ సీన్ వారి నిజ జీవిత వివాహంతో యాదృచ్ఛికంగా సరిపోలిందని, ఇది చూస్తుంటే వారి గత జన్మ పెళ్లి ఫొటోలా అనిపిస్తోందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

March 1, 2026 / 03:35 PM IST

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పనులు ప్రారంభం

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో 10 రోజుల పాటు బస్సుల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు డిపో మేనేజర్ లక్ష్మణరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎల్విన్‌పేట జంక్షన్ నుంచి బస్సులు యథావిధిగా నడుస్తాయని, ప్రయాణికులు సహకరించాలని కోరారు.

March 1, 2026 / 03:34 PM IST

వైభవంగా శబరిమాత ఉత్సవాలు

ADB: బోథ్ మండలం కన్గుట్టలో శబరిమాత 2వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన షెడ్డుకు ఆయన భూమిపూజ చేశారు. ఆధ్యాత్మికతతోనే సమాజంలో సేవాభావం పెంపొందుతుందని పేర్కొన్నారు.

March 1, 2026 / 03:34 PM IST

‘తెప్పోత్సవానికి సర్వం సిద్ధం’

JGL: ధర్మపురిలో మార్చి 3-5 వరకు తెప్పోత్సవం, డోలోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో బ్రహ్మ పుష్కరిణిని ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పూర్తిగా శుభ్రం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోనేరులో నీటిని మార్చి, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

March 1, 2026 / 03:34 PM IST

‘దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

SRPT: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్ కోరారు. ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ బంగారు ఆభరణాలు ధరించవద్దని, పిల్లలకు నగలు వేసి ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 లేదా 112కి కాల్ చేయాలన్నారు.

March 1, 2026 / 03:33 PM IST

సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NLR: సంగంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయ ప్రాంగణంలో రైతుల కోసం లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ఆనం ప్రారంభించారు. అనంతరం సభా వేదిక వద్ద రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. సంగంలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

March 1, 2026 / 03:32 PM IST

సొన్ పేట్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NZB: మెండోరా మండలం సోన్ పేట్‌లో కాకతీయ కెనాల్ నుంచి అమ్మవారి టెంపుల్ వరకు ఆదివారం సీసీ రోడ్డు పనులు ప్రారంభం అయినట్లు సర్పంచ్ తోట నర్సవ్వ-మల్కయ్య తెలిపారు. మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌తో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 1, 2026 / 03:32 PM IST

వడ్డేరపాలెంలో ఇనుప గేట్ల చోరీ కేసు ఛేదన

BPT: జిల్లా వడ్డేరపాలెంలో ఇనుప గేట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 12న జరిగిన ఈ ఘటనలో చోరీకి పాల్పడిన రంజిత్, సాయిబాబుతో పాటు దొంగ సొమ్ము కొనుగోలు చేసిన కుమార్‌ను పోలీసులు గుర్తించారు. నిందితులు రంజిత్‌, కుమార్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఈనెల 12 వరకు రిమాండ్ విధించారు. దొంగ సొమ్ము కొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 1, 2026 / 03:30 PM IST

‘తప్పనిసరిగా అనుమతి పత్రాలు కలిగి ఉండాలి’

ప్రకాశం: రాచర్ల మండల పరిధిలోని పలు కిరాణా షాపులను రూరల్ సీఐ రామకోటయ్య ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో ఎవరైనా బాణసంచా విక్రయించాలన్నా లేదా నిల్వ చేయాలన్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతి పత్రాలు కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేకుండా నివాస ప్రాంతాల్లో బాణసంచాను నిల్వ చేయడం లేదా రహస్యంగా విక్రయించడం చట్టరీత్యా నేరమని అన్నారు.

March 1, 2026 / 03:30 PM IST

పేలుడు ఘటనపై జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆందోళన

KRNL: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనలో 23 మంది కార్మికులు సజీవ దహనమవడం తీవ్ర విషాదం కలిగించిందని జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి, ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేశారు.

March 1, 2026 / 03:30 PM IST

‘అసెంబ్లీ నుంచి మున్సిపల్ దాకా.. అంతా ‘వన్ సైడ్”

KMM: అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా ఏ ఎన్నిక వచ్చినా తీర్పు ‘వన్ సైడ్’గానే ఉందని, ఇది జీర్ణించుకోలేని గత పాలకులు ఒంటి నిండా విషాన్ని నింపుకుని చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు, ఆ భగవంతుడు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం” అని చెప్పారు. ప్రజలు తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు.

March 1, 2026 / 03:30 PM IST

ముత్యాలమ్మ బోనం సమర్పించేందుకు తరలివచ్చిన మహిళలు

NTR: కంచికచర్ల(M) కీసర గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ, పోతురాజు స్వామి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అర్చకుడు రాము శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగి పసుపు, కుంకుమ సమర్పించారు. వర్షాలు కురవాలని, పంటలు పండాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నదానం ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 1, 2026 / 03:30 PM IST

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన

NRML: భైంసా మండలం పాంగ్రి గ్రామంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శివాజీ మహారాజ్ చరిత్ర యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ప్రజా ట్రస్ట్ ఛైర్మన్ మోహన్ రావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 03:30 PM IST

బాపట్లలో టపాసుల విక్రయ కేంద్రం తనిఖీలు

BPT: కర్లపాలెం రహదారిలోని టపాసుల విక్రయ కేంద్రాన్ని ఆదివారం ఆర్డీవో గ్లోరియా, డీఎస్పీ నాయక్ పరిశీలించారు. షాపు నిర్వహణ రికార్డులు, స్టాక్ వివరాలు, భద్రతా సదుపాయాలపై ఆరా తీశారు. అగ్నిప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలపై ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. ఈ తనిఖీల్లో కర్లపాలెం తహసీల్దార్ శ్రీదేవి, ఎస్సై రవీంద్ర పాల్గొన్నారు.

March 1, 2026 / 03:30 PM IST