• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

SKLM: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.

March 11, 2026 / 07:34 PM IST

కొత్త బోరు బావి ఏర్పాటుకు వినతి

RR: నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులలో భాగంగా చేవెళ్ల పరిధిలోని అంతారం గ్రామ పంచాయతీకి చెందిన బోరుబావి తొలగిపోయిందని సర్పంచ్ రామస్వామి అన్నారు. గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడటంతో ఆర్డీవోను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ ప్రజల అవసరార్థం కొత్త బోరు బావి ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

March 11, 2026 / 07:34 PM IST

ఎన్నికల ఎఫెక్ట్: తొలి 20 రోజుల షెడ్యూల్ రిలీజ్

IPL 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్‌ను BCCI అధికారికంగా విడుదల చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా BCCI తొలి 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించనుంది. కాగా, ఈ సీజన్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

March 11, 2026 / 07:33 PM IST

తాజ్‌పూర్‌లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

BHNG: భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక కొన్నత పాఠశాలలో బుధవారం సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు వివిధ పాత్రలు పోషించి ఎంతో చక్కని ప్రతిభను కనబరిచారని వారిని అభినందించారు.

March 11, 2026 / 07:32 PM IST

పార్లమెంట్ BSP ఇంఛార్జ్‌గా పృథ్వీరాజ్

NGKL: నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఎస్పీ ఇంఛార్జ్‌గా తూడుకుర్తి గ్రామానికి చెందిన బండి పృథ్వీరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

March 11, 2026 / 07:32 PM IST

ద్విచక్ర వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై పవన్ కుమార్

E.G: గోకవరం మండలంలో వరుస ద్విచక్ర వాహన చోరీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం గోకవరం SI పవన్ కుమార్ తన సిబ్బందితో కొత్తపల్లి ప్రధాన రహదారిలోని R&R కాలనీ వద్ద తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా ఉంచుతామని, అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని SI సూచించారు.

March 11, 2026 / 07:32 PM IST

బకాయిలు చెల్లించని వారిపై చర్యలు: ఛైర్‌పర్సన్

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో బుధవారం పండ్ల వ్యాపారస్తులు, రైతు సంఘం ప్రతినిధులతో ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న షాపుల అద్దెలను ఈ నెలలోపు చెల్లించాలని, గడువు ముగిసిన ట్రేడర్ లైసెన్స్‌లను వెంటనే రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. బకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 11, 2026 / 07:31 PM IST

హెవీ ట్యాంకర్ లారీలు స్వాధీనం.. కేసు నమోదు

NTR: మైలవరం సర్కిల్ పరిధిలోని జి. కొండూరు జంక్షన్ వద్ద నేషనల్ హైవేపై వన్‌వే ఉల్లంఘిస్తూ ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న హెవీ ట్యాంకర్ లారీలపై పోలీసులు చర్యలు చేపట్టారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రెండు ట్యాంకర్ లారీలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ కిషోర్ బాబు తెలిపారు.

March 11, 2026 / 07:31 PM IST

నెల్లూరు పారిశ్రామిక అభివృద్ధికి వినతి

నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర సహాయం అందించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఛాంబర్‌లో ఆయనతో భేటీ అయిన జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు. పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరారు.

March 11, 2026 / 07:30 PM IST

TAC బోర్డు సభ్యుడిగా పసుల నీరజ్

NRPT: నర్వ మండలం ఉండేకోడ్ గ్రామానికి చెందిన అడ్వకేట్ పసుల నీరజ్ TAC బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కాట్రగడ్డ విజయ్ హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన భేటీలో ఆయనను అభినందించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.

March 11, 2026 / 07:30 PM IST

దివ్యాంగులకు ప్రైవేటు సంస్థలలో జీవనోపాధి కల్పించాలి: సీపీఐ

NLG: దివ్యాంగులకు ప్రైవేట్ సంస్థలు జీవన ఉపాధి కల్పించాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోనే ఉన్న ప్రైవేట్ సంస్థలలో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ద్వారా జీవనోపాధి కల్పించాలని కోరారు.

March 11, 2026 / 07:30 PM IST

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో

GDWL: ఇటిక్యాల మండలం మునగాల జడ్పీహెచ్ఎస్‌ను DEO విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి విద్యా బోధనను పర్యవేక్షించడమే కాకుండా, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఉపాధ్యాయులు బోధనలో నాణ్యత పాటించాలని సూచించారు.

March 11, 2026 / 07:30 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.83 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,83,184 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 207 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 14 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 1724 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.

March 11, 2026 / 07:30 PM IST

చింతలపూడిలో CMRF చెక్కులు పంపిణీ

ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం CMRF చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ లబ్ధిదారులు అందజేశారు. ముగ్గురకు రూ. 1,05,225 చెక్కులని అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్యం అందజేయడం కోసం కృషి చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

March 11, 2026 / 07:30 PM IST

‘కేంద్ర మంత్రి మహా పాదయాత్రని విజయవంతం చేయాలి’

KNR: ఈనెల 14న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తలపెట్టిన అంజన్న ఆశీర్వాద “మహా పాదయాత్ర”ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ “అంజన్న ఆశీర్వాద యాత్ర” సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి ఆప్పగిస్తే నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టుకు వస్తానని ప్రకటించనన్నారు.

March 11, 2026 / 07:30 PM IST