• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లక్కీరెడ్డిపల్లిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లిలో ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. 132 కేవీ సురకవాండ్లపల్లి సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ మార్పిడి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

March 7, 2026 / 10:35 PM IST

మహిళా దినోత్సవం.. ఆర్టీసీ ఎండీ కీలక వ్యాఖ్యలు

TG: ఇంటా బయటా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న మహిళా సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడారు. ఈ తరం మహిళా లోకం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటి చెబుతుండటం హర్షించదగ్గ పరిణామమని కొనియాడారు.

March 7, 2026 / 10:16 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: కలెక్టర్

NZB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ శనివారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ, దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారని కలెక్టర్ అన్నారు.

March 7, 2026 / 10:00 PM IST

చిన్నారుల మిస్సింగ్ కేసు.. ముగ్గురు మృతి

AP: కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా.. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 7, 2026 / 09:59 PM IST

తాడేపల్లిగూడెంలో న్యాయ విజ్ఞాన సదస్సు

W.G: మహిళలు చట్టాలను న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని జడ్జిలు కే. మాధవి, ఎస్. సూర్య కిరణ్ సూచించారు. శనివారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమని, వారికి అనేక చట్టాలు ఉన్నాయన్నారు. వాటిని సక్రమంగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఎండీవో వీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 09:51 PM IST

స్వదేశానికి బహ్రెయిన్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులు

AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో బహ్రెయిన్‌లో చిక్కుకున్న ప్రసావాంధ్రులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇవాళ రాత్రి 59 మంది తెలుగువారు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రామ్మోహన్ బహ్రెయిన్‌లో 238 మంది తెలుగువాళ్ల వివరాలను తీసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

March 7, 2026 / 09:46 PM IST

మహిళలకు ఎస్పీ శుభాకాంక్షలు.!

KDP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సమాజం, కుటుంబ వ్యవస్థలో మహిళలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.

March 7, 2026 / 09:45 PM IST

కేసీఆర్ మరోసారి సీఎం అవుతారు: కేటీఆర్

TG: అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గత BRS ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. భవిష్యత్తులోనూ మహిళా సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళల ఆశీస్సులతో మరోసారి KCR ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

March 7, 2026 / 09:43 PM IST

సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు బాంబు బెదిరింపు

TG: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. షెడ్యూల్ ప్రకారం మ. 2 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానానికి ఈమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమాన సర్వీసును రద్దు చేసి, ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబ్ స్క్వాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

March 7, 2026 / 09:39 PM IST

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్

భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2026లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇవాళ సెమీఫైనల్‌లో కెనడాకు చెందిన విక్టర్ లైపై లక్ష్యసేన్ 21-16, 18-21, 21-15 స్కోరుతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. రేపు జరిగే ఫైనల్‌లో తైవాన్ ఆటగాడు లిన్ చున్-యితో లక్ష్య సేన్ తలపడనున్నాడు.

March 7, 2026 / 09:36 PM IST

అంబాజీపేట బీజేపీ మండల అధ్యక్షుడుగా ఆంజనేయులు

కోనసీమ: అంబాజీపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కురసా ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఈ మేరకు పుల్లేటికుర్రు గ్రామంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ పాల్గొని అతనిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఆంజనేయులను పలువు నాయకులు ఘనంగా సత్కరించారు.

March 7, 2026 / 09:35 PM IST

బీజేపీకి వాళ్లు బానిసలుగా మారారు: షర్మిల

ELR: రాష్ట్రంలో జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీకి బానిసలుగా, బినామీలుగా మారారు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. వీళ్లల్లో ఒక్క నాయకుడు కూడా ప్రత్యేక హోదా కావాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, అమరావతిని నిర్మించాలని కోరలేదని ఎద్దేవ చేశారు.

March 7, 2026 / 09:32 PM IST

‘ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలి’

MNCL: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం బెల్లంపల్లి మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలుపరిచే విధంగా చొరవ చూపాలన్నారు.

March 7, 2026 / 09:29 PM IST

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. రాయచోటి నియోజకవర్గంలో మహిళా మార్ట్, గృహాల పట్టాలు, విద్యా సౌకర్యాల ద్వారా మహిళలకు ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు.

March 7, 2026 / 09:27 PM IST

‘విజయ డెయిరీ పేరును నాశనం చేస్తే ఊరుకోం’

TG: 1904లో విజయ డెయిరీ ఏర్పాటు చేశామని TG DDF ఛైర్మన్ అమిత్ రెడ్డి గుర్తు చేశారు. విభజన తర్వాత విజయ డెయిరీ రెండుగా విడిపోయిందన్నారు. గత YCP హయాంలో విజయ డెయిరీ పేరుతో గుజరాత్ సంస్థ మేఘన ఫుడ్స్‌కు నెయ్యి ఫ్రాంచైజీ ఇచ్చారని చెప్పారు. ఆ నెయ్యి పూర్తిగా కల్తీ అని నివేదికలు వచ్చాయని వెల్లడించారు. విజయ డెయిరీ పేరుతో నకిలీ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 7, 2026 / 09:23 PM IST