• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి’

NGKL: వంగూరు మండలంలోని ఉల్పర, పోతారెడ్డిపల్లి ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక పొందేందుకు శుక్రవారం నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని తహశీల్దార్ మురళీమోహన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, కాంట్రాక్టుల కోసం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనింగ్ శాఖ అనుమతితో ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరాకు అవకాశం ఉందని అన్నారు.

March 6, 2026 / 10:20 AM IST

‘నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి’

AKP: ఎస్ఈజెడ్ అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో బార్క్ భూసేకరణకు సంబంధించి 15 ఏళ్లయిన నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. నిర్వాసితులకు ఆర్.ఆర్. ప్యాకేజ్‌లో కాలనీలు ఇప్పటివరకు సిద్ధం కాకపోవడంతో వారిని తరలించలేకపోతున్నామన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

March 6, 2026 / 10:19 AM IST

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక RTC బస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ RTC RMను ఆదేశించారు. ఒంటిమిట్టలో జరిగిన సమీక్షలో ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ మాట్లాడారు. కడప రైల్వే స్టేషన్ నుంచి భక్తులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. గత బ్రహ్మోత్సవాలకు 145 బస్సులు ఏర్పాటు చేసినట్లుగా RTC RM కలెక్టర్కు తెలిపారు.

March 6, 2026 / 10:18 AM IST

పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం

MHBD: కొత్తగూడ మండలం బొత్తవాని గూడెంకు చెందిన సురేందర్ కుటుంబ కలహాల కారణంగా ఇవాళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 6, 2026 / 10:18 AM IST

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే అశోక్

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి  గురువారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొమరోలు, అర్ధవీడు మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియం పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే కంభం, గిద్దలూరు మండలాల్లో కొత్త స్టేడియాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

March 6, 2026 / 10:17 AM IST

కోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో న్యాయ శాఖలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 17 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ద్వారా సందర్శించవచని తెలిపారు.

March 6, 2026 / 10:13 AM IST

99 రోజుల కార్యచరణ ప్రణాళిక ప్రారంభం

SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని పంచాయతీ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాలను శుభపరిచే కార్యక్రమం చేశారు. పనికిరాని వస్తువులను తొలగించారు. గ్రామ అభివృద్ధి ప్రజాపాలనపై కార్యదర్శి నాగలక్ష్మి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉన్నారు.

March 6, 2026 / 10:12 AM IST

న్యాయవాదిపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ

W.G: గుంటూరులో న్యాయవాది చెన్నకేశవపై జరిగిన దాడిని నిరసిస్తూ మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు అమరనాథరెడ్డి ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు. న్యాయవాదులపై దాడులు దారుణమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

March 6, 2026 / 10:11 AM IST

TTD ఉద్యోగికి జైలుశిక్ష.. కారణం ఇదే.!

TPT: తిరుపతి కొర్లగుంటకు చెందిన రాజేంద్ర తిరుమల కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళం ఏరియాకు చెందిన ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 2022లో అతను ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం తిరుపతి 4వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి రాజేంద్రకు 6నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

March 6, 2026 / 10:10 AM IST

పెనుబల్లిలో చిరుత, ఎలుగుబంటి హల్‌చల్

TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో అడవి జంతువుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. కనకగిరి, పులిగుండాల పరిసర ప్రాంతాల్లో చిరుత పులితో పాటు ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

March 6, 2026 / 10:08 AM IST

నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్..!

ELR: నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్’ కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ పి. రజిత గురువారం తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు కళాశాల పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.

March 6, 2026 / 10:05 AM IST

మల్లూరమ్మ ఆలయ ఈవో సస్పెండ్

అన్నమయ్య: కొత్తపల్లి మాండవ్య నది తీరాన ఉన్న మల్లూరమ్మ ఆలయ ఈవో కొండారెడ్డిని దేవదాయ శాఖ సస్పెండ్ చేసింది. ఆలయ హుండీ తాళాలు మాయం కావడం,అమ్మవారి నగదు లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ రామచంద్ర మోహన్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు, భక్తుల ఫిర్యాదులపై విచారణ చేపట్టగా, విచారణ పూర్తయ్యే వరకు శివయ్యను ఇన్‌ఛార్జ్ ఈవోగా నియమించారు.

March 6, 2026 / 10:05 AM IST

మోడల్ స్కూల్ ప్రవేశాలు.. ఈనెల 10వరకే ఛాన్స్

MDK: రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2026–27 ఏడాదిలో 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 6, 2026 / 10:05 AM IST

ఆలయ పునఃనిర్మాణ భూమి పూజలో పాల్గొన్న MLA, MLC

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని RRO కాలనీలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో MLA హరీష్ బాబు, MLC దండే విఠల్ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం వారు ఆలయ పునఃనిర్మాణ భూమి పూజకు విచ్చేసిన త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ఆశీర్వచాలు తీసుకున్నారు. వారి వెంట 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద ఉన్నారు.

March 6, 2026 / 10:02 AM IST

‘దయనీయ స్థితిలో వృద్దురాలు.. పింఛన్ మంజూరు చేయాలి’

CTR: సదుం MRC వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ(90) దయనీయ జీవితం గడుపుతోంది. ఓటర్ కార్డు ఉన్నా రేషన్, ఆధార్ కార్డు లేక ఆమెకు పింఛన్ అందడం లేదు. ఎవరైనా తిండి పెడితే తింటూ ఇబ్బందులు పడుతోంది. పింఛన్ మంజూరు చేస్తే తనకు ఎంతో సహాయకరంగా ఉంటుందని ఆమె వేడుకుంటోంది. అధికారులు స్పందించి పింఛన్ వచ్చేలా చేయాలని పలువురు కోరుతున్నారు.

March 6, 2026 / 10:02 AM IST