W.G: చంద్రగ్రహణం కారణంగా పెనుమంట్ర శ్రీ నత్త రామేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్లు ఈవో పులగం వేణుగోపాలరావు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. తిరిగి బుధవారం సంప్రోక్షణ పనులు పూర్తి చేసిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.
KMM: ఖమ్మం నగరంలోని శ్రీ భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షల సంసిద్ధత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమని, విద్యార్థులు భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
JGL: బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల రాజయ్య తన కొడుకులు పట్టించుకోవడం లేదని జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. తన భార్య 2020లో మృతి చెందిందని, ఆమె మరణించిన తర్వాత 6 నెలలు చూసుకుని తన పెద్ద కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడని, చిన్న కొడుకు వద్దకు వెళ్తే కోడలు బూతులు తిడుతుందని తెలిపారు.
అనంతపురం కలెక్టరేట్‌లో ‘వికసిత్ భారత్-జీ రామ్ జీ’ పోస్టర్లను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి, జీవనోపాధి కోసం 125 రోజుల పని దినాల హామీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
KNR: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పండుగ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మన సంస్కృతిలో స్నేహం, సౌహార్దం, ఆనందానికి ప్రతీక అని అన్నారు. రంగులలా మన జీవితాలు ఆ సంతోషాలతో నిండాలని, ప్రతి ఇంట్లో ఐక్యత, శాంతి, సుఖసమృద్ధులు నెలకొనాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో,అందరం కలిసికట్టుగా సామరస్యంతో ఉండాలన్నారు.
TG: CPMలో అభిశంసన కలకలం మొదలైంది. తమ్మినేని వీరభద్రం సహా మరో ఇద్దరిపై అభిశంసనం పెట్టనున్నారు. తప్పుడు రాజకీయాలు అనుసరించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీని తమ్మనేని వీరభద్రం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులను ప్రోత్సహించారని కేంద్ర కమిటీ మండిపడింది. త్రిసభ్య కమిటీ వివేదిక ఆధారంగా తమ్మినేని, స్కైలాబ్ బాబు, ప్రసాద్‌పై అభిశంసన పెట్టనున్నారు.
SRD: భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని ద్వారబంధము చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
NLG: చిట్యాల పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో హోలీ సంబరాలు మిన్నంటాయి. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా చిట్యాల మున్సిపల్ పారిశుధ్య మహిళా సిబ్బంది ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి వీధి రంగులమయంగా మారింది..
VSP: జిల్లాలో ఉదయాన్నే అగ్నిప్రమాదం జరిగింది. రుషికొండ బీచ్ రోడ్డులో వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకాడు. దీంతో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
KRNL: పెద్దకబూరు మం. SIగా విధులు నిర్వహిస్తున్న నిరంజన్ రెడ్డిని జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఈ. మారుతిని పెద్దకడబూరు మండల ఎస్సైగా నియమించారు. కొత్త ఎస్సైగా మారుతి త్వరలోనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
NZB: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ సోమవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 39 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.90 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
ASR: అనంతగిరి మండలం, కాశీపట్నం మెయిన్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన పర్యటకులు బొర్రా, అరకు వేలి, పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా, కాశీపట్నం ప్రధాన రహదారి రైతు భరోసా కేంద్రానికి సమీపంలో అనంతగిరి వెళ్తున్న ఇసుక లారీని అదుపుతప్పి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గంగాపురి గ్రామానికి చెందిన పులి శ్రీపాద శ్రీజ సీఎం కప్ 2026 రాష్ట్రస్థాయి (వెయిట్ లిఫ్టింగ్ ) క్రీడా పోటీలో స్టేట్ ఫస్ట్ (గోల్డ్, సిల్వర్) పతకాలు సాధించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని శ్రీపాద శ్రీజను 4వ వార్డ్ కౌన్సిలర్ మద్దికట్ల స్రవంతి అభినందించారు. అనంతరం వారి స్వగృహంలో శాలువాతో సన్మానించారు.
లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో PJR కమాండర్ అబూ హమ్జా మృతి చెందారు. హమ్జాను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే.
VZM: బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ ఎల్. రామలక్ష్మీ నిన్న ఇంజినీరింగ్, సచివాలయ ఉద్యోగులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాను వార్డు సెక్రటరీలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. భోజరాజపురం పంపు హౌస్’లో అన్ని మోటార్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇంఫిల్టిర్ బావులు వద్దకు నది నీరు వెళ్లేలా చూడాలన్నారు.