• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారు’

AP: మార్కాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తూమటి మాధవరావు ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిందే వైఎస్సార్ కుటుంబమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ముద్ర ఉందని ఆయన స్పష్టం చేశారు.

February 25, 2026 / 09:20 PM IST

రేపు జింబాబ్వేతో ‘డూ ఆర్ డై’ మ్యాచ్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య రేపు కీలక మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. ఇందులో భారత్ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

February 25, 2026 / 09:20 PM IST

శక్తి డెయిరీలో పేలుడు.. నలుగురికి గాయాలు

TG: జనగామ జిల్లా శక్తి డెయిరీలో పేలుడు సంభవించింది. ఒవెన్ పేలడంతో నలుగురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. ఓవెన్ చల్లారకముందే ఓపెన్ చేయడంతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం దాటికి బాదం సీసాలు పగిలిపోయి సీసాల ముక్కలు కార్మికులకు గుచ్చుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

February 25, 2026 / 09:19 PM IST

ఐదుగురు నకిలీ డాక్టర్ల గుట్టురట్టు

TG: హైదరాబాద్‌లోని మిర్యాలగూడలో ఐదుగురు నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ డాక్టర్లు కంటి ఆస్పత్రులను నడుపుతున్నారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో విషయం బయటపడింది.

February 25, 2026 / 09:18 PM IST

డైరీలో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

JN: రఘునాథ్ పల్లి మండలం గోవర్ధనగిరి శక్తి డైరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. కూలింగ్ ఛాంబర్లోని కంప్రెసర్ పేలడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాజు ముక్కలు శరీరంలోకి చొచ్చుకుపోవడంతో బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 09:16 PM IST

బౌలింగ్ చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

సత్యసాయి: అమరావతిలో జరుగుతున్న శాసనసభ్యుల క్రీడా పోటీల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందడి చేశారు. బుధవారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో ఆయన పాల్గొని ఉత్సాహంగా బౌలింగ్ చేశారు. అనంతరం బ్యాట్ తోనూ అలరించారు. వృత్తిపరమైన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.

February 25, 2026 / 09:13 PM IST

ఇంటర్ పరీక్షలు.. 96.90 శాతం హాజరు

TG: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1 పరీక్ష నిర్వహించారు. తొలి రోజు పరీక్షకు 96.90 శాతం హాజరు నమోదైనట్లుగా ఇంటర్ బోర్డు తెలిపింది. పరీక్షకు మొత్తం 5,14,598 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 4,98,695 హాజరయ్యారని, 15,903 మంది గైర్హాజరైనట్లుగా పేర్కొంది.

February 25, 2026 / 09:10 PM IST

చైన్ స్నాచింగ్.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

AP: NTR జిల్లా తిరువూరులో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ఓ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయ్యాడు. విజయవాడలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న నంద సుభాష్ అనే వ్యక్తి ఇటీవల చిక్కుళ్లగూడెంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించాడు. నిందితుడి నుంచి 40గ్రా. బంగారు గొలుసు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 09:10 PM IST

నానబెట్టిన బాదంతో ప్రయోజనాలు ఇవే..!

బాదం పప్పులను నేరుగా తినడం కంటే, రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పొట్టులో ఉండే ‘టానిన్’ అనే పదార్థం, పోషకాలను మన శరీరం సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటుంది. పొట్టు తీసి తినడం వల్ల విటమిన్-E, ప్రోటీన్లు ఒంటికి బాగా పడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. అలాగే, జ్ఞాపకశక్తిని పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

February 25, 2026 / 09:08 PM IST

ప్రాజెక్టులపై చంద్రబాబు మౌనం: సాకే శైలజానాథ్‌

AP: పొరుగు రాష్ట్రాల కారణంగా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చిందని మాజీమంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 09:07 PM IST

పీఎం విశ్వకర్మపై అవగాహన కార్యక్రమం

WNP: పానగల్ మండలంలోని అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఔత్సాహిక పాల్ సమీక వేతలకు విశ్వకర్మ, పీఎం ఈజిపి స్కీంలపై అవగాహన కల్పించారు. జనరల్ మేనేజర్ జ్యోతి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు చేతివృత్తులు చేసుకునే వారికి ఉపయోగపడుతుందని తెలిపారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 09:06 PM IST

సబ్ కలెక్టర్‌కు సర్పంచ్ ఫిర్యాదు

KMR: ప్రభుత్వ కార్యకలాపాలలో గ్రామ సర్పంచ్‌కు పాలకవర్గంకు భాగస్వాములను చేస్తూ అధికారులు సర్పంచ్‌లకు ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు ఉన్న డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ సర్పంచులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు.

February 25, 2026 / 09:05 PM IST

సూర్య కెప్టెన్సీపై వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కూడా సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. సూర్యకుమార్ ఒక అద్భుతమైన ఆటగాడని, అంతకు మించి గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం అంటే అది మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించాడు.

February 25, 2026 / 09:03 PM IST

నో రిటర్న్ బోర్డులు పెడితే శిక్ష తప్పదు!

దుకాణాల్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన తర్వాత కొన్నిసార్లు రిటర్న్ చేయాలని అనుకున్నప్పుడు దూకాణదారులు తిరిగి తీసుకోరు. అయితే, అది ఎలాగైతే ఉందో అదే స్థితిలో ఉంటే తిరిగి తీసుకోవడానికి వ్యాపారి నిరాకరించకూడదని వినియోగదారుల చట్టం చెబుతోంది. బిల్లులపై నో రిటర్న్ అని రాయడం 1999 నుంచి నిషేధించబడింది. వస్తువును వెనక్కి తీసుకోకపోతే సదరు దుకాణదారుడికి జరిమానా కూడా విధిస్తారు.

February 25, 2026 / 09:00 PM IST

గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించండి: కలెక్టర్

PLD: గిరిజన తండాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద 6 మండలాల్లోని 22 తండాలకు పైపులైన్లు, రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ తక్షణమే అనుమతులు ఇవ్వాలని సూచించారు. క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మౌలిక వసతుల కల్పనపై ఆమె దిశానిర్దేశం చేశారు.

February 25, 2026 / 09:00 PM IST