• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రహణం ఎఫేక్ట్.. ఆలయం మూసివేత..!

JGL: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3న (మంగళవారం) బీర్పూర్ శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయం మూసివేస్తున్నట్టు కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9 గం.లకు మూసివేసి సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకం తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తామని, భక్తులు గమనించగలరని ఈఓ అన్నారు.

March 2, 2026 / 09:17 AM IST

తెనాలిలో ‘కార్డెన్ సెర్చ్ నిర్వహణ

GNTR: తెనాలి త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జనార్ధనరావు పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది 5 గంటల నుంచే కాలనీని చుట్టుముట్టి ప్రతి ఇంటిని సోదా చేశారు. అనుమానిత వ్యక్తులను విచారించి వారి వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.

March 2, 2026 / 09:16 AM IST

ఈ నెల 4న ప్రారంభంకానున్న ముసలమ్మ జాతర

MHBD: కొత్తగూడ మండలంలోని గుంజేడు అడవుల్లో శ్రీ గుంజేడు ముసలమ్మ తల్లి జాతర ఈ నెల 4 నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. పచ్చని అడవుల మధ్య వెలసిన ఈ వనదేవత ఆలయం గిరిజన సంస్కృతికి నిలువెత్తు చిహ్నం. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

March 2, 2026 / 09:15 AM IST

అద్భుతంగా ఆడారు: సచిన్

విండీస్‌పై కీలక పోరులో భారత ప్లేయర్లు అద్భుతంగా ఆడారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. దీంతో భారత్ సైమీస్‌కు అర్హత సాధించిందని, క్రీజులో సంజూ శాంసన్ పాతుకుపోయి ఆడుతుంటే చూడటానికి బాగుందని పేర్కొన్నాడు. అలాంటి ఇన్నింగ్స్‌లే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తాయని చెప్పుకొచ్చాడు.

March 2, 2026 / 09:14 AM IST

నేటి నుంచే సర్పంచులకు ట్రైనింగ్..!

ADB: నార్నూర్ మండలంలోని 23, గాదిగూడలోని 25 గ్రామపంచాయతీల సర్పంచులకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఎంపీడీఓలు పుల్లారావు, శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఉట్నూరులోని KB కాంప్లెక్స్ లో ఉన్న గల యూత్ ట్రైనింగ్ సెంటరు(YTC)లో ఉన్నత అధికారులు వారికి పరిపాలన, పథకాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారని పేర్కొన్నారు.

March 2, 2026 / 09:11 AM IST

ఉపాధి హామీ పనులు పరిశీలించి మజ్జిగ పంపిణీ

SRCL: బోయినపల్లి మండలంలోని దుండ్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఉపసర్పంచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు చిర్ర వంశీకృష్ణ, మంద వెంకటేష్ గౌడ్, ఎం. డి యూసఫ్ బాబు, కందుల పుష్పలత, బచ్చు రమ, ముచ్చ సుమలత, జంగం వినోద క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పనుల్లో పాల్గొంటున్న వారికి మజ్జిగ పంపిణీ చేశారు.

March 2, 2026 / 09:10 AM IST

వినూత్న ఆలోచనతో మెరిసిన దీక్షిత, ప్రణతి

KMR: అచ్చంపేట TGMS పాఠశాల విద్యార్థినులు దీక్షిత, ప్రణతి ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రోబోటిక్స్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రతిభ కనబరిచి ట్రోఫీ సాధించారు. తమ రోబోటిక్స్ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందారు. ఈ విజయంతో పాఠశాలకు, మండలానికి గర్వకారణమయ్యారు. ఉపాధ్యాయురాలు చందనను, విద్యార్థినులను తల్లిదండ్రులు అభినందించారు

March 2, 2026 / 09:09 AM IST

మట్కా ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు

ASF: మట్కా ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కాగజ్ నగర్ SI సుధాకర్ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో కొందరు వ్యక్తులు మట్కా ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి ఐదుగురిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.10,400 నగదు, మట్కా చీటిలు, సెల్ఫోన్లు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు SI పేర్కొన్నారు.

March 2, 2026 / 09:09 AM IST

‘ఇళ్ల మధ్యలో డంపు చేసిన చెత్తను తరలించాలి’

ATP: గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ ఏరియాలో సోమవారం చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. కాలనీవాసులు కాళీ ప్రదేశంలో చెత్తను డంపు చేశారని కమిషనర్‌‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే కమీషనర్ చెత్తను తరలించాలని సిబ్బందికి ఆదేశించారు. డ్రైనేజీ కాలువలపై సేఫ్టీ గా బండలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్‌కు సూచించారు.

March 2, 2026 / 09:08 AM IST

నేడు శ్రీరంగాపురంలో రంగనాథ కల్యాణం

WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసిన శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు కోరారు.

March 2, 2026 / 09:07 AM IST

‘గ్రామంలో తాగునీటి సమస్య.. వెంటనే పరిష్కరించాలి’

NDL: నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా మరమ్మతులు చేయకపోవడంతో గ్రామస్థులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో ఎద్దడి ఏర్పడిందని ఇవాళ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలనిన్నారు.

March 2, 2026 / 09:05 AM IST

‘ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి’

E.G: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జీ. చిరంజీవి విజయవాడ జోనల్ అధ్యక్షుడిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా RJY డిపో ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, మెమోంటో అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు కోరారు.

March 2, 2026 / 09:04 AM IST

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

BHNG: రాజపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన తులసి అశోక్ గౌడ్ ఇటీవల తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందడు. దీంతో  అతని కుటుంబానికి 2001- 2002 సంవత్సర పదవ తరగతి స్నేహితులు 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు.

March 2, 2026 / 09:04 AM IST

నేటి నుంచి ఓపెన్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్‌కు 12, 10వ తరగతికి 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

March 2, 2026 / 09:04 AM IST

ఆలయంలో ప్రదోష కాల అభిషేకాలు.. నేడు గిరి ప్రదక్షిణ

కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష కాల అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

March 2, 2026 / 09:03 AM IST