W.G. యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ ప్రతాప్ అన్నారు. శనివారం తణుకు వెంకటేశ్వర సెంటర్‌లో పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని కోరుతూ.. సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
CTR: పుంగనూరులో ఈనెల 10, 11వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి శనివారం పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ భాను ప్రసాద్ అమ్మవారి సేవకులకు 100 టీ షర్ట్‌లను అందజేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన టీ షర్టులను వితరణ చేస్తున్నారు. అమ్మవారి సేవకులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
KMR: విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన టీచర్లు బాహాబాహీకి దిగిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో శనివారం చోటు చేసుకుంది. బొమ్మన్ దేవ్పల్లి ZPHSలో విధులు నిర్వహిస్తున్న నంద్యాల శ్రీనివాస్ తోటి ఉపాధ్యాయుడైన రామోజీ శ్రీనివాస్‌తో వ్యక్తిగత కక్షల కారణంగా ఘర్షణకు దిగారు. ఈ మేరకు నంద్యాల శ్రీనివాస్ కుర్చీతో రామోజీ శ్రీనివాస్ తలపై కొట్టాడు.
NZB: భారతీయ సంస్కృతికి, భారతీయ కుటుంబ వ్యవస్థకుఆధారం ఇంటి ఇల్లాలు అని, అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ అని మొట్టమొదటి గౌరవాన్ని స్త్రీకే ఇచ్చారని నగర మేయర్ ఉమారాణి వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ జ్ఞాపకార్థం ఆవిడ మేనల్లుడు మాదాసు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదర్శ మహిళల సన్మాన కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు.
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని గురుమిళ్ళపల్లి గ్రామానికి చెందిన బేతి మల్లేశం-అరుణ దంపతుల కుమారుడు బేతి విక్రమ్ యూపీఎస్సీ ఫలితాల్లో 472వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి విక్రమ్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామానికి గౌరవం తీసుకువచ్చిన విక్రమ్ మరింత ఉన్నత స్థానాలను చేరుకోవాలని కోరారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే రికార్డుల వేటను మొదలుపెట్టింది. AR రెహమాన్ స్వరపరిచిన ఈ సినిమా పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘చికిరి చికిరి’, ‘రై రై రా రా’ అనే రెండు పాటలు కలిపి యూట్యూబ్‌లో ఏకంగా 300 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదల క...
AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం’ అని పేర్కొన్నారు.
KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో ప్రజా పాలన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ ఉత్తర్వుల మేరకు రెండవ రోజు ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నాక్ & అకడమిక్ రికార్డులను సీనియర్ అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశీలించి, తగు సూచనలు చేశామని పేర్కొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లు ప్రమాదానికి పొంచి దర్శనమిస్తున్నాయి. రోడ్డు సమీపంలో ఉన్న విద్యుత్తు స్థంబాల తీగలకు చెట్ల కొమ్మలు విపరీతంగా పెరిగి అంటుతుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
NLG: నార్కట్‌పల్లి మండలం మాదవడవల్లి లో సామ తనుష్ రెడ్డి (19) అనే విద్యార్థి శనివారం మధ్యాహ్నం తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యక్తిగత కారణాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుని తండ్రి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడుతూ.. తొలుత బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోరు చేస్తామనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అన్నాడు. అయితే గతంలో తమ జట్టు 250 పైచిలుకు భారీ స్కోర్లను సాధించినట్లు గుర్తు చేశాడు.
PPM: కొమరాడ మండలం బిన్నిడిగ్రామంలో మహిళ దినోత్సవాన్ని సొసైటీ కార్యదర్శి గౌస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఉద్యాన శాఖ అధికారి గిరిజ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీ మహిళలు సామాజికంగా ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలంటే చదువు అవగాహన ద్వారానే సాధ్యం అవుతుందన్నారు.
ASF: గ్రామాల్లో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని గొప్పగా చెప్పుకుంటూ నిర్మించిన యోగ సాధన కేంద్రం వాంకిడిలో మాత్రం తాళాలకే పరిమితమైంది. స్థానిక వాంకిడి మండల కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ‘ఆరోగ్య స్వస్థత కేంద్రం’ పేరుతో ఏర్పాటు చేసిన యోగ కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.
MNCL: ప్రభుత్వ ఆసుపత్రులకు విచ్చేస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను శనివారం సందర్శించారు. వార్డులు, మందుల నిలువలు, ఆసుపత్రి పరిసరాలు, చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.
TG: గద్దర్ అవార్డ్స్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు చెప్పారు. తనకు ఎన్టీఆర్ అవార్డు రావడం గొప్ప గౌరవమన్నారు. జ్యూరీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.