• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉమ్మడి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా అమర్నాథ్

ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 07:34 AM IST

అరుణాచలం తరహాలో నేడు దేవరకొండ గిరిప్రదక్షిణ

ATP: అరుణాచలం తరహాలో బుక్కరాయసముద్రం దేవరకొండ చుట్టూ వేంకటరమణ స్వామి గిరిప్రదక్షిణకు ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి సందర్బంగా నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దాతల సహకారంతో కొండ చుట్టూ రహదారి, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గిరిప్రదక్షిణ సమయంలో స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగిస్తారు.

March 4, 2026 / 07:34 AM IST

నేడు జిల్లాకు ఒడిశా గవర్నర్

VZM: ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం కొత్తవలస మండలం మంగళపాలెం రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆనంతరం ఆసుపత్రిని సందర్శిస్తారు. రాష్ట్ర గవర్నర్ రానుండడంతో పోలీస్ భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు.

March 4, 2026 / 07:34 AM IST

బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు

HYD: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి మేడ్చల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద శిక్షతో పాటు జరిమానాలు విధించగా, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

March 4, 2026 / 07:33 AM IST

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

MDK: రామాయంపేట వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తూప్రాన్ మండలం నర్సంపల్లి రెడ్యానాయక్ తాండకు చెందిన సాయి (24) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సాయిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి

March 4, 2026 / 07:33 AM IST

పాలసముద్రం మండలంలో అడవి పందుల బెడద

CTR: పాలసముద్రం మండలంలో అడవి పందుల బెడద పెరిగింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలను పందులు ధ్వంసం చేస్తున్నాయి. 13 పంచాయతీల్లో ఒకో రైతు ఐదు ఎకరాల పంటలో మూడు ఎకరాల వరకు నష్టపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 07:30 AM IST

వృద్ధురాలిపై చాకుతో బెదిరించి దోపిడీ

కృష్ణా: చల్లపల్లి (M)లోని లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో మంగళవారం దోపిడీ కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 78 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వంటగదిలోకి చొరబడ్డారు. చాకుతో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

March 4, 2026 / 07:30 AM IST

బాక్సాఫీస్ వద్ద రాధికా రచ్చ!

సీనియర్ నటి రాధికా ప్రధాన పాత్రలో నటించిన ‘తాయి కిళవి’ కోలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం తొలి వారంలోనే సుమారు రూ.25 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ‘పసుపు తాయి’గా రాధికా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆమె ప్రోస్థటిక్ మేకప్ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపిస్తున్నాయి.

March 4, 2026 / 07:28 AM IST

నేడు తిరుపతిలో జాబ్ మేళా

TPT: తిరుపతిలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్పీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ చదివిన వారు మేళాకు హాజరు కావాలని సూచించారు.  నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 4, 2026 / 07:27 AM IST

నేడు తిరుపతిలో ఉద్యోగ మేళా

TPT: తిరుపతిలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్పీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ చదివిన వారు మేళాకు హాజరు కావాలని సూచించారు.  నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 4, 2026 / 07:27 AM IST

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఆత్మకూరు సీఐ

NDL: కారులో ప్రయాణించేవారు సీటుబెల్టు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆత్మకూరు సీఐ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం తాగి, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమన్నారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 4, 2026 / 07:24 AM IST

వరంగల్ నిట్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ

వరంగల్ నగరంలోని ఎన్ఐటిలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి వ్యక్తిగత కారణాలతో కొంతమంది విద్యార్థుల మధ్యవాగ్వాదం చెలరేగి దాడులకు చేసుకున్నారు.ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు గాయాలు కాగా,వారికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. మంగళవారం కళాశాల అధికారులు సంబంధిత విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

March 4, 2026 / 07:22 AM IST

జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బొడ్డేడ ప్రసాద్

అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బొడేడ ప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రసాద్ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

March 4, 2026 / 07:22 AM IST

T20 WC నాకౌట్స్.. RO-KOవే రికార్డ్స్

T20 WC నాకౌట్స్ రౌండ్‌లో అత్యధికంగా 373 రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 6 మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించగా.. రోహిత్(8 మ్యాచుల్లో 227), బట్లర్(6లో 226) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ రౌండ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డ్(5) కోహ్లీ పేరిట ఉండగా.. అత్యధిక మ్యాచులాడిన ఆటగాడిగా రోహిత్(8) కొనసాగుతున్నాడు.

March 4, 2026 / 07:22 AM IST

అరుదైన గర్భాశయ ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స విజయవంతం

SDPT: జిల్లా గజ్వేల్ ఆసుపత్రిలో 43 ఏళ్ల మహిళకు అరుదైన గర్భాశయ ఫైబ్రాయిడ్ (లియోమయోమస్) శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. గర్భాశయ కండర గోడలలో పెరిగిన 24 వారాల పరిమాణంలో ఉన్న 13/11/10 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్‌ను వైద్యులు తొలగించారు. ఈ శస్త్ర చికిత్సను డాక్టర్ త్రివేణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రేమ్ కిషోర్, అనస్థీషియా డాక్టర్ మైపాల్ తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:21 AM IST