• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కొమరాడలో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలం వన్నాంగ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

February 24, 2026 / 08:58 PM IST

కనక దుర్గమ్మను దర్శించిన ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి మంగళవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

February 24, 2026 / 08:57 PM IST

ఉప్పల్ సమస్యలపై పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం..!

MDCL: ఉప్పల్ నుంచి చిలుకా నగర్ వెళ్లే మార్గంలో కావేరి నగర్ కమాన్ వద్ద పైపులైన్ కోసం తవ్వగా రోడ్డు అత్యంత ఇరుకుగా మారి పరిస్థితి, అధ్వానంగా మారింది. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, ప్రమాదకరంగా వాహనదారులు అటువైపు వెళుతున్న పరిస్థితి. దీనిపై అనేక కథనాలు వెలువడినప్పటికీ, మున్సిపల్ అధికారులకు తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.

February 24, 2026 / 08:56 PM IST

‘దక్షిణాది సినిమాలకు ‘ధురంధర్‌ 2’ సవాల్‌’

పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న దక్షిణాది చిత్రాలకు ‘ధురంధర్‌ 2’ రూపంలో గట్టి పోటీ ఎదురుకాబోతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డాడు. దక్షిణాది సినిమాలు సృష్టించిన బెంచ్ మార్క్‌ను ఈ సినిమా తుడిచేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రేక్షకులు ఒక్కసారి ఈ తరహా సినిమా రుచి చూస్తే.. రొటీన్ మసాలా సినిమాలు ప్రమాదంలో పడినట్లేనని RGV హెచ్చరించాడు.

February 24, 2026 / 08:55 PM IST

బాల్య వివాహాలు సామాజిక శాపం

PPM: బాల్య వివాహాలు సామాజిక శాపమని, అందుకే వాటి పట్ల అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (NIC) ఎం.ఏ.నాయుడు పేర్కొన్నారు. మంగళవారం పాచిపెంట మండలంలోని కొత్తవలస, కర్రివలస ZPHSలో ప్రత్యేక సదస్సులను ఆయన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు.

February 24, 2026 / 08:54 PM IST

KTR జైలుకెళ్లే సమయం దగ్గరపడింది: ఆది శ్రీనివాస్

TG: మాజీమంత్రి KTR జైలుకు వెళ్లే సమయం దగ్గరపడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. BRS పదేళ్లలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారని ప్రశ్నించారు. మంత్రి కాన్వాయ్‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రవర్తించారని విమర్శించారు. దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు.

February 24, 2026 / 08:51 PM IST

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

MDK: జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 28 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వివరించారు. సీసీటీవీ కెమెరాలు, త్రాగునీరు, విద్యుత్తు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేశామన్నారు.

February 24, 2026 / 08:50 PM IST

మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలి: మేయర్

BDK: నూతనంగా ఎన్నికైన కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌ను మంగళవారం ప్రకృతి ప్రేమికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి హరితదీక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవడం శుభపరిణామమని, నైనికను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

February 24, 2026 / 08:50 PM IST

ఏపీ కేబినెట్ నిర్ణయాలు 

✦ విశాఖలో రూ.2,387 కోట్లతో నిర్మించే సెమీకండక్టర్ పరిశ్రమకు ఆమోదం✦ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం✦ ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలను అభివృద్ధి చేయాలని నిర్ణయం✦ వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం✦ కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనకు ఆమోదం✦ సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం

February 24, 2026 / 08:48 PM IST

‘అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్’

MHBD: ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దవంగర SI చిలువేరు ప్రమోద్ తెలిపారు. తొర్రూరు మండలంలోని బొంతుపల్లి తండాకు చెందిన గుగులోతు సురేష్ నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని ఆకేరు వాగు నుంచి పెద్దవంగర మండలానికి ఇసుక తరలిస్తున్న క్రమంలో సీజ్ చేసి,అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 08:47 PM IST

గురుకుల సంఘటనపై విచారణ చేపట్టిన డిప్యూటీ సెక్రటరీ

JN: పాలకుర్తి (M) కేంద్రంలోని గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాల & కళాశాలలో నిన్న జరిగిన సంఘటనపై గురుకులాల సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ గురుకులాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు DY సెక్రటరీ D.S వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో భోజనం ఆలస్యం కావడం వలన విద్యార్థుల ధర్నా చేసినట్లు విచారణ తేలిందని తెలిపారు.

February 24, 2026 / 08:46 PM IST

బాధితుడికి ఆర్థిక సహాయం

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలగౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు బాల గౌడ్ ఇంటికి వెళ్లి తక్షణ సహాయంగా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. బాలా గౌడ్ ఆరోగ్యం బాగుపడేందుకు మెరుగైన చికిత్స కోసం తోడ్పాటు అందిస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు.

February 24, 2026 / 08:45 PM IST

జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ ఆదేశాలు

కృష్ణా: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు–సేవల పన్నుల వసూళ్లు సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

February 24, 2026 / 08:45 PM IST

బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం

WGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు అధికారులు, అర్చకులు ఆహ్వానం అందజేశారు. భక్తులకు సౌకర్యాల కల్పన, భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

February 24, 2026 / 08:44 PM IST

టీమిండియాలో ఆ ప్లేయర్లపై వేటు..?

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ స్థానంలో శాంసన్, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, వన్ డౌన్‌లో సూర్య, ఆ తర్వాత స్థానంలో తిలక్ బ్యాటింగ్‌కు రావొచ్చు.

February 24, 2026 / 08:44 PM IST