• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ పట్టణంలోని TGTWRJC బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించి, వారికి కల్పించిన వసతులపై ఆరా తీశారు.

February 25, 2026 / 11:16 AM IST

‘భారీ బందోబస్తును ఏర్పాటు చేశాం’

MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని స్థానిక ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితిని అధికారులు, పోలీసుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

February 25, 2026 / 11:14 AM IST

జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలి: ఎస్సై

KMR: బిక్కనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఎస్సై ఆంజనేయులు సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అపరిచితులకు అనుమతి లేదన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ దుకాణాలు తెరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 25, 2026 / 11:14 AM IST

సమస్యకు వెంటనే పరిష్కరించిన కౌన్సిలర్

RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు రజక నగర్, అంబేద్కర్ నగర్‌లలో బోరు మోటర్ పాడైపోయింది. ఈ విషయాన్ని స్థానికులు వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ బోరు మోటార్లను బాగు చేయించారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

February 25, 2026 / 11:13 AM IST

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్

AP: వైఎస్సార్ కడప జిల్లా నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంతో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండితులు జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జగన్ రాకతో ఆలయంలో సందడిగా మారింది.

February 25, 2026 / 11:11 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన.. మండల వైద్యాధికారి

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మండల వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డాక్టర్ మౌనిక మాట్లాడుతూ.. ప్రస్తుత నెలలో 182 మందికి ఓపీ సేవలు, 117 మందికి రక్త పరీక్షలు, 1404 మందికి వివిధ టెస్టులు నిర్వహించినట్లు వివరించారు. వైద్య సిబ్బంది ఉన్నారు.

February 25, 2026 / 11:11 AM IST

పోర్టుల కాలుష్యం.. ఢిల్లీని మించే ప్రమాదం!

VSP: విశాఖ పరిసరాల్లో పోర్టుల కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోంది. గంగవరం పోర్టులో ఇనుప ఖనిజ మిశ్రమ కేంద్రం ఏర్పాటుతో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. విశాఖ, గంగవరం, నక్కపల్లి పోర్టుల నుంచి బొగ్గు, ఇనుప ఖనిజ రవాణాతో గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 25, 2026 / 11:10 AM IST

హ్యుందాయ్, కియా, BMW కార్లు రీకాల్

ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా, BMW కొరియా భారీ రీకాల్‌ ప్రకటించాయి. తయారీ లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో 37 మోడళ్లకు చెందిన 1,07,158 వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హ్యుందాయ్ 37,690, కియా 1,590, BMW కొరియా సంస్థ 520i, 320i సహా 32 మోడళ్లకు చెందిన 67,878 కార్లను రీకాల్ చేస్తోంది.

February 25, 2026 / 11:10 AM IST

ప్రభుత్వ కళాశాలను పరిశీలించిన తహశీల్దార్

MDK: నార్సింగి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న వార్షిక పరీక్షలను తహశీల్దార్ గ్రేసి బాయ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొంటూ, విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.

February 25, 2026 / 11:09 AM IST

రేపు కొండ బిట్రగుంటలో స్వామివారి బ్రహ్మోత్సవాలు

NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు గిరి ప్రదక్షిణ, సాయంత్రం 4 గంటలకు పూలంగి సేవ, రాత్రి 7 గంటలకు అంకురార్పణం జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.

February 25, 2026 / 11:08 AM IST

పశు ఔషధ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు

KMM: పశువులకు జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పశు ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోందని జిల్లా పశువైద్య అధికారి బి. పురంధర్ తెలిపారు. జిల్లాకు ఒకటి, మండలానికి ఒక కేంద్రం చొప్పున సహకార సంఘాల ద్వారా వీటిని స్థాపించవచ్చు. 120 గజాల స్థలం, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ కలిగిన వారు రూ.5 వేల ఫీజుతో ఆన్ లైన్ల లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 11:08 AM IST

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264పై కేసు నమోదు..!

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మంది పోకిరీలను షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై కేసులు నమోదు చేయగా.. 52 మందికి రూ.1,050ను కోర్టు జరిమానా విధించింది. నలుగురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించగా..188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.

February 25, 2026 / 11:08 AM IST

దేవరకొండలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నల్లగొండ: జిల్లా దేవరకొండ పట్టణంలో బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 కేంద్రాలలో మొత్తం 1,210 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు, వెలుతురు వంటి సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

February 25, 2026 / 11:07 AM IST

విధులకు రాని వైద్యులపై సర్కార్ వేటు

TG: విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలు ఉల్లంఘించి విధులకు రాని 94 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు డీఎంఈ టెర్మినేషన్ నోటీసులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చిలో చేపట్టనున్న 600 మంది వైద్యుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఖాళీలను క్లియర్ చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

February 25, 2026 / 11:07 AM IST

‘వ్యవసాయ కనెక్షన్లు వేగంగా మంజూరు’

PDPL: పెద్దపల్లి సర్కిల్‌లో రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు, వ్యవసాయ కనెక్షన్లు వేగంగా మంజూరు చేస్తున్నట్లు ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 344 సర్వీసులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పంటల కోత అనంతరం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 11:07 AM IST