W.G: నరసాపురం పాతబజార్ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద, గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిసి ఏకంగా 499 పరుగులు సాధించాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గతంలో ఈ రికార్డు 2016 WCలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ (459 పరుగులు) పేరిట ఉండేది. అయితే, ఈ మ్యాచ్ కూడా వాంఖడే స్టేడియంలోనే జరగటం గమనార్హం.
SRPT: కోదాడ మండల పరిధిలోని తోగర్రాయి గ్రామంలో వేణుగోపాల స్వామి వారి కళ్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇవాళ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా, అనంతరం ఆయన స్థానిక భక్తులు, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు.
BPT: కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం పంచాయతీలో జరుగుతున్న ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇంటి పన్నులు నూరుశాతం వసూలు చేయాలని సూచించారు. షాపులకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ పన్నులు కూడా స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా చెల్లించేలా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని అన్నారు.
దేశ అత్యున్నత ఉద్యోగమైన సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకుతో మెరిశాడు. రాజేశ్వరి సువే రెండో ర్యాంకు, ఆకాన్ష్ ధుల్ మూడో ర్యాంకు సాధించగా.. రాఘవ్ ఝన్‌ఝన్ వాలాకు నాలుగో ర్యాంకు వచ్చింది. తెలుగువారిలో సృజన 55వ ర్యాంకు, DSK ప్రచేత్ 193, వర్షిత్ రెడ్డికి 259, పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకు సంపాదించాడు.
ఏలూరు: నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజాదర్బార్‌లో అందిన వినతులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ప్రతీ దశలోనూ సంబంధిత సిబ్బందితో నియోజకవర్గ యూనిట్ కార్యాలయ సిబ్బంది పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న 10 సూత్రాల కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.
SKLM: గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి, ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. హీరమండలం మండలంలో శుక్రవారం ఆయన పర్యటించి, జలాశయానికి నీటిని తరలించే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
NDL: ఆత్మకూరు ఘాట్ సెక్షన్‌లో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు డోన్ పట్టణానికి చెందినవాడిగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదంనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRCL: చందుర్తి మండలానికి కేటాయించిన మహిళా సమాఖ్య భవనాలను జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. యువతకు జాబ్ మేళాలు నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ కింద జిల్లాలోని రైతులు తమ వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీన ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామసభ ఉంటుందన్నారు.
VZM: అత్యధిక లాభాలను ఇచ్చే ఉద్యాన పంటలను సాగు చేయాలని జిల్లా రైతాంగానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. భోగాపురం మండలంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కొయ్యపేటలో రైతులు సాగుచేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించారు. పొలాల్లో దిగి రైతులతో మాట్లాడి ...
ప్రకాశం: చీమకుర్తి బాలికల వసతి గృహాన్ని ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినులకు అందుతున్న వసతులు, విద్యా ప్రమాణాలు, పారిశుద్ధ్య నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి విద్యార్థులతో కలిసి అల్పాహారం సేకరించారు. ఆహార నాణ్యతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
MNCL: రాష్ట్రంలోని బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని శనివారం మంచిర్యాలలోని గాంధీ పార్కుల్లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలలో కుల వివక్షకు గురైన కులాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
SRD: సంగారెడ్డి నుంచి బీహెచ్ఎల్ వరకు పెరిగిపోతున్న కాలుష్యంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మెదక్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న కంకర మిషన్ల వద్ద దుమ్ము వెదజల్లుతున్నా పొల్యూషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఈ సమస్య పై ప్రత్యేక దృష్టి సారించలన్నారు.
TG: హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రం, అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ. 35 కోట్ల సున్నా వడ్డీ రుణాలు చెక్కులు పంపిణీ చేశారు.
GNTR: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖల అభివృద్ధి నివేదికలను అసెంబ్లీలో విడుదల చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పురోగతిని వివరిస్తూ, తెనాలి నియోజకవర్గ అభివృద్ధి నివేదికను మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అందజేశారు. గత రెండేళ్లలో చేపట్టిన పనులు, పథకాల సమగ్ర వివరాలు ఈ నివేదికలో పొందుపరిచినట్లు వారు పేర్కొన్నారు.