VZM: సివిల్ సర్వీస్ పరీక్షలలో 640 ర్యాంకును సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చిన పల్లి ప్రమోద్ విష్ణు, కలక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని శనివారం కలక్టర్ క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. విష్ణు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారిగా పని చేస్తున్నారు.
కర్నూలు: కలెక్టర్ సిరి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించి జిల్లాలో తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో మరింత పురోగతి సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచాలని అధికారులకు తెలిపారు.
NDL: ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధిలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమని జనసేన యువ నాయకులు అరుణ్ కుమార్, ప్రదీప్ కుమార్ ఇవాళ తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
VSP: గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డు కణితి కాలనీకి చెందిన గుమ్మాల రాజబాబు కుమార్తె శ్వేత సివిల్స్ పరీక్షల్లో 573వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆమెను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మహేష్‌తో పాటు మధు, ఆర్‌వీ సుధాకర్, ఆర్‌వీ శ్రీనివాసులు, గోవింద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, రాబోవు రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేస్తానని తెలిపారు.
అనకాపల్లి నియోజకవర్గంలో ఆర్.అండ్.బీ రహదారుల అభివృద్ధికి రూ.5.10 కోట్లు నిధులు మంజూరైనట్లు కూటమి నేతలు నాగేశ్వరరావు, వెంకట సన్యాసినాయుడు, తాతారావు తెలిపారు. శనివారం అనకాపల్లి జనసేన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చొరవతో నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
SKLM: వేసవి కాలంలో గొర్రెలు, మేకలు వంటి పశువుల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోతే మూగజీవాలు మరణించే ప్రమాదం ఉందని పశుసంవర్ధక శాఖ ఏడి జి. నారాయణరావు అన్నారు. ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాలను శనివారం సందర్శించి పాడి రైతులతో మాట్లాడారు. వేసవిలో పశువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
SRCL: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనీ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలో గౌతమ్ మోడల్ స్కూల్లో 14వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, విలువలను అలవరుచుకోవాలన్నారు.
PDPL: రామగుండం ప్రభుత్వ ఐటీఐలో యువతకు నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించుటకు 6 రకాల స్వల్ప కాలిక కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేందర్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ఆసక్తిగల నిరుద్యోగ యువత ఇట్టి శిక్షణ కోర్సులను వినియోగించుకోవాలని కోరారు.
VSP: చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులుగా నియమితులైన విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి శనివారం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. పాలలో ఇథలిన్ గ్లైకాల్ కలిసినట్లు గుర్తించారు. కిడ్నీ ఫెయిల్యూర్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో.. బాధితులు చనిపోయినట్లు FSL, RFSL రిపోర్టులో వెల్లడైంది. గత నెల 16న ఫ్రిడ్జ్‌ను రిపేర్ చేయించిన గణేష్.. లీకైన్ కంటైనర్‌కు ఎంసీల్ అంటించాడు. రిపోర్టు ఆధారంగా అధికారులు గణేష్‌పై చర్యలు తీసుకోనున్నారు.
ELR: గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వరం లాంటిదని సర్పంచ్ దిడ్ల అలకనంద అన్నారు. శనివారం ఉంగుటూరు(M) నారాయణపురంలో ఉపాధి హామీ నిధులు రూ.40 లక్షలతో గీతాంజలి స్కూల్ నుంచి పాతూరు సత్యనారాయణ పొలం, టైల్ ఫ్యాక్టరీ రోడ్డు వరకు సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ధర్మరాజు కృషితో ఈ పనులు చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.
విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు ఎస్పి పి.సౌమ్యలత పాల్గొని రక్తదాతలను ప్రశంసా పత్రాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ కె ప్రసాద్ రావు పాల్గొన్నారు.
ATP: అనంతపురం నగరంలోని మహిళా, బాలల గ్రంథాలయ ఆడిటోరియంను నిరుద్యోగ యువత కోసం అత్యాధునిక స్టడీ హాల్‌గా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ తెలిపారు. శనివారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ఆడిటోరియంను సందర్శించారు. భవన మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై వివరించారు.
HNK: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డీఆర్ఓకు సీఐటీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కోరారు. 2వ పీఆర్సీలో నిర్ణయించి అమలు చేయాలని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.