NLR: రెవెన్యూ అధికారులందరూ చట్టాలపై అవగాహన పెంచుకుని ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మ్యూటేషన్లు, రీ-సర్వే, 22ఏ వంటి అంశాల్లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
PPM: జిల్లాలోని వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సమీక్షించడం కోసం కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లను సందర్శించి, నివేదికలు సమర్పించాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
SKLM: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం హిరమండలం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో గడువు తీరిన చిక్కీ ప్యాకెట్‌ను గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యురాలైన ఇంఛార్జ్ హెచ్ఎం ఎస్తేర్ రాణికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
CTR: అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన డాక్టర్ వీఎం థామస్‌కు పైనేని మురళి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన తీరు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు అందించాలని యువత తరఫున కోరారు.
NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగు నీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు మరియు మౌలిక సదుపాయాల పనులను ఈ 99 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులను కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ఈ ‘ప్రగతి ప్రణాళిక’ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
ASR: అడవుల్లో మంటలు చెలరేగడం వల్ల సమస్త జీవజాలానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆరకు రేంజ్ అటవీ అధికారి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆరకు సంతలో అటవీశాఖ ఆధ్వర్యంలో అడవులకు నిప్పు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. అడవులు ప్రకృతి సంపదగా ఉండి మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
SRPT: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ నడిగూడెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎల్. మల్సూర్, సర్పంచ్ దున్న శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది అందరూ కలిసి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కార్యాలయ ఆవరణలోని వ్యర్థాలను, పిచ్చి మొక్కలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
TPT: తిరుపతి గ్రేడ్-1 శాఖ గ్రంథాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, బీడీసీ నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పుస్తక పఠనం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో గ్రంథాలయ కార్యదర్శి RVRSS శర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రామాలు, వార్డుల్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను శనివారం సాయంత్రం నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లు, ఎంఫీడీవోలు స్వర్ణ కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుని సర్వే ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.
AP: ఒకటో తేదీనే పోలీసులకు జీతాలు ఇస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. పోలీసుల సంక్షేమం కోసం కూటమి సర్కార్ ఆలోచిస్తుందన్నారు. గత వైసీపీ హయాంలో పోలీసులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని ఆరోపించారు. రాజకీయ కక్షతో ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూశామని విమర్శించారు. పోలీసులకు రాజకీయాలు ఆపాదించడం సరి కాదన్నారు.
MLG: గాంధీనగర్ గ్రామ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సర్పంచ్ నిర్మల-వెంకన్న తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహిస్తామని, గ్రామస్థుల సమస్యలను స్వయంగా విని త్వరితంగా పరిష్కరిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VKB: మర్పల్లి మండల కేంద్రంలో లక్ష్మణ్ కిరణ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ ఎర్పడి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకునేలోపు షాపు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. తహసీల్దార్, కలెక్టర్ సిబ్బంది స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. కిరాణా షాప్ యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ATP: రెడ్డిపల్లి పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ పథకాల పురోగతిపై MP అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాను కరవురహితంగా మార్చడంలో పశుసంవర్ధక రంగం కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పాడి పశువు ఉంటే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. శాఖలోని ఖాళీల భర్తీ, పశుగణ బీమా నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
HYD: జలమండలిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జలమండలి ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఈడీపీ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ వద్ద ఫైల్ డిస్పోసల్‌ను పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. పేరుకుపోయిన పాత ఫైళ్లను తొలగించి కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఫైళ్లను భద్రపరచాలని సూచించారు.
ఏలూరు: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో బస్సు షెల్టర్ కూల్చివేసిన సంఘటన గ్రామంలో శుక్రవారం సాయంత్రం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పార్టీకి చెందిన నాయకులే బస్సు షెల్టర్ కూల్చినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. గ్రామంలోని టీడీపీ పార్టీలో వర్గ విభేదాలతో షెల్టర్ కూల్చారని అనుమానిస్తున్నారు.