CTR: జాతీయ రహదారుల పనుల నిమిత్తం ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు పలమనేరు, బైరెడ్డిపల్లె, పెద్దపం జాణి, గంగవరం మండలాల సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులకు ప్రత్యామ్నాయ సరఫరా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
CTR: చిత్తూరు కార్పొరేషన్‌లో జాతీయ రహదారుల పనుల నిమిత్తం ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు పలమనేరు, బైరెడ్డిపల్లె, పెద్దపం జాణి, గంగవరం మండలాల సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులకు ప్రత్యామ్నాయ సరఫరా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
KNR: SRR ప్రభుత్వ కళాశాల NSS యూనిట్-2 & 5 వాలంటీర్లు రుక్మాపూర్, కాట్నపల్లి గ్రామాల్లో సోమవారం ఇంటింటా తిరిగి తడి, పొడి చెత్త వేరు చేయడం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెత్తను వేరు చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే గ్రామ మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి, వారి కార్యకలాపాల వివరాలు తెలుసుకున్నారు.
GDWL: గద్వాలకు సమీపంలోని జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారికి కృష్ణానదీ జలాలతో అభిషేకం చేసి, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చన, ఆకుపూజ, హోమం తదతర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి సారెలు సమర్పించారు.
TG: ఈ నెల 20న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మూసీ అభివృద్ధికి రూ. 5,812 కోట్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు.. జోన్-1పనులకు రూ.1684 కోట్లు, గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు జోన్-2 పనులకు రూ. 1,992 కోట్లు పెట్టనున్నారట. జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు 15 వంతెనలతో సహా.. నదికి ఇరువైపులా 100 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు.
బాపట్ల డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి విజయలక్ష్మి సోమవారం పర్చూరులో పర్యటించారు. పెండింగ్‌లో ఉన్న పన్నులు, ఇతర బకాయిలను త్వరగా వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. స్థానిక అధికారులతో కలిసి వ్యాపార సముదాయాలను సందర్శించి పన్నులు వసూలు చేశారు. ప్రజలు సమయానికి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆమె సూచించారు.
PLD: జిల్లాలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. అందిన ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
NGKL: ఉప్పునుంతల మండల వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 9 వరకు పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజైన నేడు మామిళ్లపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. టీకా వేయించుకునే సమయంలో రైతులు తమ ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ వెంట తెచ్చుకోవాలన్నారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా తీస్తారని.. ఈ సీన్స్‌ను విజయ్‌పై షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
TG: కొత్త బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించాలని పలు ప్రభుత్వ శాఖలు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు అందజేశాయి. బడ్జెట్ తయారీకి ఎక్కువ సమయం లేనందున మొత్తం 24 శాఖలపై ఇవాళే భట్టి విక్రమార్క సమీక్షించనున్నారు. గ్యారంటీ హామీలు, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి కార్యక్రమాలకే రూ.లక్ష కోట్లకు పైగా కేటాయించాలని ప్రతిపాదనలు అందినట్లు సమాచారం.
KMR: విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా పాఠశాలలోనే రక్తం వచ్చేదాకా కొట్టుకున్న ఘటన నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్లో చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్, హెడ్ మాస్టర్ ఆనంద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర సోమవారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్ననగర్ నుంచి వస్తున్న ఓ కారు, బైక్‌ను ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలాగే మరో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
E.G: నిడదవోలులో జనసేన నేత తోపురాల కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు శిబిరాన్ని సోమవారం మంత్రి కందుల దుర్గేశ్ సందర్శించారు. మంగళవారంతో సభ్యత్వ నమోదు గడువు ముగుస్తుందని, నియోజకవర్గ వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని దుర్గేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడ్డాల నాని, గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
KMM: వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుందని, బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.