KMM: వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుందని, బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.