• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సహారా డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించాలి’

MNCL: సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ దారులకు వెంటనే డబ్బులు చెల్లించాలని బాధితుడు గజెల్లి వెంకటయ్య శుక్రవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఏజెంట్ల మాయ మాటలు నమ్మి సహారాలో డిపాజిట్ చేశారని తెలిపారు.

March 6, 2026 / 10:38 AM IST

‘జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి’

VZM: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. చింతలవలసలోని ఎం.వీ.జీ.ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘గృహాల జాబితా, గృహ వసతుల గణన’ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు.

March 6, 2026 / 10:38 AM IST

కోటాంచలో ప్రత్యేక పూజలు చేసిన.. మాజీ MLA దంపతులు

BHPL: రేగొండ మండలం కోడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో BRS జిల్లా నాయకులు ఉన్నారు.

March 6, 2026 / 10:34 AM IST

అధ్వాన్నంగా కంబకాయ జంక్షన్ రోడ్డు

SKLM: నరసన్నపేట మండలం కంబకాయ జంక్షన్ వద్ద రోడ్డు అద్వానంగా తయారయిందని స్థానికులు, వాహనదారులు అంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్డంతా గుంతల గుంతలుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. చాలా ఏళ్లుగా రోడ్లు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో అధ్వానంగా ఉందన్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

March 6, 2026 / 10:32 AM IST

జిల్లాలో పన్నులు వసూలు..!

NDL: దొర్నిపాడు మండలంలోని 8,400 ఇళ్లలో 7,200 ఇళ్ల నుంచి 85% పన్నులు వసూలు చేసినట్లు ఎంపీడీవో సావిత్రి గురువారం తెలిపారు. అమ్మిరెడ్డి నగరంలో 95% వసూలు పూర్తయినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.11 లక్షలు సేకరించగా, మార్చి చివరి నాటికి మొత్తం వసూలు పూర్తి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.

March 6, 2026 / 10:32 AM IST

మున్సిపల్ పాలకవర్గం పారిశుద్ధ్య కార్మికుల ర్యాలీ

SDPT: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రతిజ్ఞ చేయించారు. 10 వారాల పాటు 10 అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వార్డుల్లోని సమస్యలను కౌన్సిలర్లు, ప్రజల సహకారంతో పరిష్కరించనున్నట్లు చెప్పారు.

March 6, 2026 / 10:31 AM IST

మనిషి రూపంలో సాలీ పురుగు దర్శనం

NLR: ఏఎస్ పేట మండలంలోని అనుమసముద్రం గ్రామంలో ఓ వింతైన సాలీ పురుగు చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఇంటి ఆవరణలో వేలాడుతూ కనిపించిన ఈ సాలీ పురుగు చూసేందుకు వైవిధ్యమైన రూపంలో ఉండడంతో ఆశ్చర్యానికి గురిచేసింది. గోధుమ రంగులో ఉన్న పురుగును నిశితంగా పరిశీలిస్తే మనిషి రూపాన్ని పోలి వింతగా ఉండడం విశేషం.

March 6, 2026 / 10:30 AM IST

రాష్ట్ర కాపు కార్పోరేషన్ డైరెక్టర్‌గా స్వామి నాయుడు

కోనసీమ: రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్‌గా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన సుధా వెంకటస్వామి నాయుడు నియమితులయ్యారు. దీనికి సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీలో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నాయుడుకి అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.

March 6, 2026 / 10:30 AM IST

ప్రారంభమైన ప్రజాపాలన వారోత్సవాలు

VKB: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలో 34 వార్డుల్లో మొదటి రోజు పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. 28వ వార్డు గంగారంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పర్యటించి డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. 15 వార్డులో అమ్మవారి ఆలయం దగ్గర ప్రతిజ్ఞ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 6, 2026 / 10:29 AM IST

శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు

NRPT: దామరగిద్దలో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఓఎంఐఎఫ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. టైలరింగ్ గురువు గోపాలరావు మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలంటే టైలరింగ్ నేర్చుకోవడం ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, OMIF జిల్లా అధికారి రాజమ్మ పాల్గొన్నారు.

March 6, 2026 / 10:29 AM IST

‘నేటి నుంచి జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్’

BHPL: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నాలుగవ జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను నేటి నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా SP సంకీర్త్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 194 మంది పోలీస్ సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. పురుషులు, మహిళా సిబ్బందికి వేర్వేరుగా క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించనున్నారు.

March 6, 2026 / 10:28 AM IST

కళాశాలలో జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్

PDPL: గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి.నరేందర్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువత పాత్ర కీలకమన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

March 6, 2026 / 10:27 AM IST

TTD ఈవోగా ముద్దాడ బాధ్యతల స్వీకరణ

TPT: TTD ఈవోగా ముద్దాడ రవిచంద్ర ఇవాళ ఉదయం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వీరబ్రహ్మం, శరత్ తదితర టీటీడీ అధికారులు రవిచంద్రకు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

March 6, 2026 / 10:27 AM IST

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

MDK: తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో ఇవాళ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ బండకాడి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వీధులను శుభ్రం చేశారు. ఈనెల 15 వరకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవనీత, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

March 6, 2026 / 10:27 AM IST

కాలనీ అభివృద్ధికి సహకరిస్తా: ఛైర్మన్

HNK: వికాస్ నగర్‌లో పద్మావతి గోదా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి నూతన దేవాలయ ప్రతిష్ఠ, అభయాంజనేయస్వామి పునః ప్రతిష్ట వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. వికాస్ నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన చెప్పారు.

March 6, 2026 / 10:25 AM IST