బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ సమంత బంపర్ ఆఫర్ దక్కించుకున్నారని టాక్ నడుస్తోంది. రాజ్ అండ్ DK ద్వయం ఈ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో పాటు రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌లో చేస్తున్న సమంతకు ఈ సినిమాలో అవకాశం వచ్చినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాలి.
ELR: సేంద్రియ ఎరువుల వినియోగంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగంతో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, వంటనూనెలను రైతులు కలెక్టర్‌కు అందించారు. ప్రజలు సేంద్రియ వినియోగంతో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తుల వినియోగించాలన్నారు.
గుంటూరులో మంగళవారం ముస్లిం సోదరుల కోసం వైసీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వాయిదా పడింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త తేదీని త్వరలో తెలుపుతామని ప్రకటించారు.
NDL: పగిడ్యాల మండలంలోని బీరవోలు చెందిన లింగమ్మ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఆంజనేయనగర్‌లోని గాయిత్రి సంఘం సభ్యురాళ్లతో ఎపీఎం కళావతి సమావేశం నిర్వహించి గ్రూపు బుక్స్ పరిశీలించారు. అంతర్గత అప్పులు బ్యాంక్ లోన్సు అక్టోబర్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయనీ వాటిని క్లియర్ చేస్తే లోన్ ఇస్తామని ఏపీఎం కళావతి తెలిపారు.
కృష్ణా: చల్లపల్లి(M) నారాయణరావునగర్‌లో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడం, స్నానం చేయలేదని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై బాత్రూంలో చున్నీతో ఉరేసుకుంది. ఇది గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
PDPL: ధర్మారం మండలంలో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న SSC పరీక్ష నిర్వహణకు 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. మొత్తం 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. 51 మంది ఇన్విజిలేటర్లు, ఐదుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు డిపార్ట్మెంటల్ అధికారులు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్స్‌ను నియమించినట్లు తెలిపారు.
TG: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఫార్మసీ, లా, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనేక కళాశాలలకు ఫీజు పెంచకపోవడంతో పాటు కొన్ని కళాశాలలకు ఇప్పటివరకు ఉన్న ఫీజునే తగ్గించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈసారి ట్యూషన్ ఫీజు తప్ప.. ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదని GO జారీ చేసింది.
SKLM: మెళియాపుట్టి జంక్షన్‌లో ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో రాజపురంకి చెందిన వ్యక్తి బ్యాగ్‌లో 14 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. అతనిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయం, రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
VZM: మెంటాడ మండలంలో 11kv ఆండ్ర ఫీడర్ కొత్త బ్రేకర్‌ను సోమవారం ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు ఛార్జ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త బ్రేకర్ ఛార్ట్ చేయడంతో 120కి.మీ ఉన్నా లైన్ సుమారు సగానికి తగ్గిందని తెలిపారు. కొత్త బ్రేకర్ ఏర్పాటుతో ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రఘు పాల్గొన్...
W.G: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ- పంట నమోదు ప్రక్రియ పూర్తయ్యిందని ఏవో ఏ. జ్యోషిలా తెలిపారు. నరసాపురం మండలంలో 12 రైతు సేవా కేంద్రాల ద్వారా 9,302 ఎకరాల పంట నమోదు చేశామన్నారు. ఇందుకు సంబందించి 7,725 మంది రైతుల ఈ- కేవైసీ వేలిముద్రల సేకరణ పక్రియ ఈ నెల 14లోగా పూర్తవుతుందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఈ పంట నమోదు జాబితాలను పొందుపరిచామన్నారు.
KNR: కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై వెదిర గ్రామంలో సోమవారం రాత్రి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు టీవీఎస్ ఎక్సెల్ బండిని ఢీకొట్టింది. ప్రమాదంలో బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బస్సు బండిని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
BDK: సమస్యలను విచారించి బాధితులకు న్యాయం చేయాలని, జాప్యం లేకుండా వేగవంతమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
KRNL: ఆదోని నియోజకవర్గ సమస్యల పరిష్కారం తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో 15 కీలక అంశాలపై చర్చించి రాయలసీమ గురుకులాలు, బీసీ రిజర్వేషన్లు, దేవాలయ భూములు, మైనారిటీల సమస్యలు, మోటారు వాహన పన్ను వంటి విషయాలను సభ దృష్టికి తెచ్చారు. రాబోయే బడ్జెట్‌లో ఆదోని అభివృద్ధికి అధిక నిధులు సాధించేందుకు కృషి చేస్తానన్నారు.
SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నాగమణి అనే ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్నారు. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రేసు సతీశ్ అనే భక్తుడి 4 తులాల బంగారు బ్రాస్లెట్ పోయింది. ఆలయ పారిశుద్ధ్య ఉద్యోగి డప్పు నాగమణికి దొరకగా.. ఆలయ అధికారుల సమక్షంలో సతీష్‌కు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.
KMM: జిల్లా ఆసుపత్రి, సీహెచ్‌సీల్లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ టీకాలు అందుబాటులో ఉంటాయని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలోని 14–15 ఏళ్ల బాలికలందరికీ గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకాను పూర్తిస్థాయిలో అందించాలని అధికారులను సోమవారం ఆదేశించారు. మార్చి 8 నుంచి 14 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తామన్నారు.