• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చింతకానిలో ఘోర ప్రమాదం.. మైనర్ డ్రైవర్ మృతి

KMM: చింతకాని మండలం నాగులవంచ సమీపంలో మార్చి 1న జరిగిన రెండు ట్రాక్టర్ల ప్రమాదంలో ఓ యువ డ్రైవర్ దుర్మరణం చెందారు. మృతుడి వయస్సు ఆధార్ ప్రకారం 19 ఏళ్లని తల్లి పేర్కొన్నప్పటికీ, SSC మెమో ఆధారంగా అతను 16 ఏళ్ల మైనర్ అని పోలీసుల విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా మైనర్‌కు వాహనాన్ని అప్పగించినందుకు గానూ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 4, 2026 / 06:45 PM IST

మంత్రిని కలిసిన మున్సిపల్ ఛైర్మన్

NRML: పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ కావ్య, వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తిలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లికి విన్నవించారు. బుధవారం మంత్రి కార్యాలయంలో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధితో పాటు శ్యామఘడ్, బత్తిస్ ఘడ్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

March 4, 2026 / 06:45 PM IST

ముమ్మరంగా వాహన తనిఖీలు

AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం చీడిగుమ్మల వద్ద బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అప్పారావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

March 4, 2026 / 06:44 PM IST

బాల్య వివాహాలు చట్టరీత్య నేరం ఎస్సై సూర్య భగవాన్

ELR: అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఉంగుటూరు హైస్కూల్‌లో ICDS ఆధ్వర్యంలో బుధవారం కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై అవగాహన కల్పించారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అన్నారు. అంగన్వాడీ సూపర్‌వైజర్ శారద, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవీంద్ర, అంగన్వాడి కార్యకర్తలు ఉన్నారు.

March 4, 2026 / 06:44 PM IST

ఎండలు మండుతున్నాయ్!

AP: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండగా.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి.

March 4, 2026 / 06:42 PM IST

SA vs NZ: ప్లేయింగ్-11

NZ: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్(c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్SA: మార్‌క్రమ్(c), డికాక్(w), రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి

March 4, 2026 / 06:42 PM IST

జిల్లాలో ముగిసిన LLB పరీక్షలు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో LLB 5వ, పీజీ మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 8 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,933 మంది విద్యార్థులకు 1,825 మంది హాజరు కాగా 108 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

March 4, 2026 / 06:40 PM IST

వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

KDP: బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని బుధవారం దర్శించుకున్నారు. నూతన పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వీర ధర్మజ వెంకటాద్రి స్వామిని, ఆయన సోదరుడు దత్తాత్రేయ స్వామిని ఘనంగా సన్మానించారు. పీఠాధిపతి హయాంలో మఠం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.

March 4, 2026 / 06:40 PM IST

ప్రమాదబీమా పథకం కింద 231 క్లెయిమ్స్ పరిష్కారం: మంత్రి

MLG: ప్రమాదబీమా పథకం కింద ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ప్రమాద మరణం సంభవించిన పక్షంలో రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పథకం అమల్లోకి వచ్చిన 2024 నుంచి ఇప్పటివరకు 231 క్లెయిమ్స్ పరిష్కరించి, మొత్తం రూ.23.1 కోట్లు లబ్దిదారుల కుటుంబాలకు అందించినట్టు మంత్రి చెప్పారు. ఆర్థికంగా కుంగిపోకుండా ఈ పథకం పెద్ద ఊరటనిస్తుందన్నారు.

March 4, 2026 / 06:40 PM IST

మంత్రి సీతక్కను కలిసిన గద్వాల ఎమ్మెల్యే

GDWL: తన కుమారుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బుధవారం మంత్రి సీతక్కను, ఎంపీ మల్లు రవిని ఆహ్వానించారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. మార్చి 14న గద్వాలలో జరిగే ఈ వివాహ వేడుకకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

March 4, 2026 / 06:38 PM IST

ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌కు 98% హాజరు

HNK: నేడు జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కు 98% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 17879, ఒకేషనల్ 1017కి 18475 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 401, ఒకేషనల్ విద్యార్థులు 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 98గా నమోదు అయిందని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

March 4, 2026 / 06:37 PM IST

రేషన్ కార్డుదారులకు ఒకేసారి 3 నెలల బియ్యం

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

March 4, 2026 / 06:36 PM IST

తొలి సెమీస్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో కెప్టెన్ శాంట్నర్ ఛేజింగ్‌కే మొగ్గుచూపాడు. ఇప్పటివరకు T20 WCల్లో కివీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లోనూ సఫారీలే గెలిచారు. అయితే, ICC నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం కివీస్‌దే పైచేయిగా ఉంది.

March 4, 2026 / 06:35 PM IST

మార్చి 8న అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం!

అసెంబ్లీ ఆవరణలో మార్చి 8న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విగ్రహ ఏర్పాటుకు కాంక్రీటు పనులను మొదలు పెట్టారు. బేస్ మెంట్ పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వరుసలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 

March 4, 2026 / 06:35 PM IST

భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

BDK: భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. బుధవారం పంచాయతీ పరిధిలోని 4, 6, 11వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

March 4, 2026 / 06:35 PM IST