• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అత్యవసరాల్లో 100ను సంప్రదించండి’

ADB: అత్యవసర సమయాల్లో డయల్ 100ను సంప్రదించాలని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్ అన్నారు. బుధవారం నార్నూర్ మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రం వద్ద ‘డయల్ 100’ అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పుండలీక్, సుధాకర్, నాగోరావ్, తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 01:30 PM IST

మరమ్మత్తు పనులు చేయిస్తున్న చైర్మన్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వల్లబ్ నగర్ ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో నీరు రోడ్డుపైకి రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వాహనదారులు బుధవారం ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్పందించి మిషన్ భగీరథ అధికారులతో మరమత్తు పనులు నిర్వహించినట్టు తెలిపారు. సమస్యపై స్పందించిన చైర్మన్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

February 25, 2026 / 01:30 PM IST

దోషులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం

BDK: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని సీపీఎం పార్టీ పిలుపులో భాగంగా ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు.

February 25, 2026 / 01:30 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా

ELR: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై జంగారెడ్డిగూడెం న్యాయస్థానం కఠిన నిర్ణయం తీసుకుంది. వేలేరుపాడు మండలానికి చెందిన ఒక యువకుడు మద్యం సేవించి వాహనం నడుపుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అతనికి రూ. 10వేలు జరిమానా విధిస్తూ బుధవారం ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ 2nd క్లాస్ మెజిస్ట్రేట్ నక్క వెంకటేశ్వర్లు తీర్పు ఇచ్చారు.

February 25, 2026 / 01:30 PM IST

గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్ట రాగమయి

KMM: పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామంలో బుధవారం శ్రీ షిరిడి సాయిబాబా గుడి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమాయి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె వెంట సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు పాల్గొన్నారు.

February 25, 2026 / 01:29 PM IST

VIDEO: వరంగల్ మార్కెట్లో సరుకుల ధరల వివరాలు..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,515 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21, 500 ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.37 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.18,400, ఎల్లో మిర్చి రూ. 24వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

February 25, 2026 / 01:28 PM IST

ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఏఈవో

SRPT: నడిగూడెం క్లస్టర్ పరిధిలోని రైతులు ఈ నెల 28లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఏఈవో పిచ్చయ్య కోరారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి ఈ నమోదు అవసరమని, రైతులు వెంటనే మీసేవ లేదా రైతు వేదికలో సంప్రదించాలని సూచించారు. నమోదు చేసుకోని పక్షంలో ప్రభుత్వ సాయం పొందే అవకాశం కోల్పోతారని ఆయన హెచ్చరించారు.

February 25, 2026 / 01:27 PM IST

వైద్య విద్యార్థులకు అభినందనలు: గవర్నర్

AP: ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు. గుంటూరు ఈదులపాలెంలోని కాటూరి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డేకు గవర్నర్ హాజరై ప్రసంగించారు. కాటూరి మెడికల్ కళాశాలను అద్భుతంగా నిర్మించారని, సూపర్ స్పెషాలిటీ మాదిరిగా మంచి వైద్యం అందిస్తున్నారని ప్రశంసించారు. మంచి ప్రకృతిలో కాలేజీని ఏర్పాటు చేశారని తెలిపారు.

February 25, 2026 / 01:27 PM IST

చెవి నొప్పికి ఆపరేషన్.. యువకుడి మృతి

NZB: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల భీంగల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ మృతి చెందాడు. చెవి నొప్పితో వచ్చిన అజయ్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించింది. మత్తు మందు వికటించడం వల్లే అజయ్ చనిపోయాడని, ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట శవంతో బుధవారం ధర్నాకు దిగారు.

February 25, 2026 / 01:26 PM IST

పరీక్షకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

WNP: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నట్లు చీఫ్ సూపర్డెంట్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. తొలి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 385 మంది విద్యార్థులకు ఘనం 370 మంది హాజరైనట్లు తెలిపారు. మిగతా 15 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయి అన్నారు.

February 25, 2026 / 01:26 PM IST

సజావుగా జరిగిన ఇంగ్లీష్ పరీక్షలు

PPM: ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు కొత్తవలస వాగ్దేవి కళాశాలలో బుధవారం సజావుగా జరిగింది. పరీక్షలకు 379 విద్యార్థులు కేటాయించగా, 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలకు ఎటువంటి చూసిరాతలకు పాల్పడకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు.బయటవారు లోపలికి వెళ్లకుండా పోలీసు గస్తీని ముమ్మరం చేశారు.

February 25, 2026 / 01:26 PM IST

పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

KMR: కామారెడ్డి జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పర్య వేక్షణ, ప్రశ్నాపత్రాల భద్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

February 25, 2026 / 01:25 PM IST

జిల్లాలో 1772 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు

BHPL: జిల్లాలో మొదటి రోజు ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 1,829 మంది విద్యార్థులకు గాను 1,772 మంది పరీక్షలు రాసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకన్న తెలిపారు. 96.88% హాజరు శాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు

February 25, 2026 / 01:25 PM IST

రెండు రోడ్లకు రూ. 98 లక్షలు మంజూరు

కృష్ణా: చల్లపల్లి మండలంలో రెండు ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులతో నడకుదురు శివారు రాముడుపాలెం ప్రధాన రహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు, నాదెళ్లవారిపాలెం రోడ్డు నిర్మాణానికి రూ. 49 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 25, 2026 / 01:25 PM IST

పాల నాణ్యత, పశువుల ఆరోగ్యంపై సమీక్ష

అన్నమయ్య: రామసముద్రం మండలం తిరుమలరెడ్డిలోని అమూల్ డైరీని బుధవారం ఉదయం పశువైద్యాధికారి డాక్టర్ పావని సందర్శించారు. పాల సేకరణ విధానం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, పాడి పశువుల ఆరోగ్యానికి సకాలంలో టీకాలు, పోషకాహారం అందించాలని రైతులకు సూచించారు. పాల ఉత్పత్తి పెంచి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.

February 25, 2026 / 01:25 PM IST