• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జడ్చర్ల నియోజకవర్గంలో రెండు ఆసుపత్రుల స్థాయి పెంపు

MBNR: జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రెండు ఆసుపత్రుల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 పడకల స్థాయిలో ఉన్న బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలకు పెంచుతూ, అలాగే 23 పడకల స్థాయిలో ఉన్న బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 11, 2026 / 06:31 AM IST

సీఎం ప్రజావాణిలో 345 దరఖాస్తులు

HYD: బేగంపేట్ ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 345 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 127, రెవెన్యూ శాఖకు 50, ఇందిరమ్మ ఇళ్ల కోసం 90, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు రాగా ఇతర శాఖలకు సంబంధించి 77 దరఖాస్తులు అందాయని సీఎం ప్రజావాణి ఇంఛార్జ్ జి.చిన్నారెడ్డి వెల్లడించారు.

March 11, 2026 / 06:31 AM IST

డిజిటల్ క్రాప్‌లో ప్రతి పంటను నమోదు చేసుకోవాలి: AO

VZM: రైతులు ప్రతి పంటను డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో నమోదు చేసుకోవాలని రామభద్రాపురం AO ఏవో శివ సూచించారు. మంగళవారం స్దానిక తారాపురంలో రబి సీజన్‌ పంట నమోదు చేసుకున్న రైతుల జాబితాలను RSKలో సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు తాము సాగు చేసిన పంట వివరాలను ఇక్కడ సరిచూసుకోవాలని, ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు.

March 11, 2026 / 06:31 AM IST

పెద్దపులి అడుగులు.. జిల్లాలో భయాందోళనలు..!

సిరిసిల్ల జిల్లా వైపు పెద్దపులి అడుగులు వేస్తున్నట్లు అంచనాలు వెలువడడంతో అటవీ గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం జిల్లాను వదిలి నిజామాబాద్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్న పులి, దిశ మార్చి సిరిసిల్ల జిల్లా వైపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రైతులు, పాడి పశువుల యజమానులు భయాందోళనకు గురవుతున్నారు.

March 11, 2026 / 06:30 AM IST

ఇప్తార్ విందులో పాల్గొన్న పల్లె రఘునాథ్ రెడ్డి

సత్యసాయి: నల్లమాడలో ముస్లిం మైనార్టీలు మంగళవారం రాత్రి నిర్వహించిన ఇప్తార్ విందుకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలు చేస్తూ ప్రార్థనల ద్వారా అల్లా ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

March 11, 2026 / 06:30 AM IST

నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు పలు రైళ్ల రద్దు 

TG: నిర్వహణ పనుల కారణంగా ఈనెల 11 నుంచి 31 వరకు కాచిగూడ-కర్నూలు సిటీ, 12 నుంచి ఏప్రిల్ 1 వరకు కర్నూలు సిటీ-కాచిగూడ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ రైల్వే హైదరాబాద్ DRM సంతోష్ కుమార్ తెలిపారు. 11 నుంచి 31 వరకు కాచిగూడ-రాయచూర్-కాచిగూడ వయా దేవరకద్ర, కృష్ణ(67787, 67788), కాచిగూడ-రాయచూర్-కాచిగూడ వయా గద్వాల్(17693, 17694), గద్వాల్-రాయచూర్-గద్వాల్ రైళ్లను రద్దు చేశామన్నారు.

March 11, 2026 / 06:29 AM IST

నేడు, రేపు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ, రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. ఈ పర్యటనలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.

March 11, 2026 / 06:28 AM IST

ఓటరు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

GDWL: ప్రజా సమస్యలపై వచ్చే ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫార్మ్ 6, 7, 8 దరఖాస్తులను పూర్తి చేస్తూ కనీసం 85% పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు.

March 11, 2026 / 06:28 AM IST

సైబరాబాద్‌లో 1,016 మొబైల్ ఫోన్స్ రికవరీ

RR: సైబరాబాద్ సీపీ రమేశ్ 1,016 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. IMEI ద్వారా ఫోన్‌ల గుర్తింపు ఇప్పుడు CEIR పోర్టల్‌తో సులభమైందని, మునుపటిలా మాన్యువల్ ప్రక్రియకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. పోయిన ఫోన్‌ను వేరే వ్యక్తి వాడిన వెంటనే అలర్ట్ వస్తుందని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లపై ప్రత్యేక ఆపరేషన్‌లో 100 మందికిపైగా అరెస్ట్ చేశామన్నారు.

March 11, 2026 / 06:27 AM IST

ప్రగడవరంలో పోలీసులు పల్లెనిద్ర

ELR: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో దొంగతనాలు నిరోధించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై సతీష్ సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాలు అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.

March 11, 2026 / 06:26 AM IST

మంత్రి పొంగులేటిని కలిసిన DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్

ADB: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ హైదరాబాదులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ సంబంధిత సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు నరేష్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

March 11, 2026 / 06:26 AM IST

GGHలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు

గుంటూరు GGHప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాల కేంద్రాలుగా అనుమతి పొందిన దుకాణాల్లో పరుపులు, దిండ్లు వంటి ఇతర వస్తువులను విక్రయిస్తూ రోగుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. అనుమతి లేని వస్తువులను విక్రయిస్తున్న ఇలాంటి అనధికార దుకాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

March 11, 2026 / 06:25 AM IST

స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తూ వ్యక్తి మృతి

KDP: ఎర్రగుంట్ల ICL సిమెంట్ పరిశ్రమ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జరిగింది. మృతుడు YGL శాంతినగర్‌కు చెందిన ప్రసాద్(22)గా గుర్తించారు. ద్విచక్ర వాహనంలో ముద్దునూరులోని మిత్రుని వద్దకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తులసి నాగమురళి వెల్లడించారు.

March 11, 2026 / 06:25 AM IST

విద్యార్థుల గొడవ.. అధ్యాపకులకు గాయాలు

HNK: కాజీపేట మండలం భట్టుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు అధ్యాపకులు గాయపడ్డారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం సాయంత్రం మళ్లీ గొడవగా మారగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధ్యాపకుల్లో ఒకరికి తలకు గాయం, మరొకరికి చేయి విరిగింది. ఈ ఘటనపై మడికొండ ఎస్సై రాజ్‌కుమార్ విచారణ చేపట్టారు.

March 11, 2026 / 06:24 AM IST

నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్

NGKL: నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని దేవుని పడకల్లుకు చెందిన రాజమోని ప్రవీణ్‌‌కు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.38,500 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంగళవారం లబ్ధిదారునికి అందజేశారు. నిరుపేదలు సీఎంఆర్ఎఫ్‌‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 11, 2026 / 06:24 AM IST