• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గోల్డ్ లోన్ మార్కెట్‌లో మారిన ట్రెండ్!

భారత గోల్డ్ లోన్ మార్కెట్లో ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ధనవంతులు కూడా వ్యాపార పెట్టుబడుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ.5 లక్షలకు పైగా రుణాలు మూడింట ఒక వంతు పెరిగాయి. ఇది బంగారం తాకట్టుపై ఉన్న పాత సామాజిక ఆంక్షలను తొలగిస్తూ, రుణాలు తీసుకోవడం ఒక కొత్త వ్యాపార వ్యూహంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.

March 3, 2026 / 01:40 PM IST

అంగన్వాడీలు అక్రమ అరెస్టులు అన్యాయం

VZM: తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం విజయవాడలో శాంతి యుత దీక్షలు చేస్తున్నా అంగన్వాడి కార్యకర్తలను అరెస్టులు చెయ్యడం అన్యాయం అని సీఐటీయూ పి.శంకరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.

March 3, 2026 / 01:39 PM IST

ఎక్కడా లేని విధంగా తండాలో హోలీ సంబరాలు

KMM: కూసుమంచి మండలం లోక్యతండా గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువకులు, బంజారాలు ఈ కోలాటంలో పాల్గొంటారు. రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా 3 రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం కోలాటం కార్యక్రమం ప్రారంభం కానుంది. కుల పెద్దలు డప్పు కొట్టి హోలీని ప్రారంభిస్తారు.

March 3, 2026 / 01:38 PM IST

‘మహిళా ఉపాధి రక్షణకై ఉద్యమించాలి’

SKLM: శ్రామిక మహిళల ఉపాధి పై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఉద్యమించాలని పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ అన్నారు. మంగళవారం పలాస మండలం మామిడిపల్లిలోని మార్చి 8న జరిగే సభలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మార్చి 1 నుంచి 8 వరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.

March 3, 2026 / 01:38 PM IST

OUలో రామచందర్ రావు హోలీ సందడి

TG: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు యువతతో కలిసి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులతో రంగులు పూసుకుని సందడి చేసిన ఆయన.. ఇలాంటి పండుగలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకలు విద్యార్థుల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 01:38 PM IST

‘స్మశాన వాటికను ఆక్రమనపై చర్యలు తీసుకోవాలి’

E.G: గోపాలపురం మండలం సాగిపాడు గ్రామ ప్రజలకు సంబంధించిన స్మశాన వాటికను తణుకు వేములయ్య అనే వ్యక్తి ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గోపాలపురం జనసేన ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు తెలిపారు. దీనిపై విచారణ జరిపి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని దేవరపల్లి సీఐ, ఎస్సై, తహసీల్దార్‌కు ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 3, 2026 / 01:37 PM IST

గద్వాల మున్సిపాలిటీ కౌన్సిలర్ల సన్మానం

గద్వాల మున్సిపాలిటీలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మాదిగ కౌన్సిలర్లు శంకర్, చిన్న రాములు, లలితమ్మ, చిన్న చంటేన్నలను గంజిపేట తిమ్మన్న ఘనంగా సన్మానించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.

March 3, 2026 / 01:37 PM IST

రేపు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటన

NLR: గుడ్లూరు మండలంలో బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన కార్యక్రమం ఉన్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. రామాయపట్నం పోర్ట్ నిర్వాసితులైన కర్లపాలెం మత్స్యకారులకు R&R కాలనీలో నివేశన పట్టాలను మంత్రి పంపిణీ చేస్తారంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు కూటమి నేతలు పాల్గొంటారని పేర్కొంది.

March 3, 2026 / 01:37 PM IST

కాలేజీలో అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

TG: హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే కాలేజీలో చదువుతున్న ఆశిష్ తనయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అతను తనని 2024లో కాలేజీలోని ఓ గదిలో అత్యాచారం చేశాడని.. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది.

March 3, 2026 / 01:36 PM IST

ఈనెల 5 నుంచి కిరండూల్ రైలు ర‌ద్దు

VSP: వాల్తేర్ డివిజన్‌లో శిలిమ్లిగూడ–కరకవలస మధ్య డబుల్ లైన్ పనుల కారణంగా నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. దీంతో విశాఖపట్నం–కిరండూల్ మధ్య నడిచే 58501, 58502 ప్యాసింజర్ రైళ్లు మార్చి 5 నుంచి 14/15 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

March 3, 2026 / 01:36 PM IST

చింతపల్లిలో దుకాణాల తరలింపుపై ఎంపీడీవో హెచ్చరిక

ASR: ప్రధాన రహదారుల వెంట నిర్వహిస్తున్న చేపలు, మాంసం దుకాణాలను ప్రభుత్వం కేటాయించిన సంత మార్కెట్ ప్రాంగణానికి తప్పనిసరిగా తరలించాలని చింతపల్లి ఎంపీడీవో సీతామహాలక్ష్మి హెచ్చరించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, లాటరీ విధానంలో స్థలాలు కేటాయించినప్పటికీ కొందరు వ్యాపారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆమె తెలిపారు.

March 3, 2026 / 01:35 PM IST

కొడవటూరు శ్రీసిద్దేశ్వరాలయం మూసివేత..!

JN: కొడవటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయం గ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ అధికారులు ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో దేవాలయ ద్వారాలను మూసివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

March 3, 2026 / 01:35 PM IST

మంత్రి సీతక్కను కలిసిన సినీనటి మంచు లక్ష్మి

MLG: టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27 నిర్వహిస్తున్న కార్యక్రమానికి రావాలని ఆమె మంత్రిని ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య కోసం తమ సంస్థ చేయూతనిస్తున్నదన్నారు.

March 3, 2026 / 01:35 PM IST

ఇసుక లారీ బీభత్సం వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: చర్ల మండలం గుంపెనగూడెంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. చర్ల నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ ఢీకొనడంతో చిట్టిబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిత్యం ఇసుక లారీల రాకపోకలతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 01:34 PM IST

మిట్ట కండ్రిగలో చెరుకు తోట దగ్ధం

CTR: శ్రీరంగరాజపురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ మిట్టకండ్రిగ హరిజనవాడలో రైతు నవీన్‌కు చెందిన ఐదు ఎకరాల చెరుకు తోట అగ్నికి ఆహుతైంది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన తెల్లబెల్లం కూడా కాలిపోయింది. దీంతో దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 01:34 PM IST