BPT: కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన మనోజ్ కుమార్‌ను మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు వసూలు చేశారు. నియామక పత్రం, ఐడీ కార్డు ఇచ్చి క్వారీలో పని పెట్టి నెలరోజులకు రూ.18 వేలు ఇచ్చారు. తర్వాత క్వారీ మూసేయడంతో మోసం బయటపడింది. చెక్ బౌన్స్ కావడంతో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
NLR: కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీ కొని యువకుడు మృతి చెందాడు. గూడూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకుడు చిన్నపడుగుపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా స్థానికుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు.
అన్నమయ్య: రాజంపేట పట్టణంలో ఆవులు, లేగదూడలు వింత చర్మ వ్యాధితో బాధపడుతున్నాయి. వాటి శరీరాలపై దద్దుర్లు ఏర్పడి, చర్మం ఊడిపోయి పుండ్లు అవుతున్నాయి. దీంతో పశువులు మేత మేయలేక నీరసించిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని, లేదంటే మూగజీవాలు నరకయాతన అనుభవిస్తాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు.
NLR: మిడుతూరు మండలం తిమ్మాపురం వద్ద స్కూటీపై 5 లీటర్ల నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్ తెలిపారు. ఈ ఘటనలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తి స్కూటీని వదిలి పరారైనట్లు చెప్పారు. అదేవిధంగా లక్ష్మాపురంలో కాలియ అనే వ్యక్తి నుంచి 5 లీటర్ల నాటుసారా స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
SKLM: విజయవాడలోని శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం ఆట విడుపు’ పోటీల్లో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ, మైదానంలో సందడి చేశారు. స్టేడియం మొత్తం క్రీడా స్ఫూర్తితో కళకళలాడింది. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం అని మంత్రి తెలిపారు.
KRNL: ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ పోస్టులకు అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ S.శివారెడ్డి తెలిపారు. PGలో 55% మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి కళాశాలలో డెమో ఇవ్వాలన్నారు.
TG: వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పులేదనే మనస్తాపంతో అప్పాయిపల్లి కీర్యానాయక్ తండాకు చెందిన క్యాబ్ డ్రైవర్ గణేష్ నాయక్(21) సూసైడ్ చేసుకున్నాడు. ఇది తెలిసి పాన్‌గల్ మండలం అన్నారం తండాకు చెందిన ఆ యువతి వసంత(18) కూడా భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు గణేష్ మేనత్త కొడుకే కాగా వీరి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
W.G: యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహిచాలన్నారు.
ADB: మావల మండల కేంద్రంలోని N-Labs ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సంస్థను కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం పనితీరు, సిబ్బంది వివరాలను ప్రతినిధులు కలెక్టర్ రాజర్షి షాకు వివరించారు. యువత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు రంగాలలో సైతం రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ప్రణవి, అంకిత్, దినేష్ ఉన్నారు.
PLD: కారంపూడి ఏపీ మోడల్ స్కూల్‌లో వచ్చే ఏడాది 6వ తరగతిలో చేరడానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ సుహాసిని బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫీజుగా ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ కాపీని పాఠశాలలో అందజేయాలని సూచించారు.
జగిత్యాల జిల్లాలోని మీసేవ నిర్వహకులకు కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూభారతి దరఖాస్తులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. సమస్యలకు తగిన దరఖాస్తులు నింపి రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడలన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
NDL: భూసమస్యలకు సంబంధించిన పెండింగ్ మ్యుటేషన్లను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ జి.రాజకుమారి రెవెన్యూ అధికారులను బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తహాశీల్దార్లతో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ ఆదేశాల అమలు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, ప్రజాసేవల మెరుగుదలపై స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు.
BPT: నిజాంపట్నం మండలం పల్లపట్లలో పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు సీడీపీఓ అనసూయ బుధవారం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో ఒక కార్యకర్త, నలుగురు ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 5వ తేదీ లోపు పల్లపట్ల ఐసీడీఎస్ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు.
కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పాల్గొన్నారు. వారితో కలిసి ఆయన ఉపవాస దీక్ష విరమించారు. రంజాన్ క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, అందరూ శాంతియుతంగా మెలగాలని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీలు యాదగిరిస్వామి, విజయకుమార్, తదితరులు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.
KDP: జిల్లాలో ముగ్గురు అధికారుల బదిలీలు జరిగాయి. కడప మున్సిపల్ కమిషనర్ నిమనపల్లి మనోజ్ రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలని సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.