• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డిప్యూటీ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేత

హన్మకొండ జిల్లాలో సాంఘిక సంక్షేమ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. SC హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారికి అన్యాయం చేస్తున్న ASWO చర్యలు తీసుకోవాలని కోరారు.

March 2, 2026 / 07:33 PM IST

చిలకలూరిపేటలో పడకేసిన పారిశుధ్యం

PLD: పట్టణంలోని పురుషోత్తపట్నం ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూతూమంత్రంగా ప్లాస్టిక్ వ్యర్థాల తొలగించ లేదన్నారు. పురుషోత్తపట్నం ఆర్చి వద్ద ఉన్న కల్వర్టులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి నీరు నిల నిల్వ ఉందన్నారు.

March 2, 2026 / 07:32 PM IST

ఖమ్మంలో కూల్చివేతలు.. స్పందించిన కేరళ సీఎం

TG: ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఇళ్ల కూల్చివేతలపై కేరళ CM పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు “బుల్డోజర్ రాజ్”ను తలపిస్తోందని ఆరోపించారు. వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమంలో భాగంగా భూమి లేని పేదలకు కేటాయించిన ‘వినోబా నగర్’లోని ఇళ్లను కూల్చివేయడం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

March 2, 2026 / 07:30 PM IST

దుగ్గిరాల వద్ద వింత ప్రమాదం.. చెట్టు కొమ్మల్లోకి బైక్

GNTR: దుగ్గిరాల లాకు వద్ద సోమవారం బైక్ ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురవ్వగా, ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. విచిత్రమేమిటంటే, ప్రమాద తీవ్రతకు బైక్ పది అడుగుల ఎత్తులో చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. గాయపడిన వారిని చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 07:30 PM IST

కుమ్మెర ఘటనపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

NGKL: కుమ్మెర ఘటనలో చిన్నారి మృతికి బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నిజనిర్ధారణ కమిటీ పేరుతో కాంగ్రెస్ డ్రామా చేస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మాజీ MLA మర్రి జనార్దన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

March 2, 2026 / 07:30 PM IST

ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచిన ఎమ్మెల్యే

NLR: బుచ్చి పట్టణంలోని కరిముల్లా తోపుడు మిషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి లక్ష రూపాయలు నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు రామానాయుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వేమిరెడ్డి దంపతులు వారికి 50 వేల రూపాయలను సహాయాన్ని అందజేశారు. వేమిరెడ్డి దంపతులకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

March 2, 2026 / 07:30 PM IST

బస్సులు పునరుద్ధరించాలని డిఎంకు వినతి

SRD: ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు పునరుద్ధరించాలని సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఖేడ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యంను సర్పంచ్ మల్లగారి విమలవిఠల్ రెడ్డి, గ్రామస్తులు కలుసుకొని వినతి పత్రం ఇచ్చారు. గతంలో నడిచిన కడపల్- పిట్లం, ఖేడ్ నుంచి కడపల్ హైదరాబాద్ బస్సులను తిరిగి నడపాలని డీఎంకు విజ్ఞప్తి చేశారు.

March 2, 2026 / 07:29 PM IST

నాగిరెడ్డిపేటలో అధికారులకు సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

KMR: నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన జగ్గీ సౌమ్యకు సోమవారం గ్రామ సర్పంచ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సహకారంతో నిరుపేదలకు వైద్యసహాయం కొరకు సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేశారు.

March 2, 2026 / 07:27 PM IST

బాలానగర్‌లో నూతన సర్పంచుల సంఘం ఎన్నిక

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఇవాళ 25 మంది సర్పంచులు మండల సర్పంచుల సంఘం అధ్యక్షకుడిని ఎన్నుకున్నారు. నందారం సర్పంచ్ హరి సింగ్ మండల అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.గాయత్రి లక్ష్మయ్య, రాజేందర్, గౌరవ అధ్యక్షులుగా రాంజీ, ప్రధాన కార్యదర్శులుగా వెంకట్రాములు గౌడ్, సంయుక్త కార్యదర్శిగా రాము, సమీనా, లింబ్యా ఎన్నికయ్యారు.

March 2, 2026 / 07:27 PM IST

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: SI

KDP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం ఎస్సై పోకల హారిక హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. మండలంలో కోడి పందేలు, జూదం,పేకాట నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. రౌడీ షీటర్లు పల్లెల్లో ప్రశాంతత వాతావరణం ఉండేటట్లు కలిసిమెలిసి ఉండాలన్నారు. అనుమానిత పల్లె ప్రాంతాలపై కొంతమందిపై నిఘా వేసి ఉంచామని తెలిపారు.

March 2, 2026 / 07:27 PM IST

ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

SRCL: చందుర్తి మండలంలోని బండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం అత్యంత కన్నుల పండుగ సాగింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలయంలో నిత్యారాధన, రథహోమం, పూర్ణాహుతి, రథ బలిహరణ, పూజలను అర్చకులు శ్రీకాంతచార్యుల వేద పండితులు మంత్రోచ్ఛారణతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రథంపై ఊరేగించారు.

March 2, 2026 / 07:27 PM IST

అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్

MDK: జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:24 PM IST

దూదిళ్ళ శ్రీపాదరావుకు పోలీస్ శాఖ నివాళి

WNP: ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావం ప్రతి ప్రజాప్రతినిధికి ప్రేరణ నిచ్చే దీప స్తంభం దూదిళ్ళ శ్రీపాదరావు అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో మహానేత శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీపాద రావు శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

March 2, 2026 / 07:23 PM IST

CC రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించిన.. కాంగ్రెస్ నేతలు

MLG: రాష్ట్ర మంత్రి సీతక్క, DCC అధ్యక్షుడు అశోక్ ఆదేశాల మేరకు వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలో నూతన CC రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, TPCC ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ రవి తదితరులు ఉన్నారు.

March 2, 2026 / 07:22 PM IST

‘ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం’

VKB: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, అభివృద్ధి సంక్షేమం గడపగడపకు అందేలా కృషి చేస్తామని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ , వైస్ ఛైర్మన్ రజాక్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ ఛాంబర్‌లో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

March 2, 2026 / 07:21 PM IST