• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మద్నూర్‌లో ఆధార్ కేంద్రం ప్రారంభం

KMR: మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కొత్తగా ఆధార్ కేంద్రాన్ని తహసీల్దార్ ముజీబ్ ప్రారంభించారు. మండలంలో కొత్త ఆధార్ కార్డులతో పాటు ఆధార్ కార్డులు ఉన్నవారు అందులో మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

March 2, 2026 / 07:20 PM IST

‘కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం’

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్ వాడీ, మహిళా సమాఖ్య భవన స్లాబ్ నిర్మాణానికి సర్పంచ్ కొమ్ము కృష్ణ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్లి వారిని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

March 2, 2026 / 07:20 PM IST

భూముల కేటాయింపులపై విమర్శలు

VSP: పెట్టుబడుల పేరిట ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆరోపించారు. తర్లువాడలో విలువైన భూమిని 99 పైసలకే సంస్థకు ఇచ్చిన నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములను బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, నగర అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.

March 2, 2026 / 07:20 PM IST

రేపు ‘వాసవి శాంతి ధామం’ మూసివేత

W.G: ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి శాంతి ధామాన్ని మూసివేస్తున్నట్లు అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని, బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి పునర్దర్శనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

March 2, 2026 / 07:20 PM IST

ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ

ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు, ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్‌లు సోమవారం సాయంత్రం పరామర్శించారు. రూ.50 లక్షలు నష్టపరిహారం 5 ఎకరాలు భూమి ఇల్లు అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

March 2, 2026 / 07:20 PM IST

‘ఆహార నాణ్యత మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలి’

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆహార నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో విద్యాసంస్థలలో నాణ్యమైన భోజన సరఫరాపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద న్యాయనిర్ణేత అధికారిగా చట్టాన్ని అమలు చేయాలన్నారు.

March 2, 2026 / 07:17 PM IST

హ్యాకథాన్ విజేతల‌కు కలెక్టర్ అభినందన

VZM: హ్యాక‌థాన్ పోటీల్లో గెలుపొందిన ఇద్ద‌రు సాంఘిక సంక్షేమ వ‌స‌తి గృహ విద్యార్ధినుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి కలెక్టరేట్‌లో సోమ‌వారం అభినందించారు. విద్యార్థులు యాల యోగేశ్వరి, దాసరి తేజశ్వని హ్యాక‌థాన్ పోటీల్లో సత్తా చాటి నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని కలెక్టర్ ప్రోత్సహి...

March 2, 2026 / 07:17 PM IST

నల్లగొండ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఒప్పంద అధ్యాపకురాలు మిస్కిన్ తరన్నం డాక్టరేట్ సాధించారు. శ్రీ జగదీష్ ప్రసాద్ ఝబర్మల్ త్రివేది యూనివర్సిటీ ఆమెకు పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. దక్షిణ భారత ప్రధాన కార్ప్ చేపల జన్యు వనరులపై చేసిన పరిశోధనకు ఈ గౌరవం లభించింది. ఈ మేరకు ఆమెను కళాశాల అధ్యాపకులు అభినందించారు.

March 2, 2026 / 07:16 PM IST

గవర్నర్‌ను కలిసిన ప్రొఫెసర్

VSP: మాజీ ఎంపీ, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సోమవారం అమరావతిలోని రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు.

March 2, 2026 / 07:14 PM IST

తిరుపతిలో పీజీఆర్‌ఎస్‌కు 390 అర్జీలు

TPT: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 390 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని, పెండింగ్ లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 2, 2026 / 07:14 PM IST

8 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్

AP: తిరుపతిలో టాస్క్ ఫోర్ట్స్ పోలీసులు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు. ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 కోట్ల విలువైన 8 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 195 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు సీజ్ చేశారు.

March 2, 2026 / 07:13 PM IST

‘పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అవసరం’

SRD: పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అవసరమని హెచ్ఎం నర్సింలు అన్నారు. సోమవారం సిర్గాపూర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు వితరణ చేశారు. గ్రామానికి చెందిన మంగలి సంజీవ్ కుమార్ 101 (మధ్యాహ్న భోజనం) ప్లేట్లను అందజేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో టీచర్లు ధూమ నాయక్, తావుర్యా నాయక్, అనిత, రమ్య, విద్యార్థులు ఉన్నారు.

March 2, 2026 / 07:12 PM IST

రాహుల్ గాంధీని కలిసిన.. DCC జిల్లా అధ్యక్షుడు

BHPL: వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన DCC అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, MP రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని, BHPL జిల్లా DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతాయుతమైనదని, ప్రజల సమస్యలు తీర్చడంలో ముందుండాలని సూచించారు.

March 2, 2026 / 07:12 PM IST

బాన్సువాడ బాధితులను పరామర్శించిన కేంద్రం సహాయ మంత్రి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ మేరకు బాన్సువాడలో జరిగిన సంఘటన బాధితుల కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షులు చిన రాజులు, బీజేపీ రాష్ట్ర నేత డా. పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

March 2, 2026 / 07:11 PM IST

చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్టు

RR: మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. గత నెల 25న రామాయంపేటకు చెందిన గృహిణి మియాపూర్‌లోని తన కుమార్తెను కలిసేందుకు వచ్చారు. నడుచుకుంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

March 2, 2026 / 07:11 PM IST