KDP: సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.
కోనసీమ: అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నిహారికను నటుడు శివాజీరాజా అభినందించారు. శుక్రవారం రాజమండ్రిలో ప్రశంసించారు. మార్చి 4 నుంచి బెంగళూరులో జరగనున్న సౌత్ జోన్ పోటీల్లోనూ నిహారిక తన ప్రతిభను చాటి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
HYD: మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని గచ్చిబౌలి ఏఈ భాస్కర్ తెలిపారు. నానక్రాంగూడ, అలేఖ్య హోమ్స్, విజయకృష్ణ బిల్డింగ్, డోమినోస్ ఏరియా, గోల్ఫ్ వ్యూ, ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
MLG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం (నేడు) మేడారం సందర్శనకు వస్తున్నారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మేడారం మాస్టర్ ప్లాన్ అమలు, పెండింగ్ పనుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక్కడి హరిత హోటల్లో రాత్రి బస చేస్తారు. ఆదివారం మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు.
TPT: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించిన పీజీ రెండవ సెమిస్టర్ M.Sc బోటనీ/ బయో కెమిస్ట్రీ/ జాగ్రఫీ/ఫిజిక్స్ /మ్యాథమెటిక్స్ / అప్లైడ్ మ్యాథమెటిక్స్ /స్టాటిస్టిక్స్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు డీన్ సురేంద్రబాబు పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించించారు.
MNCL: కాసిపేట మండల కేంద్రంలోని KGBV ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం వంటశాలను పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎస్ఓ సరితను ఆదేశించారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు గదుల పనులు పరిశీలించారు.
VSP: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా రేపు జూలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూ బయోస్కోప్ వద్ద పోటీలు జరుగుతాయి. 1–5, 6–10 తరగతులు, ఇంటర్ నుంచి పీజీ వరకు మూడు విభాగాల్లో విద్యార్థులు పాల్గొనవచ్చు. వివరాలకు 94411 56344 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
GNTR: తెనాలి మండలం కంచర్లపాలెం శివారులోని పంట కాల్వలో సుమారు 50ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి,ప్రాథమిక విచారణలో మృతుడు యాచకుడిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు.
MDK: సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జిల్లాలో ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ వీడ్కోలు సమావేశం నిర్వహించింది. జిల్లాను రోల్ మోడల్‌గా నిలిపేందుకు విశేషంగా కృషి చేశారన్నారు.
TG: వ్యాక్సిన్లు తయారు చేసే హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఐపీఓకి రానుందని, సుమారు రూ.4,200 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. ఐపీఓ చర్చల దశలో ఉందని, సైజ్, టైమింగ్ మారొచ్చని పేర్కొన్నారు.
సత్యసాయి: ఏపీ అసెంబ్లీ కాఫీ సెక్షన్ సిబ్బందితో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సరదాగా గడిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడ పనిచేస్తున్న వారితో కలిసి గ్రూపు ఫోటో దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ, ఎంతో వినయంగా మెలిగే బాలయ్య వ్యక్తిత్వంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
PLD: క్రోసూరు:కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీల అభ్యున్నతి కోసం CPI పార్టీ పనిచేస్తుందని నియోజకవర్గ CPI కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు తెలిపారు. మార్చి ఒకటి నుంచి 15 వరకు మండలంలో గడపగడపకు CPI కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంతో పోరాడి పరిష్కరిస్తామని ఆయన అన్నారు.
MDCL: ప్రశాంతతకు మరో పేరుగా హబ్సిగూడలోని వీరరాజా రెడ్డి పార్కు నిలుస్తుంది. సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఉద్యానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఒకేసారి 500 మంది యోగా చేసుకునే వీలుందని, స్థానిక ప్రజలందరూ సాయంత్రం, ఉదయం సమయాల్లో ఈ పార్కులో గడిపి, మానసిక సంతోషాన్ని, యోగ ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరచుకోవాలని అధికారులు సూచించారు.
WGL: చారిత్రక భద్రకాళి ఆలయంలో ఉత్తరాయణం శుక్లపక్షం సందర్భంగా శనివారం అర్చకుడు శేషు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యార్చన, షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూలైన్‌లలో వేచి ఉండి దర్శనం చేసుకుంటున్నారు.
MDK: జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో కోట్ల రూపాయల విలువైన భూమికి 15 లక్షలు చెల్లించి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రామాయంపేటకు చెందిన బైరం అర్జున్ నరసమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, బహిరంగ మార్కెట్ ధరతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.