• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సస్యరక్షణ చర్యలు చేపట్టాలి’

MNCL: రైతులు పంటలలో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని జన్నారం మండలంలోని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పొలాల్లో వివిధ పంటలు చేశారని, ఆ పంటల్లో గడ్డి, కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయన్నారు. వాటి వల్ల పంటలకు నష్టం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పొలాల్లో పెరిగే గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలని ఆయన సూచించారు.

March 6, 2026 / 09:37 AM IST

SPMCLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్(SPMCL)లో 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల 35 ఏళ్ల లోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.50 వేల జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం వెట్‌సైట్: https://www.spmcil.com/en/discover-spmcil/

March 6, 2026 / 09:37 AM IST

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

NTR: ఉట్కూర్ మండలం అంబేడ్కర్ కళాభవన్‌లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. పారా లీగల్ వాలంటీర్ ఎస్. అంజమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, 18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు లేని సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

March 6, 2026 / 09:37 AM IST

నేడు ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్

HYD: MRPS అధినేత మంద కృష్ణ మాదిగ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు MRPSనాయకులు తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలని కోరగా కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడం పట్ల ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

March 6, 2026 / 09:37 AM IST

బొబ్బిలిలో నాకాబందీ.. వాహనాల తనిఖీ

VZM: బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు చేసే వాహనాలను పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాలు, మందుగుండు సామగ్రి రవాణా జరగకుండా నాకాబందీ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 6, 2026 / 09:34 AM IST

వైభవంగా ఆలయం పునః ప్రారంభం

AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని గురువారం వైభవంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమాలు, కలశ పూజలు చేశారు. ఇదే ప్రాంగణంలో మరిడిమాంబ ఆలయాన్ని కూడా ప్రారంభించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పలువురు అమ్మవారులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వినోద్ రాజు పాల్గొన్నారు.

March 6, 2026 / 09:32 AM IST

ప్రొద్దుటూరు పట్టణ ఐద్వా కార్యవర్గం ఎన్నిక..!

KDP: పొద్దుటూరు పట్టణ ఐద్వా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా విజయకుమారి, ఉపాధ్యక్షులుగా సర్వేశ్వరీ, రాములమ్మ, వెంకటసుబ్బమ్మ, భానుమతి, ప్రధాన కార్యదర్శిగా గోకుల ప్రేమ, సహాయ కార్యదర్శులుగా లావణ్య, ఝాన్సీ, గుర్రమ్మ, జ్యోతి, సుదర్శనమ్మ, లక్ష్మీదేవి, పుష్పలత, కోశాధికారిగా పద్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 6, 2026 / 09:32 AM IST

భానుడి ప్రతాపంలో కావలి టాప్

నెల్లూరు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కావలిలో నిన్న అత్య ధికంగా 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు కంటే ఎక్కువ కాస్తుందని తెలిపారు. ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

March 6, 2026 / 09:31 AM IST

మోత్కూర్ బృందావని కాల్వకు మోక్షం ఎప్పుడో…?

BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని 1, 2 ,9 వార్డుల గుండా వెళ్లే బృందావన్ కాలువ దశాబ్ద కాలంగా మరమతులకు నోచుకోక అధ్వానంగా తయారయింది. తూములు, సైడ్ వాల్‌లు, దెబ్బతిని, కాల్వలో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం రాకముందే ఈ వేసవిలో అధికారులు స్పందించాలన్నారు.

March 6, 2026 / 09:30 AM IST

ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. కేసు నమోదు

SRPT: మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బూదరపు ఉపేందర్ తన ట్రాక్టర్ ద్వారా ముకుందాపురం శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా మద్దిరాలకు ఇసుకను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ వీరన్న హెచ్చరించారు.

March 6, 2026 / 09:29 AM IST

బోర్లకు మర్మమత్తు చెేపట్టిన సర్పంచ్

WGL: రాయపర్తి మండలం శివరామపురంలో తాగునీటి బోర్ల మోటార్లకు శుక్రవారం మర్మమత్తుల కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ పెద్దగోని నాగరాజుగౌడ్ వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో చెడిపోయిన మోటార్లను బయటకు తీసి వాటిని రిపేర్ చేశారు. అనంతరం మళ్లీ బోర్లలో మోటార్లను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

March 6, 2026 / 09:29 AM IST

రేపు భీమడోలుకు రానున్న షర్మిళ

ELR: ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈనెల 7న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి భీమడోలులో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించే ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆమె పాల్గొని కూలీలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహనరావు పార్టీ నేతలతో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.

March 6, 2026 / 09:28 AM IST

నేడు పత్తికొండలో జాబ్ మేళా..!

KRNL: పత్తికొండలోని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనునారు. ఈ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివి 18-40 ఏళ్ల మధ్య వారు అర్హులు. ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి.

March 6, 2026 / 09:28 AM IST

జిల్లాలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం రోజున కళ్యాణ లక్ష్మీ చెక్కుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి వైస్ ఛైర్మన్ బంక చందు తోటపల్లి సర్పంచ్ బంక లక్ష్మీ గాంధీనగర్ సర్పంచ్ పోలు సంపత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ లబ్ధిదారులు, అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

March 6, 2026 / 09:28 AM IST

5 నిమిషాల ఆలస్యంతో అవకాశం కోల్పోయారు

VSP: రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్ధులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో ఇవాళ ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు.

March 6, 2026 / 09:26 AM IST