• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

W.G: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం యల్.హెచ్.టౌన్ హాల్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

March 12, 2026 / 09:30 PM IST

చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్‌ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్.. *చాపింగ్​బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.

March 12, 2026 / 09:27 PM IST

ఇసుక లారీ, ట్రాక్టర్ ఢీ.. యువకుడు మృతి

MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. శివం గార్డెన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వేగంగా వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 09:25 PM IST

అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లాలి: సీఎం

TG: ‘అల్లు సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌ను CM రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ సినీ రంగంలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బన్నీ చిత్రాలు భవిష్యత్తులో హాలీవుడ్‌ స్థాయికి చేరుకోవాలన్నారు. అంతర్జాతీయ వేదికలపై మన సినిమా సత్తా చాటాలని పేర్కొన్నారు.

March 12, 2026 / 09:25 PM IST

ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం

TG: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గతంలో పోలీసులు సీజ్ చేసిన దాదాపు 50 బైకులు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయి. చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.

March 12, 2026 / 09:23 PM IST

ఘోరం.. ముగ్గురు పిల్లలతో బావిలో దూకిన తల్లి

TG: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్లలో ఘోరం జరిగింది. రెండో బోరు వేసే విషయంలో భర్తతో జరిగిన వివాదంతో ఆవేశానికి గురైన జంగమ్మ.. తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు జ్యోతి, శైలజ ప్రాణాలు కోల్పోయారు. అయితే, కుమారుడు జస్వంత్ చాకచక్యంగా బావి అంచును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు.

March 12, 2026 / 09:21 PM IST

2,500 కల్తీ పెరుగు స్వాధీనం

TG: HYDలోని అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్‌ సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, GHMC ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు.

March 12, 2026 / 09:17 PM IST

‘రైతులు ఎఫ్‌సీవో సభ్యత్వం పొందాలి’

KNR: వీణవంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు ఎఫ్‌పీవో సభ్యత్వం పొందాలని సంఘం కార్యదర్శి చందుపట్ల ప్రకాశ్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం రూ. 300తో సొసైటీ సభ్యులుగా ఉన్న వారు రూ. 2000 చెల్లించి ఎఫ్‌పీ‌వో సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. ఎఫ్‌పీ‌వో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఎన్సీడీసీ ద్వారా ప్రతి సంవత్సరం రూ. 2000 ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.

March 12, 2026 / 09:16 PM IST

‘జనగణన-2027’పై అవగాహన కార్యక్రమం

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ‘జనగణన-2027’ హౌస్‌లిస్టింగ్ ప్రక్రియపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సర్వేను డిజిటల్ పద్ధతిలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, తహశసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ప్రభుత్వ సిబ్బంది పాల్గొని కీలక సూచనలు అందుకున్నారు.

March 12, 2026 / 09:14 PM IST

కావ్యా మారన్‌పై నెటిజన్ల ఫైర్!

SRH ఓనర్ కావ్యా మారన్ హండ్రెడ్‌ లీగ్-2026 వేలంలో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. సన్‌రైజర్స్‌ లీడ్స్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా అయిన కావ్యా.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.34 కోట్లకు కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది. గతంలో టీమిండియా ఆటగాళ్ల పట్ల అతడు ప్రదర్శించిన అతి ప్రవర్తనను గుర్తుచేస్తూ, కావ్యాను SMలో ట్రోల్ చేస్తున్నారు.

March 12, 2026 / 09:10 PM IST

దేవాలయ నిర్మాణానికి రూ.1,00,116 విరాళం

MDCL: మేడిపల్లి పరిధిలోని సాయి ప్రియ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామస్వామి (శివాలయం & రామాలయం) దేవాలయ నిర్మాణ పనులకు పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి రూ. 1,00,116లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవచింతన సమాజంలో శాంతిని, ఐకమత్యం పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 09:02 PM IST

‘జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది’

AP: తమ ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘రూ.3.5 లక్షల కోట్లు అప్పు చేశామని జగన్ అబద్ధాలు చెబుతున్నారు. అప్పులు ఇవ్వొద్దని వందకు పైగా సంస్థలకు లేఖలు రాశారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కోర్టుకెక్కి చీవాట్లు తిన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది’ అని విమర్శించారు.

March 12, 2026 / 09:02 PM IST

రాజంపేటలో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని బోయినపల్లి ప్రాంతంలో కృష్ణవేణి అనే మహిళ గురువారం ఉరివేసుకుని మృతిచెందింది. ఆమె భర్త శ్రీరామ్ శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. దంపతుల మధ్య కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 12, 2026 / 09:00 PM IST

పోచారం డ్యామ్‌లో పడి ఒకరి మృతి

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ GP పరిధిలోని ఎర్రారం గ్రామానికి చెందిన దూదేకుల జాంగిర్ జీవన ఉపాధి కోసం మెదక్ వెళ్లి సోడాలు అమ్ముకుంటు ఉండేవాడు. మద్యానికి బానిసై పోచారం డ్యామ్‌లో పడి సూసైడ్ చేసుకున్నట్లు అతని భార్య శన్ను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

March 12, 2026 / 09:00 PM IST

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

NZB: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని ఆర్మూర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.12,570 నగదు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు SHO సత్య నారాయణ గౌడ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 12, 2026 / 09:00 PM IST