• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమ్మాయిలకు రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్

కేరళం అసెంబ్లీ ఎన్నికల వేళ UDF తరఫున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 5 గ్యారంటీలను ప్రకటించారు. KSRTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెలా రూ.1,000. వెల్ఫేర్ పెన్షన్ రూ.3,000లకు పెంపు. ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా, బిజినెస్ చేయాలనుకునే యువతకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు. అలాగే, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు.

March 8, 2026 / 12:50 AM IST

మార్చి 08: ఆదివారం పంచాంగం

➠ తిథి: బహుళ పంచమి రా.8:10 వరకు తదుపరి షష్టి ➠ నక్షత్రం: స్వాతి మ.12:53 వరకు, తదుపరి విశాఖ ➠ శుభ సమయాలు: ఉ.7:13 నుంచి 10:10, ఉ.11:09-మ.12:08, మ.2.06-సా.4:26 ➠ రాహుకాలం: సా.4:30-సా.6:00 వరకు ➠ యమగండం: మ.12.00-మ.1.30 వరకు దుర్ముహూర్తం: సా.4.27-సా.5.15 వరకు ➠ వర్జ్యం: రా.7:01-8:47 వరకు ➠ అమృత ఘడియలు: తె.5:34 నుంచి.

March 8, 2026 / 12:20 AM IST

‘జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి’

TG: గత ప్రభుత్వం తీసుకొచ్చిన GO 317 వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ జేఏసీ నాయకులు గాల్​రెడ్డి హర్షవర్ధన్ ​రెడ్డి పేర్కొన్నారు. వారికి న్యాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బాధితులకు పరిష్కారం అందించాలని మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్​‌ను కలిశారు. బాధితులకు పరిష్కారం చేస్తామని భరోసా కల్పించారు.

March 8, 2026 / 12:10 AM IST

జగన్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

AP: వైఎస్ జగన్ సీఎం కాకముందు ఒకటి.. అయ్యాక ఇంకోటి చేశాడని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీని జగన్ జగన్ అసలు ప్రశ్నించరని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడటం ఎప్పుడో మానేశారని తెలిపారు. ప్రత్యేక హోదాపై కాలర్ పట్టుకుని తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారని గుర్తు చేశారు.

March 7, 2026 / 11:40 PM IST

GREAT: గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌‌గా తెలుగమ్మాయి

అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ.. ఓ తెలుగమ్మాయి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఛానెల్ ‘హౌస్ అంబాసిడర్‌’గా హైదరాబాద్‌కు చెందిన భవితా మండవ నియమితురాలయ్యారు. మార్గోట్ రాబీ, జెన్నీ కిమ్ వంటి అంతర్జాతీయ స్టార్ల సరసన ఒక భారతీయురాలు ఈ గౌరవాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

March 7, 2026 / 11:29 PM IST

16 నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

TG: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈనెల 16న ఉదయం 11:45 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు  ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు.

March 7, 2026 / 11:19 PM IST

ట్రంప్‌పై కమల్ హాసన్ ఆగ్రహం

రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్‌కు అనుమతిస్తున్నామన్న అమెరికా ప్రకటనపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ సార్వభౌమ దేశమని.. విదేశాల నుంచి ఆదేశాలు తీసుకోదంటూ ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు. మీ పని మీరు చూసుకోండంటూ ఘాటుగా స్పందించారు. దేశాల మధ్య పరస్పర గౌరవమే ప్రపంచ శాంతికి పునాది అని హితవు పలికారు.

March 7, 2026 / 11:10 PM IST

‘ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్’

TG: ఏఐ ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు.. ఇంజినీరింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

March 7, 2026 / 10:56 PM IST

లక్కీరెడ్డిపల్లిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లిలో ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. 132 కేవీ సురకవాండ్లపల్లి సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ మార్పిడి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

March 7, 2026 / 10:35 PM IST

మహిళా దినోత్సవం.. ఆర్టీసీ ఎండీ కీలక వ్యాఖ్యలు

TG: ఇంటా బయటా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న మహిళా సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడారు. ఈ తరం మహిళా లోకం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటి చెబుతుండటం హర్షించదగ్గ పరిణామమని కొనియాడారు.

March 7, 2026 / 10:16 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: కలెక్టర్

NZB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ శనివారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ, దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారని కలెక్టర్ అన్నారు.

March 7, 2026 / 10:00 PM IST

చిన్నారుల మిస్సింగ్ కేసు.. ముగ్గురు మృతి

AP: కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పెద్ద చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా.. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 7, 2026 / 09:59 PM IST

తాడేపల్లిగూడెంలో న్యాయ విజ్ఞాన సదస్సు

W.G: మహిళలు చట్టాలను న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని జడ్జిలు కే. మాధవి, ఎస్. సూర్య కిరణ్ సూచించారు. శనివారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమని, వారికి అనేక చట్టాలు ఉన్నాయన్నారు. వాటిని సక్రమంగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఎండీవో వీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 09:51 PM IST

స్వదేశానికి బహ్రెయిన్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులు

AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో బహ్రెయిన్‌లో చిక్కుకున్న ప్రసావాంధ్రులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇవాళ రాత్రి 59 మంది తెలుగువారు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రామ్మోహన్ బహ్రెయిన్‌లో 238 మంది తెలుగువాళ్ల వివరాలను తీసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

March 7, 2026 / 09:46 PM IST

మహిళలకు ఎస్పీ శుభాకాంక్షలు.!

KDP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సమాజం, కుటుంబ వ్యవస్థలో మహిళలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.

March 7, 2026 / 09:45 PM IST