ATP: అనంతపురం నగరంలోని మహిళా, బాలల గ్రంథాలయ ఆడిటోరియంను నిరుద్యోగ యువత కోసం అత్యాధునిక స్టడీ హాల్‌గా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ తెలిపారు. శనివారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ఆడిటోరియంను సందర్శించారు. భవన మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై వివరించారు.
HNK: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డీఆర్ఓకు సీఐటీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కోరారు. 2వ పీఆర్సీలో నిర్ణయించి అమలు చేయాలని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.
ASR: అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని ప్రకటన చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి చిన్నారి డిమాండ్ చేశారు. శనివారం పాడేరులో మాట్లాడారు. ఈనెల 10న జీతాల పెంపు ప్రకటన చేయకపోతే, ఈనెల 11వ తేదీ నుంచి అంగన్వాడీలు అందరూ మళ్లీ రోడ్లపైకి వచ్చి, ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
TPT: వెంకటగిరి జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు రోడ్డుపై దొరికిన సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన పర్సును వెంకటగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితులను గుర్తించి వాటిని వారికి అందజేశారు. విద్యార్థినుల నిజాయితీని అభినందించిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు వారికి ప్రశంసాపత్రాలు, పుస్తకాలు, నగదు బహుమతులు అందజేశారు.
NRML: దిలావర్‌పూర్ మండల కేంద్రంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీ. శంకర్ ఇవాళ ఆకస్మికంగా పర్యటించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, పీహెచ్‌సీ, జడ్పీహెచ్‌ఎస్ ఎంపీపీఎస్ పాఠశాలలను పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.
MBNR: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు తండాలో ఇండిపెండెంట్ సర్పంచ్ పద్మావత్ లక్ష్మీనారాయణ నాయక్, ఉప సర్పంచ్ కిషన్ నాయక్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి సాదరంగా కండువాలు కప్పి ఆహ్వానించారు.
KNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను టీఎన్జీవోస్ భవన్లో శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని టీఎన్జీవోస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
KNR: రేకుర్తి నేత్ర వైద్య శాలలో అత్యాధునిక ‘మాడ్యులర్ రెటీనా ఓటీ’ని మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ ప్రారంభించారు. ఈ అత్యాధునిక యంత్రాన్ని దేశంలోనే తొలిసారిగా ఇక్కడ కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. కేవలం రూ. 50 రిజిస్ట్రేషన్‌తో నాణ్యమైన సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి పారిశుద్ధ్యాన్ని మెచ్చుకున్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ వైస్ ఛైర్ పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు (5వ వార్డు) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. తన వార్డులోని పేద ఇంటి ఆడబిడ్డల వివాహానికి రూ.15,116లు ఆర్థిక సాయం అందిస్తానన్న వాగ్దానంలో భాగంగా, జక్కల నందిని వివాహానికి ఆమె శనివారం హాజరై వివాహ కానుకను అందించారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు.
మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
HYD: ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజా ఆగిరెడ్డి గారు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
BDK: జిల్లా కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు కలెక్టర్ అంకిత్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ M.గణేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోని మహిళలు ఎంతో మంచి విజయాలు సాధించారని, మహిళా శక్తి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొన్నారు.
విశాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ శంఖ భ్రత బాగ్చి పాల్గొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘ఇన్‌స్పైర్ ఉమెన్’, ‘ప్రౌడ్ ఆఫ్ వైజాగ్’ అవార్డులను ప్రదానం చేశారు.
NLR: బుచ్చి పట్టణంలోని పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థి తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆటలను ఆడారు. ఆటలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారని, మహిళ ప్రాముఖ్యత ఎంతో ముఖ్యమని ఉపాధ్యాయుడు శ్రీధర్ తెలిపారు.
MHBD: రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.