• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దారుణం.. తోటి విద్యార్థిపై కత్తితో దాడి

కర్ణాటక బళ్లారిలోని ఓ స్కూల్ హాస్టల్‌లో దారుణం జరిగింది. తోటి విద్యార్థి హేమంత్‌ను భరత్ కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన ఆరుగురు 9వ తరగతి విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే హేమంత్‌ది  కర్నూలు జిల్లా సమ్మతగేరి స్వగ్రామం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 8, 2026 / 08:50 PM IST

నూతన భవనం ప్రారంభించిన కేంద్రమంత్రి

కరీంనగర్ పట్టణంలోని జ్ఞాన భారతి అఖిలభారత విద్యార్థి పరిషత్ నూతన భవనంను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ కార్పొరేటర్లు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

March 8, 2026 / 08:49 PM IST

మసీదు ప్రహరీ గోడ మరమ్మతులకు హామీ

అన్నమయ్య: రాయచోటిలోని మహబూబ్ నగర్ జీనత్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జీనత్ మసీదు స్మశానవాటిక ప్రహరీ గోడ మరమ్మతులు, వజూఖానా, టాయిలెట్ల నిర్మాణం ఎంపీ మిథున్ రెడ్డి నిధులతో చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

March 8, 2026 / 08:48 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సైకి సన్మానం

CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్వేటినగరం మండల ఎస్సై తేజస్విని మేడంను జనసేన నాయకులు దుశ్యాలువతో సన్మానించారు. డా. పొన్న యుగంధర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆమె పనితీరు, లా అండ్ ఆర్డర్ నిర్వహణను కొనియాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు, లోకేష్, రాఘవ, మాదాసి వెంకటేష్, చంద్ర మౌళి పాల్గొన్నారు.

March 8, 2026 / 08:48 PM IST

‘కేసీఆర్ హయాంలో ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట’

NZB: బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం ముస్లీమ్ మైనారిటీ సోదరులతో కలిసి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన – సంక్షేమ స్వర్ణయుగం గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిజమైన లౌకికవాదంతో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.

March 8, 2026 / 08:47 PM IST

కోదాడలో ఘనంగా ఇఫ్తార్ విందు

SRPT: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని కౌన్సిలర్ నరేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన, అనంతరం ఉపవాస దీక్షలను విరమింపజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

March 8, 2026 / 08:47 PM IST

కారు ఢీ.. దంపతులుకు గాయాలు

KRNL: గూడూరు మండలం జూలకల్ గ్రామానికి చెందిన కుర్వ కృష్ణ-లక్ష్మి దంపతులు ఇవాళ ఎద్దుల బండిపై పొలానికి వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దంపతులు కాళ్లు, చేతులు విరిగి గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వారి నలుగురు చిన్న పిల్లలు, అమ్మనాన్నలు బాధతో విలపిస్తున్నారు.

March 8, 2026 / 08:46 PM IST

బాధ్యతలు చేపట్టిన అన్నాజీ రావు

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన సనపల అన్నాజీ రావు శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరా విజ్ఞాన భవన్‌లో ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయటం లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

March 8, 2026 / 08:46 PM IST

పాముగడ్డలో ఊబిలోపడి ఊపిరి ఆడక వ్యక్తి మృతి

AKP: అచ్యుతాపురం(మం) దొప్పర్ల శివారు పాముగడ్డలో జరి ప్రమాదవశాత్తు ఊబిలో పడి లాలం సత్యరావు(52) ఆదివారం మృతి చెందాడు. స్థానికలు కధనం ప్రకారం రోజు లాగే కాలకృత్యాలు చేయడానికి వెళ్లిన సత్యరావు కాలు జారి ఊబిలో పడిపోయి ఊపిరి ఆడక చనిపోయారు. భార్య వెంకటాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలపారు.

March 8, 2026 / 08:45 PM IST

మాజీ సీఎంను కలిసిన గరుగుబిల్లి నేతలు

పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం పాముల పుష్పశ్రీ వాణిను గరుగుబిల్లి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై ఆమెతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 8, 2026 / 08:45 PM IST

FINAL: టీమిండియా విధ్వంసం.. భారీస్కోర్

T20 WC లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నిర్ణిత 20 ఓవర్లలో భారత్ స్కోర్ 256/5 చేసింది. సంజూ (89), అభిషేక్ (52), ఇషాన్ కిషన్ (54) శివమ్ దూబె(25*)తో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లు జేమ్స్ నీషమ్ 3 వికెట్లు పడగొట్టాడు.

March 8, 2026 / 08:44 PM IST

చైన్ స్నాచర్‌ను వెంటాడి పట్టుకున్న పోలీసులు

KMR: పట్టణంలోని స్టేషన్ రోడ్డులో డీసీబీ బ్యాంక్ ఎదుట ఆదివారం ఓ మహిళ మెడలోని బంగారు తాడును లాక్కొని పారిపోతున్న వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనను గమనించి వెంటనే నిందితుడిని వెంబడించారు. కొద్దిదూరం తరుముకుని అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, బంగారు చైన్‌తో సహా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 8, 2026 / 08:44 PM IST

‘ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరం’

KNR: రాష్ట్రంలో ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఖేల్ మహోత్సవంలో మాట్లాడుతూ.. అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిదర్శనమన్నారు. హెచ్ సీఏలో సెలెక్ట్ కావాలంటే పైరవీలు, డబ్బులు తీసుకుని సెలెక్ట్ చేసే సంస్కృతిని కొందరు తీసుకొచ్చారన్నారు.

March 8, 2026 / 08:44 PM IST

‘పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది’

AP: బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల భరోసా కల్పిస్తోంది’ అని పేర్కొన్నారు.

March 8, 2026 / 08:43 PM IST

కేజీహెచ్ ఘటనపై వాసుపల్లి ఆగ్రహం

విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మార్చురీ వద్ద కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. బాలుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

March 8, 2026 / 08:41 PM IST