• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రమాదపరితంగా వ్యవసాయ కూలీల ప్రయాణం

PLD: పెదకూరపాడులో వ్యవసాయ కూలీలు ప్రమాదపరితంగా ట్రాక్టర్‌ఫై శుక్రవారం సాయంకాలం ప్రయాణం చేస్తున్నారు. ట్రాక్టర్కు ఇరువైపులా ఉన్న డోర్లను తీసివేసి ఓవర్ లోడ్‌తో కూర్చోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలన్నారు. రైతులకు, ట్రాక్టర్ యాజమాన్యానికి పోలీస్ అధికారులు అవగాహన కల్పించాలని వారు కోరారు.

February 27, 2026 / 07:56 PM IST

టీడీపీ సీనియర్ నాయకుడి పార్థివ దేహనికి నివాళులు

NTR: కొండపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎండ్లూరి సుబ్బానాయుడు గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన భౌతికకాయంపై టీడీపీ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

February 27, 2026 / 07:54 PM IST

మార్చి 1న ఘనంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల

PLD: ఈపూరు ప్రసన్నాంజనేయ స్వామివారి తిరుణాల మార్చి 1న ఘనంగా జరగనుంది. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఎస్సై కె. వేణుగోపాల్ శుక్రవారం పరిశీలించి భద్రతా సూచనలు జారీ చేశారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా హాజరుకానున్నారు. భక్తులు పాల్గొని తిరునాళ్ళను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

February 27, 2026 / 07:54 PM IST

వీధి దీపాలకు ప్రత్యేక నంబర్ ఇవ్వండి: సీఎం

TG: మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్ లో శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వీధిదీపాలకు ప్రత్యేక నంబర్ ఇచ్చి డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలన్నారు.

February 27, 2026 / 07:53 PM IST

మంత్రిని కలిసిన యాదాద్రి కలెక్టర్

BHNG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా పేదలకు చేరేలా, అర్హులైన వారికి లబ్ది జరిగేలా పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌కు సూచించారు.

February 27, 2026 / 07:52 PM IST

మంత్రిని కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే

MBNR: సెక్రటేరియట్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని కొత్తకోట, దేవరకద్ర, భూత్పూర్ మూడు మున్సిపాలిటీలలో అలాగే చిన్న చింతకుంట, అడ్డాకుల, మూసాపేట్ మండల కేంద్రాలలో మినీ షాది ఖానాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 27, 2026 / 07:52 PM IST

మామండూరు జలపాతంలో యువకుడు మృతి

TPT: మామండూరు జలపాతంలో ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. తిరుపతి మంగళానికి చెందిన దిలీప్(19)సహా ఐదుగురు బీటెక్ విద్యార్థులు మామండూరు జలపాతానికి వెళ్లారు. అక్కడ ఈత రాని దిలీప్ అనుకోకుండా నీటిలో మునిగి మృతి చెందాడు. స్నేహితులు, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. దీనిపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

February 27, 2026 / 07:50 PM IST

దరఖాస్తు గడువు.. రేపే చివరి తేది

PDPL: రామగుండం మండల కేంద్రంలోని టీజీ మోడల్ స్కూల్లో ఆరో తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 28తో ముగియనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సదానందం యాదవ్ తెలిపారు. వోసీ విద్యార్థులకు రూ. 200, ఇతరులకు రూ. 125 ఫీజు ఉంటుందని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న నిర్వహిస్తామన్నారు

February 27, 2026 / 07:49 PM IST

ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

SRD: మార్చి 13న సాయంత్రం ఐదు గంటలకు నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనుంది. గత 27 సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇలాంటి విందు నిర్వహిస్తున్నట్లు గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ముస్లిం మత పెద్దలు, సీనియర్ నాయకులు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.

February 27, 2026 / 07:49 PM IST

ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజకు హాజరు కానున్న ఎమ్మెల్యే

NLG: మునుగోడు మండలం కేంద్రంలో మార్చి 1న ఉదయం 11 గంటలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మర్రిగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ కోరారు.

February 27, 2026 / 07:48 PM IST

పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తాహసీల్దార్

WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని దస్తగిరిపల్లె గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని తాహసీల్దార్ ముప్పు కృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన B. R. Ambedkar చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని’ వాటి పరిరక్షణ కృషి చేయాలని అధికారులకు సూచించారు.

February 27, 2026 / 07:48 PM IST

మంత్రి నిమ్మలను కలిసిన ఎమ్మెల్యే సత్యప్రభ

కాకినాడ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని శుక్రవారం సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో గల సుబ్బారెడ్డి సాగర్ మరమ్మతు పనులు, చంద్రబాబు సాగర్ కాలువ నిర్మాణ పనులు, సిబ్బంది కొరత తదితర పనులకు అనుమతులు, నిధులు మంజూరు చేయమని కోరుతూ వినతి పత్రాలు అందచేశారు.

February 27, 2026 / 07:48 PM IST

ఆధార్ సేవా కేంద్రం ప్రారంభించిన తహసీల్దార్

MNCL: నెన్నెల మండల MRO కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని MRO శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. MRO మాట్లాడుతూ.. మండల ప్రజలు ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణకు, కొత్త కార్డుల నమోదుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 27, 2026 / 07:47 PM IST

రేవంత్ రెడ్డి.. రైతు భరోసా ఎక్కడా: బండి సంజయ్

TG: ఎన్నికల ముందు హామీలివ్వడం.. తర్వాత మాట తప్పడం కాంగ్రెస్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. యాసంగి మొదలై రెండు నెలలు గడిచినా రైతు భరోసా నిధులు జమ చేయకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌‌కు సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు.

February 27, 2026 / 07:47 PM IST

‘సీఎం-కప్’లో జిల్లా యువకుల విజయం

KMR: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘సీఎం-కప్’ క్యారం పోటీల్లో జిల్లా యువకులు ప్రతిభ చాటారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో రామారెడ్డి యువకులు ప్రణయ్, రాజు, జగదీశ్ పాల్గొని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. విజేతలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ విజేతలను అభినందించారు.

February 27, 2026 / 07:47 PM IST