• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

“పొలం పిలుస్తోంది” కార్యక్రమంలో రైతులకు సూచనలు

KKD: పిఠాపురం మండలంలో పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. మండలం వ్యవసాయ అధికారి గంగాధర్ మాట్లాడుతూ వరిలో దోమపోటు కనిపిస్తుందన్నారు. ఈ సుడిదోమా కాండం నుంచి రసం పీల్చడం ద్వారా నష్టం కలిగిస్తుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో తూటికాడ కషాయం పిచికారి చేస్తే తక్కువ ఖర్చుతో బాగా పని చేస్తుందని రైతులకు తెలిపారు.

March 10, 2026 / 02:30 PM IST

పశువులకు గాలికుంటు టీకాలు ఇప్పించాలి: కలెక్టర్

NGKL: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న టీకాలను ఇప్పించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రైతులకు సూచించారు. బల్మూరు మండల జినుంట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గాలికుంటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అమలు చేసిన పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 10, 2026 / 02:30 PM IST

ఒంగోలులో ఆటోలకు పోలీస్ డిజిటలైజేషన్ స్టిక్కర్లు

ప్రకాశం: ఒంగోలులో ఆటోరిక్షాలకు పోలీస్ డిజిటలైజేషన్ నంబర్ కలిగిన స్టిక్కర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 300కు పైగా ఆటోలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌లో ఆటో డ్రైవర్లకు డిజిటలైజేషన్ నంబర్ స్టిక్కర్లను అందజేశారు.

March 10, 2026 / 02:30 PM IST

స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రతి ఒక్కరూ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం తీదేడు( వెంకటంపేట) లో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

March 10, 2026 / 02:30 PM IST

స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రతి ఒక్కరూ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం తీదేడు( వెంకటంపేట) లో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

March 10, 2026 / 02:30 PM IST

ప్రజలు పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలి: ఎంపీడీవో

NTR: నందిగామ(M) పెద్దవరం గ్రామంలో మంగళవారం ఎంపీడీవో ఆర్.వీ.ఎస్. ప్రసాద్‌రావు డోర్ టు డోర్ హౌస్ టాక్స్ కలెక్షన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన రోజువారీ టార్గెట్‌ను అధికారులు సమయపాలనతో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తే గ్రామ అభివృద్ధికి సహకారం అన్నారు.

March 10, 2026 / 02:30 PM IST

రోడ్డు వేశారు.. మట్టి వేయడం మరిచారు..!

GDWL: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామం నుంచి సంఘాల రోడ్డువరకు బీటీ రోడ్డు వేశారు. అయితే సైడ్లకు మట్టి వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన లోతుగా ఉండటంతో వాహనాలు జారి పలువురు గాయపడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే సైడ్ మట్టి వేయాలని ప్రజలు కోరుతున్నారు.

March 10, 2026 / 02:26 PM IST

రేపు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2కే రన్

KMM: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం పట్టణంలో ‘2కే రన్’ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఛైర్‌పర్సన్ సామినేని సుజాత ఆధ్వర్యంలో ఉదయం 6:30 గంటలకు స్థానిక ట్యాంక్ బండ్ నుంచి అంబారుపేట శివారు వరకు ఈ పరుగు పందెం కొనసాగుతుంది.

March 10, 2026 / 02:25 PM IST

రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడద

PDPL: రామగుండంలో కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతుంది. రామగుండం కోల్ బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం ఏదో ఒక కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ ఇంతవరకు కార్పొరేషన్ అధికారులు వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులపై దాడులకు దిగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 10, 2026 / 02:25 PM IST

జాయింట్ కలెక్టర్‌తో MLC రామగోపాల్ రెడ్డి భేటీ

కడప: జిల్లా జాయింట్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నిధి మీనాకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై జాయింట్ కలెక్టర్‌తో చర్చించారు. 

March 10, 2026 / 02:23 PM IST

తల్లిదండ్రులకు పాదపూజ చేసిన విద్యార్థులు

MLG: జంగాలపల్లి గ్రామంలోని బ్రాహ్మణి విద్యాలయంలో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పట్ల గౌరవభావన పెంపొందించుకోవడం ప్రతివిద్యార్థి కార్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబ విలువలు, సంస్కారం,పెద్దల పట్ల గౌరవం విద్యార్థుల్లో పెంపొందుతాయని వారు పేర్కొన్నారు

March 10, 2026 / 02:21 PM IST

సీఎంను కలిసిన వేం నరేందర్

MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పూలబొకే అందజేసి తన నియామకానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం సైతం వేం నరేందర్‌కు అభినందనలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సీఎం ఆయనకు సూచించారు.

March 10, 2026 / 02:21 PM IST

‘గ్లకోమా’ వ్యాధిపై అవగాహన సదస్సు

అన్నమయ్య: మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం ‘జాతీయ గ్లకోమా వారోత్సవాలు’ నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి పెరగడం వల్ల గ్లకోమా వ్యాధి వస్తుందని డాక్టర్ దివ్య తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబ చరిత్ర ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సకాలంలో కంటి పరీక్షలు, మందులు లేదా లేజర్ చికిత్స ద్వారా దృష్టి నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

March 10, 2026 / 02:20 PM IST

బుగ్గన ఆరోపణలను ఖండించిన మంత్రి

AP: CMపై మాజీమంత్రి బుగ్గన ఆరోపణలను మంత్రి మండిపల్లి ఖండించారు. ‘గత YCP పాలనలో రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసి భూ సమస్యలను పెంచారు. రైతుల భూములు కబ్జా చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. నేరం చేశారనే భయంతోనే CMపై ఆరోపణలు చేస్తున్నారు. భూ ఆక్రమణ నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. రైతుల హక్కులను కాపాడటం కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం’ అని పేర్కొన్నారు.

March 10, 2026 / 02:20 PM IST

రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

WGL: నగరంలోని 48, 49 డివిజన్‌లలో రేణుక ఎల్లమ్మ బోనాల పండుగలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం సీడీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

March 10, 2026 / 02:20 PM IST