• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా కలెక్టర్ హెచ్చరిక

ELR: ఏలూరులోని పీడీబీటీ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 6, 2026 / 07:02 PM IST

తుపాకులు.. టెక్నాలజీతో పోలీసుల ఓపెన్ హౌస్

అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసుల ఆయుధాలు, బాంబ్ స్క్వాడ్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ వినియోగం,సైబర్ నేరాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు.

March 6, 2026 / 07:02 PM IST

లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం: సీఐ

SRPT: విద్యార్థులు నిరంతర సాధనతోనే ఉన్నత లక్ష్యాలను అధిగమించగలరని తుంగతుర్తి సీఐ నరసింహారావు అన్నారు. నూతన్ కల్ మండల కేంద్రంలో మేరీస్ హైస్కూల్‌లో నిర్వహించిన ‘పోలీస్ ప్రజా భరోసా’లో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థుల్లో ధైర్యం నింపుతూ, క్రమశిక్షణతో చదివి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.

March 6, 2026 / 07:02 PM IST

డ్వాక్రా భవన నిర్మాణానికి శంకుస్థాపన

MBNR: నవాబ్ పేట మండలం కాకర్ల పహాడ్‌లో నూతన డ్వాక్రా భవన నిర్మాణానికి సర్పంచ్ బాలయ్య శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఈ భవనాలను నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీలత, ఉప సర్పంచ్ అంబెడ్కర్, కాంగ్రెస్ నాయకులు మైనోద్దీన్, అంకం గోపాల్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

March 6, 2026 / 07:01 PM IST

ప్రజాపాలన ప్రగతిని విజయవంతం చేయాలి: మంత్రి

NGKL: జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను అధికారులు సవాల్‌గా తీసుకుని విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కలెక్టర్‌కు సూచించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామసభల్లో తాగునీరు, పథకాల లబ్ధిదారుల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒక అంశం (థీమ్)పై సమీక్ష నిర్వహిస్తూ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

March 6, 2026 / 07:01 PM IST

‘అధికారులు నిబద్ధతతో పని చేయాలి’

ADB: సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, ప్రజా ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు నిబద్ధతతో పని చేయాలని మంత్రి జూపల్లి సూచించారు. ఆదిలాబాద్ జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 6, 2026 / 07:01 PM IST

‘సాత్వికోత్తమ శతకం’ ఆవిష్కరణ

NGKL : జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రముఖ అవధాని చుక్కాయిపల్లి శ్రీదేవి రచించిన ‘సాత్వికోత్తమ శతకం’ గ్రంథ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఓయూ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అష్టావధానం, శతావధానాల్లోని అంశాలను గ్రంథరూపంలోకి తేవడం అభినందనీయమని ఆయన కొనియాడారు.

March 6, 2026 / 07:01 PM IST

వేలేరులో సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభం

HNK: వేలేరులో రూ.30 లక్షల నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ యాదగిరి నేడు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యల సహకారంతో వేలేరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలన్నారు.

March 6, 2026 / 07:00 PM IST

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అమలాపురం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని SHOలు, పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రతి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు.

March 6, 2026 / 07:00 PM IST

గోటి తలంబ్రాలు ఓలిచి అందించిన ఏసీపీ

SDPT: గజ్వేల్ ఏసీపీ నర్సింలు భద్రాచల రామయ్య కళ్యానికి గోటి తలంబ్రాలు ఓలిచి భక్తిని చాటుకున్నారు. శుక్రవారం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఏసీపి చేత రామనామ స్మరణ చేపించి గోటితో వడ్లు ఓలిపించారు. ఓలిచి గోటి తలంబ్రాలను రామకోటి రామరాజుకు అందజేసి రామభక్తిని చాటుకున్నారు.

March 6, 2026 / 07:00 PM IST

డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోండి: AISA

సత్యసాయి: పెనుకొండలోని శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో అక్రమాలు జరుగుతున్నాయని AISA నాయకులు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ CDC డీన్ ప్రొఫెసర్ రాంగోపాల్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆదిశేషరెడ్డి నిబంధనలు పట్టించుకోకుండా విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

March 6, 2026 / 07:00 PM IST

ర్యాలీ విద్యార్థినికి కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్

కోనసీమ: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షలో ఆత్రేయపురం మండలం ర్యాలీ హైస్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్న బీ.ఇషిత విజయం సాధించింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున 4 సంవత్సరాలకు రూ. 48 వేలు స్కాలర్‌‌‌షిప్ అందజేయనుంది. ఈ సందర్భంగా ఆమెను హెచ్ఎం ఎన్.సూరిబాబు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు శుక్రవారం అభినందించారు.

March 6, 2026 / 07:00 PM IST

ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

NLR: రంజాన్ మాసం ప్రారంభమై నేటితో 16 రోజులు పూర్తయింది. 16వ రోజు శుక్రవారం కావడంతో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పట్టణంలోని మసీదులకు స్థానిక నాయకుల సాయంతో భోజనాలను పంపించారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారికి అల్లా కృప కటాక్షాలు ఉండాలని వారు ఆకాంక్షించారు.

March 6, 2026 / 07:00 PM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వంది హడావిడి తప్ప అభివృద్ధి లేదు’

BDK: 800 రోజుల్లో చేయలేని ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల్లో ఎలా చేస్తారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నించారు.100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలకే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. BRS ప్రభుత్వ హయాంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పేరు మార్చి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.

March 6, 2026 / 07:00 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిండికేట్ దందా..?

WGL: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ భయాల నేపథ్యంలో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అదనుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోల్‌సేల్ వ్యాపారులు సిండికేట్‌గా మారి భారీగా దిగుమతులు చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్లాన్‌‌పై ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

March 6, 2026 / 07:00 PM IST