కోనసీమ: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షలో ఆత్రేయపురం మండలం ర్యాలీ హైస్కూల్లో 8 వ తరగతి చదువుతున్న బీ.ఇషిత విజయం సాధించింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున 4 సంవత్సరాలకు రూ. 48 వేలు స్కాలర్షిప్ అందజేయనుంది. ఈ సందర్భంగా ఆమెను హెచ్ఎం ఎన్.సూరిబాబు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు శుక్రవారం అభినందించారు.