• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాదకద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం

ASR: హుకుంపేట మండలం సూకూరులో శుక్రవారం SI దుర్గా ప్రసాద్ పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు అధికారులకు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు.

February 21, 2026 / 08:41 AM IST

నేటి నుంచి పల్నాటి తిరుమల ‘నేతి వెంకన్న’ ఉత్సవాలు

PLD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పల్నాటి తిరుమలలో ‘నేతి వెంకన్న’ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారు పైకప్పు లేకుండా ప్రకృతి ఒడిలో భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలోని నాలుగు శనివారాలతో పాటు ఉగాది వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

February 21, 2026 / 08:41 AM IST

రాజకీయ సవాళ్లతో కామారెడ్డిలో హై టెన్షన్..!

KMR: జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 16వ తేదీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, MLA KVRపై అవినీతి ఆరోపణలు చేయగా, దానికి కౌంటర్‌గా షబ్బీర్ అలీపై MLA ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా.. MLA డిగ్రీ కళాశాల ఆస్తులపై నేడు బహిరంగ చర్చకు రావాలని పిలుపునివ్వడంతో నాయకులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 08:40 AM IST

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

GDWL: ధరూరు మండలం జాంపల్లి శివారులో శుక్రవారం పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై నందికర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.37 వేల నగదు, 2 బైకులు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మిగతా వారు పరారీలో ఉన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 21, 2026 / 08:36 AM IST

పేకాట స్థావరంపై దాడి.. నలుగురు అరెస్ట్

కృష్ణా: గూడూరు మండలం చిట్టి గూడూరులో పేకాట స్థావరంపై ఎస్సై దివ్య ప్రకాశ్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

February 21, 2026 / 08:36 AM IST

FSL అగ్నిప్రమాదంలో కీలక మలుపు

TG: హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన అగ్రిప్రమాదం ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 1100 కేసుల ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్‌పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఈ ఫైల్స్ రికవరీకి ప్రయత్నాలు చేసినప్పటికీ డేటా రికవరీ సాధ్యం కాదని తేల్చింది.

February 21, 2026 / 08:36 AM IST

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా శనివారం 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 14.045 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.

February 21, 2026 / 08:35 AM IST

కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎంపిక

W.G: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సుంకర కాశీవిశ్వేశ్వరరావు నియామకమయ్యారు. శుక్రవారం ఆయనకు నియామకపత్రంను జిల్లా నాయకులు అందించారు. బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలను గౌరవిస్తూ తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడు వెంకట సూర్యనారాయణ రాజు నియామక పత్రాన్ని అందజేశారని కాశీ తెలిపారు.

February 21, 2026 / 08:35 AM IST

ఆత్మహత్యకి యత్నించిన వ్యక్తి మృతి

CTR: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కె. శేఖర్ (43) అనే వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య వివరాల మేరకు.. గిరింపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన శేఖర్ శివరాత్రి రోజున మద్యం తాగడంతో అతని భార్యతో వాగ్వాదం జరిగింది. దీంతో శరీరంపై శేఖర్ ఆయిల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

February 21, 2026 / 08:35 AM IST

స్త్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలి: DRDO

KMM: స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలు పెండింగ్ ఉంచకుండా సకాలంలో చెల్లించాలని ఖమ్మం డీఆర్డీవో పీడీ శ్రీరామ్ స్పష్టం చేశారు. గ్రామదీపికల నిర్లక్ష్యం వల్ల వడ్డీ భారం పెరుగుతుందని, అవకతవకలకు తావులేకుండా వసూళ్లు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి, హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

February 21, 2026 / 08:34 AM IST

‘ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుంది’

BHNG: ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుందని, రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చి ఓట్లు రాబట్టుకునేందుకే ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. శుక్రవారం గుండాల మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందన్నారు.

February 21, 2026 / 08:34 AM IST

రేపు జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

MHBD: మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన బీగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రాష్ట్ర సవింధాన్ కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు రెడ్యాల గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.

February 21, 2026 / 08:33 AM IST

NGKL: విద్యుత్ సరఫరాకు అంతరాయం

NGKL: కల్వకుర్తి మండలం తాండ్ర సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జానకిరామ్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 08:32 AM IST

బాపట్ల తీర అభివృద్ధిపై గోవాలో కలెక్టర్ పర్యటన

BPT: బాపట్ల తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ వినోద్ కుమార్ బృందం శుక్రవారం గోవాలో పర్యటించింది. అక్కడి తీర ప్రాంత నియంత్రణ మండలి (GCZMA) అధికారులతో వ్యర్థాల నిర్వహణపై చర్చించారు. కాండోలిమ్ బీచ్, ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియంలను సందర్శించి పర్యాటక సౌకర్యాలను పరిశీలించారు. బాపట్ల తీర ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.

February 21, 2026 / 08:31 AM IST

గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

NLR: కావలి మండలం బిట్రగుంట – అల్లూరు రోడ్ RSల మధ్య km no 206/c16 – c17 పోస్టుల మధ్య మూడవ లైన్ మధ్యలో గూడ్స్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి (50-55) బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడని మృతుని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

February 21, 2026 / 08:31 AM IST