ATP: ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ. 44,74,717 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతపురంలోని తన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
VZM: గరివిడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు చిత్తూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అండర్-14,17లో కుమారి శ్రీనిధి కు రజతం, భార్గవి రజితం, కీర్తి కి కాంస్యం, సాయి కి కాంస్యం పథకాలు సాధించారని ఇంఛార్జ్ హెచ్ఎం శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జెడ్పీటీసీ సభ్యులు వాకడ శ్రీను, ఉప సర్పంచ్ కార్తీక్ అభినందించారు.
SKLM: ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ టీ.ఎఫ్ ఉపాధ్యాయ శాఖ రాష్ట్ర కౌన్సిలర్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
AKP: బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్‌లో రజిత పతకం సాధించిన పోలీస్ కానిస్టేబుల్ జి. శ్రీనివాసరావును ఎస్పీ తుహీన్ సిన్హా అభినందించారు. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ఈ నెల 9న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రజిత పథకం సాధించిన శ్రీనివాసరావు పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. శుక్రవారం కానిస్టేబుల్‌ను ఎస్పీ సత్కరించారు.
NGKL: చెంచుపెంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్డీటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. చెంచుపెంటలో చేపట్టిన ఇంటింటి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీఏ, గృహ నిర్మాణ శాఖల అధికారులు, RDT ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో SC, ST విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. దళితవాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని వాపోయారు. MPDO అప్పాజీ మాట్లాడుతూ.. గ్రామాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.
NZB: సాలూర మండలం మందార్నా గ్రామంలో ట్రాక్టర్ యజమానులు నిరసన చేపట్టారు. నూతన ఇసుక విధానం మన ‘ఇసుక వాహనం’ రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నూతన విధానం వల్ల స్థానిక వాహన యజమానులకు అన్యాయం జరుగుతోందని సాలూర ఇంఛార్జ్ తహసీల్దార్ అనూషకు తమ గోడును చెప్పుకున్నారు. అయితే, ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ తెలిపారు.
GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో పొలంబడి, పొలం పిలుస్తుంది కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. గుంటూరు రెగ్యులర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్‌రావు మాట్లాడుతూ.. శనగ పంటలో కనిపించే ఎండు తెగులు, వేరు కుళ్లు తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.
NLG: దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌ను 14వ వార్డు కౌన్సిలర్ గాజుల సావిత్రి మురళీ, వడ్డెర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలో వడ్డెర సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.
ఈటీవీ విన్ తన సరికొత్త ఓటీటీ కంటెంట్‌ను ‘విన్ జాతర’ పేరుతో ప్రకటించింది. ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేసింది. ఇందులో విరాజ్ అశ్విన్ నటించిన ‘గుర్తుకొస్తున్నాయి’, విభిన్న కథాంశంతో వస్తున్న ‘జిల్లేడు చెట్టు’, ఉత్కంఠభరితమైన ‘ది అన్‌టోల్డ్ టేల్ ఆఫ్ బ్లడ్-వై గోదావరి’ వంటి సినిమాలు ప్రధాన...
VKB: శుక్రవారం కొడంగల్ మండల పర్సాపూర్ రైతు వేదికలో నూనె గింజల సాగు లాభాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. TRVK కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంటల మార్పిడి కింద నూనె గింజల సాగు రైతులకు పెట్టుబడి ఆదా, చీడపీడల తగ్గింపు వంటి ప్రయోజనాలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ADA శంకర్ రాథోడ్, AO శ్రీలత, EEOలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
RR: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో షాద్‌నగర్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ఏర్పాట్లకు ముందుండి ప్రజలను మెప్పించి మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలన్నారు.
ప్రకాశం: పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రుజువుకావడంతో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ రాజబాబు సస్పెండ్ చేశారు. నిధుల వినియోగంపై నిర్వహించిన విచారణలో అవకతవకలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
లిప్‌స్టిక్ వాడకం నేటి ట్రెండ్‌లో భాగమైనప్పటికీ, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని సీసం, కాడ్మియం వంటి భారలోహాలు దీర్ఘకాలంలో శరీరంలో చేరి ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రసాయనాలు లేని ఆర్గానిక్ లేదా నాన్-టాక్సిక్ ఉత్పత్తులనే ఎంచుకోవడం ఉత్తమం.
MDK: రెండవ విడత అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ ఆర్టీసీ డిపోలో కంటి పరీక్షల శిబిరాన్ని అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీసీ డీఎం సురేఖ, సీఐ మహేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌లు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. నియమాలను పాటించడంతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.