• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లడ్డూ కల్తీ ముమ్మాటికీ కుట్ర: చంద్రబాబు

AP: గత పాలకులు ఆలయాలపై దాడులు జరిగిన పట్టించేకోలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో అందరూ బాధితులే. లడ్డూ కల్తీపై అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, మా ప్రభుత్వంలో నాలుగు అంశాలపై దృష్టి పెట్టాం. అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకులు, వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం పనులు చేపట్టనున్నాం’ అని పేర్కొన్నారు. లడ్డూ కల్తీ ముమ్మాటికీ కుట్రే అని విమర్శించారు.

February 24, 2026 / 02:41 PM IST

పెద్దపల్లి మార్కెట్లో పత్తి గరిష్ట ధర ఎంతంటే.?

PDPL: పెద్దపల్లి మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి వ్యాపారం సజావుగా సాగింది. కనిష్ఠ ధర రూ. 5,707, గరిష్ఠ ధర రూ. 7,464గా నమోదయ్యాయి. మోడల్ ధర రూ. 7,053గా ఉంది. మొత్తం 524 సంచులు, 560.68 క్వింటాళ్ల పత్తి మార్కెట్కు వచ్చింది. 221 మంది రైతులు తమ పత్తిని మార్కెట్కు తీసుకువచ్చారు. మార్కెట్ యార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు ప్రశాంతంగా జరిగాయి.

February 24, 2026 / 02:41 PM IST

KTRకు ఘన స్వాగతం.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు

NZB: ఆదిలాబాద్ వెళ్తున్న మాజీ మంత్రి KTRకు ఆర్మూర్లో బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, పెన్షన్ల పెంపు గురించి అడిగితే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అరాచకాలను బయటపెడతామని హెచ్చరించారు.

February 24, 2026 / 02:40 PM IST

వాహనదారులకు అవగాహన కలిపించిన MLA

WGL: నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాహనదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరు ఎలిమెంట్ ధరించి వాహనం నడపాలని కోరారు.

February 24, 2026 / 02:40 PM IST

బాధిత కుటుంబాలకు అండగా CRMF: ఎమ్మెల్యే

GDWL: అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకోవడమే మా లక్ష్యం అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఐజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన ఈ ఇద్దరి ఆపరేషన్ల నిమిత్తం మొత్తం రూ. 12 లక్షల విలువైన LOC పత్రాలను ఆయన మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సర్కారు సాయం అందటంతో ఆ కుటుంబాల్లో వెలుగులు నిండాయి.

February 24, 2026 / 02:38 PM IST

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

KNR: సైదాపూర్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో మంగళవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్, ఫీల్డ్ కోఆర్డినేటర్ అనూష, రమేష్‌ల ఆధ్వర్యంలో 20 లీటర్ల అగ్ని అస్త్రం తయారీ, దాని ఉపయోగాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరించారు. నేల ఆరోగ్యం, పర్యావరణ కాలుష్యం నివారణకు ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను తెలిపాలి.

February 24, 2026 / 02:38 PM IST

జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా

NZB: న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం NZB బార్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు. న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్​ మోహన్​ గౌడ్​ మాట్లాడుతూ.. మహిళ న్యాయవాది కళ్యాణిపై ఆదివారం రుద్రూర్​లో గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 02:36 PM IST

జిల్లా నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టులు ఖాళీలు

BDK: భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం శుభవార్త చెప్పారు. పాల్వంచలోని ప్రైవేట్ సంస్థలు 25 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. టెన్త్ పాసై, 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న పురుష అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈనెల 26న చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 02:36 PM IST

అతిథి అధ్యాపకులకు గుడ్ న్యూస్..!

KDP: యోగివేమన యూనివర్సిటీ పీజీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్ తెలియజేసారు.ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా,సంబంధిత ఒరిజినల్ సర్టిఫి కెట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 02:35 PM IST

ఘనంగా రామక్కమ్మ ఆరాధన ఉత్సవాలు

CTR: విజయపురం(మం) కొసలనగరం మీట్టూరు శ్రీ రామక్కమ్మ ఆశ్రమం నందు మంగళవారం 46వ ఆరాధాన ఉత్సవాలు ఆశ్రమ నిర్వాహలు వాసుదేవ స్వామి నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన భక్తులు వేల సంఖ్యలో హాజరై అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఉదయం నుంచి దర్శన ఏర్పాట్లు, అన్నదానం ఏర్పాటు చేశారు. కోలాటం, చెక్కభజన, హారికధ, ప్రదర్శించారు.

February 24, 2026 / 02:35 PM IST

సైక్లింగ్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్

PLD: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రతి నెల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా వెల్లడించారు. మంగళవారం నరసరావుపేటలో కోడెల క్రీడా ప్రాంగణంలో జరిగిన జూనియర్ అండర్-18 సైక్లింగ్ (వ్యక్తిగత, మాస్టర్ విభాగాలు) పోటీలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

February 24, 2026 / 02:35 PM IST

మీ ప్లేట్‌లోని వంట నాణ్యతను ఏఐ పరీక్షిస్తుంది..!

ఆహార నాణ్యత, పోషకాలను పర్యవేక్షించే కొత్త ఏఐ వ్యవస్థను ఉద్యోగ్ యంత్ర ఏఐ సంస్థ ప్రదర్శించింది. ఏఐ సెన్సర్లు, కెమెరాల ద్వారా వంటలో వాడే దినుసుల పరిమాణాన్ని, నాణ్యతను ఇది గణిస్తుంది. వంట పూర్తయ్యాక అందులోని క్యాలరీలు, విటమిన్ల వివరాలను తెరపై చూపిస్తుంది. ఈ సాంకేతికత ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సంస్థ తెలిపింది.

February 24, 2026 / 02:34 PM IST

రోడ్డు ప్రమాదం..ఓ వ్యక్తికి గాయాలు..!

ELR: తంగెళ్ళమూడిలోని గౌరీ దేవి గుడి క్రాస్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో మంగళవారం ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. క్రాస్ రోడ్డులో నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని ప్రైవేట్ బస్సు ఢీకొనగా అక్కడికక్కడే పడిపోయాడు. స్వల్పగాయలవ్వడంతో క్షతగాత్రుడుని అక్కడ ఉన్న వారు చికిత్సకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 24, 2026 / 02:33 PM IST

పన్ను వసూళ్లలో ఆదర్శంగా నిలిచిన డిప్యూటీ ఎంపీడీవో

ELR: ఉంగుటూరు గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్తి పన్ను వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పరిశీలించారు. పంచాయతీ సచివాలయ సిబ్బందితోపాటు ఆయన కూడా ఇంటింటికి ఆస్తి పన్ను కులాయి పన్ను చెల్లించాలని కోరారు. ఉంగుటూరు గ్రామం పన్ను వసూళ్లలో ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ ఎంపీడీవో అన్నారు. కార్యదర్శి రవి పాల్గొన్నారు.

February 24, 2026 / 02:33 PM IST

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి

TG: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం శక్తిమంతమైన ప్రదేశమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే  నిర్మిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

February 24, 2026 / 02:32 PM IST