KNR: సైదాపూర్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో మంగళవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్, ఫీల్డ్ కోఆర్డినేటర్ అనూష, రమేష్ల ఆధ్వర్యంలో 20 లీటర్ల అగ్ని అస్త్రం తయారీ, దాని ఉపయోగాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరించారు. నేల ఆరోగ్యం, పర్యావరణ కాలుష్యం నివారణకు ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను తెలిపాలి.